సాధారణంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు సైతం వారానికో, నెలకో షాపింగ్ చేస్తూ ఉంటారు. అయితే వందల కోట్లకు అధిపతి అయినప్పటికీ చాలా సింపుల్‌గా, ఎంతో మందికి ఆదర్శమైన ఒక మహిళ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇన్ఫోసిస్ అనగానే గుర్తొచ్చేది 'నారాయణ మూర్తి', కానీ ఈ రోజు ఇన్ఫోసిస్ ఆ స్థాయిలో ఉందంటే దానికి పెట్టుబడి 'సుధా మూర్తి' ఇచ్చినదే అని చాలామందికి తెలియకపోవచ్చు. సుధా మూర్తి నేడు సుమారు రూ. 775 కోట్లు సంపద కలిగి ఉన్నప్పటికీ గత 24 సంవత్సరాల్లో ఒక్క చీర కూడా కొనలేదు అంటే చాలా మంది నమ్మకపోవచ్చు. అయితే ఇది నిజం.
నిజానికి సింప్లిసిటీ గురించి మాట్లాడాల్సి వస్తే తప్పకుండా ఎవరైనా సుధా మూర్తి గురించి మాట్లాడతారు. 1950 ఆగష్టు 19న జన్మించిన సుధామూర్తి ఉన్నత భావాలు కలిగిన విద్యావేత్త, రచయిత్రి మాత్రమే కాదు.. ఎంతో మందికి సహాయం చేసే పరోపకారి కూడా. ఈమెకు 2023లో భారత ప్రభుత్వం దేశంలో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ అందించింది.
చీరలు కొనకపోవడానికి కారణం..
24 సంవత్సరాలుగా చీరలు కొనకపోవడానికి వెనుక ఒక కారణం కూడా ఉందని తెలుస్తోంది. కాశీకి వెళ్ళినప్పుడు పవిత్ర గంగా స్నానం చేసి షాపింగ్ (ముఖ్యంగా చీరలు కొనడం) మానేస్తాని చెప్పుకోవడమే అని తెలుస్తోంది. ఎవరైనా గంగా నదిలో తమకు ఇష్టమైన వాటిని వదిలిపెడితే మంచి జరుగుతుందని నమ్ముతారు. కానీ సుధా మూర్తి చీరలు కొనటం మానేసింది.
ఇదీ చదవండి: చంద్రయాన్-3 సక్సెస్.. ఇస్రో ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా?
సుధా మూర్తి ఇష్టాలతో నారాయణ మూర్తి కూడా ఏకీభవించారు. ఈ కారణంగానే వారు ఎలాంటి ఆడంబరాలు లేకుండా చాలా సాదాసీదాగా ఉంటారు. వీరిరువురూ పుస్తకాలు మాత్రం విరివిగా కొనుగోలు చేస్తారు. ఇప్పటికి వీరు 20,000కంటే ఎక్కువ బుక్స్ సేకరించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment