
న్యూఢిల్లీ: ఇంట్లో పనిచేసే సహాయకులకు ఏ పండగ్గో,పబ్బానికో కొత్త బట్టలు, లేదంటే ఎంతో కొంత నగదు బోనస్‌లు ఇవ్వడం సహజం. ఎంత పెద్ద గొప్ప వ్యాపారవేత్తలయినా కాస్త అటూ ఇటూగా దాదాపు ఇదే చేస్తారు. కానీ మలేషియాకు చెందిన మహిళా వ్యాపారవేత్త మాత్రం అద్భుతమైన బహుమతి ఇచ్చి వార్తల్లో నిలిచింది.
వెబ్‌సైట్ మదర్‌షిప్ ప్రకారం, ఫరావెన్ అనే మహిళ తన ముగ్గురు ఇంటి పనివాళ్లకు భారీ బహుమతి ఇవ్వడం ఇపుడు హాట్ టాపిక్. తన ముగ్గురు మహిళా గృహ సహాయకులకు సుమారు రూ. 1.8 లక్షల గిఫ్ట్ ఇచ్చింది. దీనికి సంబంధించిన కవర్లు ఇస్తూ టిక్‌టాక్ వీడియోను ఫరా షేర్ చేసింది. ముస్లింలకు అతిపెద్ద సెలవుదినాలలో ఒకటైన హరి రాయ (దీనిని హరి రాయ ఐడిల్‌ఫిత్రి అని కూడా పిలుస్తారు) కోసం ద్వీపానికి వెళ్లి ఎంజాయ్ చేయడానికి ఏర్పాటు చేసింది.
(ఇది కూడా చదవండి: బంపర్ ఆఫర్! ఏడాది వేతనంతో కూడిన సెలవు! ఎక్కడ?)
డిపింగ్ పూల్, బాత్‌టబ్, లాంజ్ ఏరియాతో కూడిన విలాసవంతమైన ప్రైవేట్ సూట్‌లో ఎంజాయ్ చేసేలా అవకాశం కల్పించింది. ఇందుకోసం వారికి హెలికాప్టర్ ఏర్పాటు చేయడం విశేషం. ఈ వీడియోలో హెలికాప్టర్‌లో సదరు ద్వీపానికి ప్రయాణం అవ్వడాన్ని, అలాగే యజమాని చేసిన పనికి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతూ, ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలను మనం ఈ వీడియోలో చూడొచ్చు.
Jadi bibik pun dapat duit raya 5 angka, siap dapat pakej healing 😭 pic.twitter.com/94Sz6Gzj6V
— 🇲🇾 (@localrkyt) April 13, 2023
టిక్‌టాక్‌లో మిలియన్ల వ్యూస్‌తో ఈ వీడియో వైరల్‌గా మారింది. దీంతో ఇతర సోషల్‌మీడియాల్లోనూ చక్కర్లు కొడుతోంది. ఆమె దాతృత్వాన్ని కొంతమంది నెటిజన్లు ప్రశంసించారు. మరి కొందరు ఇది వాళ్లకి సంతోషాన్నిస్తుందా అని, ఇది ఫేక్ అని మరికొంతమంది వ్యాఖ్యానించారు. అయితే ఇంట్లో పనిచేసే మహిళల పట్ల ఓనర్లు ఔదార్యాన్ని చూపించడం ఇదే మొదటిసారి గతేడాది దీపావళి రోజున చెన్నై వ్యాపారి తన సిబ్బందికి రూ.1.2 కోట్లకు పైగా విలువైన కార్లు, బైక్‌లను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. (క్రెడిట్‌కార్డు వాడుతున్నారా? ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా..గుదిబండే!)
Comments
Please login to add a commentAdd a comment