న్యూయార్క్: అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన నవీన్ శంకర్ సుబ్రమణ్యం గ్జేవియర్ (44) అనే భారత–అమెరికన్‌కు మోసం కేసులో అమెరికా కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఫ్లోరిడాలోని ఎసెక్స్ హోల్డింగ్స్ సంస్థకు మాజీ సీఈవో అయిన నవీన్ శంకర్ ఈ సంస్థ ద్వారానే దాదాపు 100 మంది పెట్టుబడిదారులను మోసం చేసినట్లు వెల్లడైంది.
మొదటి స్కీమ్‌లో వీరిలో కొందరి నుంచి 33 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.213 కోట్లు)ను సేకరించి చిలీలోని ఇనుప గనుల్లో పెట్టుబడి పెట్టినట్లు.. రెండో స్కీమ్‌లో దాదాపు 1.2 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.7.75 కోట్లు)ను దక్షిణ కరోలినాలోని ఎకానమిక్ డెవలప్‌మెండ్ ఫండ్‌లో పెట్టినట్లు నవీన్ నమ్మించారు. అనుమానం వచ్చి కొందరు నిలదీయగా కొత్త పెట్టుబడిదారులను ఆహ్వానించి వారి వద్ద సేకరించిన దాన్ని కొందరు పాతవారికిచ్చేశాడు. జనవరిలో ఈ కేసుకు సంబంధించి విచారణ పూర్తవగా నవీన్ శంకర్ దోషిగా తేలటంతో మియామీ కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
మోసం కేసులో భారత–అమెరికన్‌కు జైలు
Published Sat, May 20 2017 12:34 AM | Last Updated on Tue, Sep 5 2017 11:31 AM
Advertisement