అందిరిలానే ఓ సాధారణ అమ్మాయి నీతా. అనుకోకుండా ఓ సంపన్న కుటంబం తమ కోడలిగా చేసుకుంటానని ముందుకొచ్చింది. అందరిలా ఎగిరి గంతేయ్యలేదు. ఇద్దరి మనసులు కలిసాకే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఆఖరికి కోడలిగా అడుగుపెట్టిన తన ఉద్యోగం మాత్రం వదిలేయనని తెగేసి చెప్పింది. నిజానికి ఆమె గొప్పింటి కోడలిగా రాజభోగాలు అనుభవిస్తూ ధర్జాగా కాలుపై కాలు వేసుకుని కూర్చొవచ్చు అందుకు ఆమె అంగీకరించలేదు. తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర ఉండాలనుకుంది. కేవలం ముఖేష్ అంబానీ వైఫ్ నీతాగా గుర్తింపు కంటే తన ఆత్మగౌరవంతో ఆర్జించుకన్న గుర్తింపుకే ప్రాధాన్యత ఇచ్చింది. ఆ విలక్షణమే అమెను పవర్ ఫుల్ విమెన్‌గా ఫోర్బ్స్ మ్యాగజైన్‌లో చోటు దక్కేలా చేసింది. పైగా సక్సెస్‌ఫుల్ విమెన్‌కి అసలైన నిర్వచనంగా నిలిచింది నీతా అంబానీ.
ముంబైలో స్థిరపడిన గుజరాతీ కుటుంబం నీతాది. ఆమె కామర్స్‌లో డిగ్రీ చేశారు. భరత నాట్యంలో కూడా ప్రావీణ్యం ఉంది. ఒకరోజు ఎప్పటిలానే ప్రదర్శన ఇచ్చి ఇచ్చారు. అది ధీరుబాయ్ అంబానీ కుటుంబం కంటపడింది. ఆమె నృత్య ప్రదర్శన, చలాకీతనం ధీరుబాయ్ దంపతులకు ఎంతాగనో నచ్చింది. తమ పెద్ద కుమారుడికి ఆమెను ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకున్నారు. అప్పటికే అంబానీలకు పెద్ద ధనవంతుల కుటుంబమని మంచి ఫేమ్ ఉంది.
అయితే ఈ విషయం నీతా చెవిన పడింది. కానీ ఆమె ఎగిరి గంతెయ్యలేదు. పైగా తమ ఇరువురి అభిప్రాయాలు కలిస్తేనే పెళ్లి చేసుకుంటానని ధైర్యంగా చెప్పింది. ఇక పెళ్లయ్యాక కూడా తాను చేసే టీచర్ ఉద్యోగాన్ని కంటిన్యూ చేస్తానని షరతు కూడా విధించింది. అయితే అప్పుడూ ఆమె జీతం రూ. 800/-. అయినా ఇప్పుడూ అంబానీ కోడలివి అది ఏ పాటిదన్న ససమేరా అంది. పైగా అది తన ఆత్మగౌరవం అని తేల్చి చెప్పింది.
ఓ తల్లిగా పిల్లలను..
ఆమె పిల్లల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించేవారేమె. తన పిల్లలను మధ్య తరగతి పిల్లల్లానే పెంచేవారట. అయితే ప్రతి శుక్రవారం పిల్లలకు కొనుక్కోవడానికి రూ.5/- ఇచ్చేవారట. ఒకరోజు చిన్న కొడుకు అనంత్ నువ్వు రూ. 5లే తెచ్చుకుంటున్నావ్.. అంబానీ కొడుకువేనా అని స్నేహితులు హేళన చేస్తున్నారని మారం చేశాడు. ఆ ఘటన నీతాను కదిలించినా చిన్నపిల్లలకు ఎక్కువ డబ్బులు ఇవ్వకూడదన్న ఉద్దేశ్యంతో సర్ది చెప్పి పంపించారట. అలాగే వారిపై ఆంక్షలు విధించేవారట. స్వేచ్ఛగా వారి నిర్ణయాలు తీసుకుని కెరియర్‌లో రాణించేలా చేసేవారట.
సమానత్వానికే పెద్ద పీట..
ఎవ్వరైనా మీకు ఇద్దరు వారసులు కదా అని అడిగితే కాదు ముగ్గురు అని సవరించేవారట నీతా. అంతేగాదు తన కూతురు ఇషా అంబానీని నువ్వు ఎవ్వరికీ తీసిపోవంటూ కూతురిని వ్యాపారం రంగంలో ప్రోత్సహించారు నీతా. అదుకే ఇషా విజయవంతంగా వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఆఖిరికి అనంత్ అంబానీ బరువు విషయంలో ఎంతగా ఇబ్బంది పడ్డాడో, హేళనలకు గురయ్యేవాడో పలు ఇంటర్యూల్లో ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు.
అందుకోసం ఆమె అతని తోపాటు యోగా, వ్యాయామాలు చేసి 90 కేజీలు బరువున్న ఆమె కాస్త 50 కేజీలకు వచ్చి కొడుకుకి ఆదర్శంగా నిలిచి చూపించింది. అయితే అనంత్ కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకుని బరువు తగ్గి చూపించాడు. అయితే అనారోగ్యం కారణంగా మళ్లీ అనూహ్యంగా చాలా బరువు పెరిగిపోవడం జరిగింది. ఆ సమయంలో మరింతగా బాధపడుతున్న అనంత్‌కి తనలో ఉన్న లోపాలను చూడొద్దని, సానుకూలతలనే చూడమని చూపింది. అందువల్లే ముగ్గురు పిల్లలు కూడా 'అమ్మే మా ధైర్యం' అని పలు ఇంటర్యూల్లో ముక్త కంఠంతో చెప్పారు.
తొలి మహిళా బోర్డు సభ్యురాలు ఆమె..
ఇల్లు, పిల్లలే జీవితం అనుకోలేదు. ధీరూభాయ్ అంబానీ స్కూల్ ప్రారంభించి దేశంలో ప్రముఖ స్కూళ్లలో ఒకటిగా నిలిపారు. కుటుంబ వ్యాపారం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లోకి అడుగుపెట్టి తొలి మహిళా బోర్డు సభ్యురాలయ్యారు. అప్పుడే కీలక పదవుల్లో మహిళా ప్రాధాన్యంపై చర్చలు ప్రారంభమయ్యాయి. ఐపీఎల్ ‘ముంబయి ఇండియన్స్’ సహా ఎన్నో వెంచర్లు ప్రారంభించి, విజయం సాధించారు. కళలంటే ప్రాణం. వాటిని ప్రోత్సహించడానికి ‘స్వదేశీ మార్ట్’, ‘జియో వరల్డ్ సెంటర్’, ‘నీతా ముకేష్ అంబానీ కల్చరల్ సెంటర్’ వంటివీ ప్రారంభించారు. తాజాగా రియలన్స్ ‘డిస్నీ ఇండియాను’ విలీనం చేసుకునే పనిలో ఉంది. దానికి ఛైర్‌పర్సన్ కూడా నీతానే!. ఇలా కెరీర్ పరంగాను సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోయారామె. ఈ విజయాలే ఆమెను పవర్‌ఫుల్ బిజినెస్ విమెన్’గా ఫోర్బ్స్ జాబితాలో నిలచేలా చేసింది. ఎన్నెన్నో పురస్కారాలను అందుకునేలా చేసింది.
సేవలోనూ ముందుటారామె..
తన మూలాలను ఎప్పుడూ మర్చిపోలేదు నీతా. అందుకే 1997 జామ్‌నగర్‌లో రిలయన్స్ రిఫైనరీలో చేసే ఉద్యోగుల కోసం కాలనీ నిర్మించారు. 17వేలమంది కోసం నిర్మించిన దానిలో లక్ష మొక్కలు నాటించారు. అంతేకాదు రిలయన్స్ ఫౌండేషన్ ప్రారంభించి మారుమూల గ్రామాలు, పట్టణాల్లో విద్య, ఆరోగ్యం, కళల అభివృద్ధికి కృషి చేశారు. ‘ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్’ ద్వారా లక్ష మంది చిన్నారులను విద్య, ఆటలకు చేరువ చేశారు. బ్రెయిలీ లిపిలో న్యూస్‌పేపర్, ఉచిత కంటి ఆపరేషన్లు... వంటి ఎన్నో సేవ కార్యక్రమాలు చేశారు. అలాగే హర్ సర్కిల్’ పేరుతో మహిళా సాధికారతకు ఎంతగానో కృషిచేశారు.
(చదవండి: లావుగా ఉన్నావంటూ బిడ్డతో సహా భార్యను వదిలేశాడు..కానీ ఆమె..!)
Comments
Please login to add a commentAdd a comment