సునీతా విశ్వనాథ్ కు వైట్ హౌస్ పురస్కారం
వాషింగ్టన్: పర్యావరణ పరిరక్షణ కోసం సేవలందించేవారికి అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ అందించే ‘చాంపియన్ ఆఫ్ చేంజ్’ పురస్కారానికి భారత సంతతి అమెరికన్ సునీతా విశ్వనాథ్ ఎంపికయ్యారు. సునీత సహా 12 మంది ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.
30 ఏళ్లుగా సునీత మహిళా సంఘాలు, మానవ హక్కుల సంస్థలతో కలసి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారని, పర్యావరణ పరిరక్షణలో హిందువులను భాగస్వాములను చేసినందుకుగానూ ఆమెను చాంపియన్ ఆఫ్ చేంజ్ పురస్కారానికి ఎంపిక చేసినట్టు వైట్‌హౌస్ పేర్కొంది.
చెన్నైలో జన్మించిన సునీత అమెరికాలో స్థిరపడ్డారు. సాధనా, ఫ్రంట్ లైన్ ఉమెన్స్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, ఉమెన్ ఫర్ ఆఫ్ఘాన్ ఉమెన్ తదితర సంస్థల్లో ఆమె క్రియాశీల సభ్యురాలు.