ట్రంప్ కేబినెట్‌లో బాబీ!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధించిన ట్రంప్ కేబినెట్‌లో భారతీయ అమెరికన్ బాబీ జిందాల్‌కు స్థానం లభించనుందని మీడియా పేర్కొంటోంది. జిందాల్ లూసియానా గవర్నర్‌గా రెండు సార్లు పనిచేయడం తెలిసిందే. ట్రంప్ కేబినెట్‌లో జిందాల్‌కు స్థానం దక్కితే.. ఆ పదవి పొందిన తొలి భారతీయ అమెరికన్‌గా రికార్డులకెక్కుతారు. అంతేకాకుండా యూఎస్ కాంగ్రెస్‌కు ఎన్నికరుున రెండవ అమెరికన్ అవుతారు.బెన్ కార్సన్‌తో కలసి జిందాల్‌ను ఆరోగ్య కార్యదర్శిగా నియమించే అవకాశం ఉన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. వీరిద్దరూ రిపబ్లికన్ పార్టీ తరఫున దేశాధ్యక్ష ఎన్నికలకు పోటీపడడం తెలిసిందే.
సుప్రీం జడ్జీల నామినీల్లో అముల్!
అమెరికా సుప్రీంకోర్టు జడ్జి పదవి కోసంట్రంప్ తయారుచేసుకున్న జాబితాలో భార తీయ అమెరికన్ జడ్జి అముల్ థాపర్(47) చోటు దక్కించుకున్నారు. ముగ్గురు సుప్రీం జడ్జీల ఎంపిక కోసం 21 మందితో కూడిన ఈ జాబితాలో అముల్ గట్టి అభ్యర్థి.