ఒకప్పుడు వంటింటికి మాత్రమే పరిమితమైన ఆడవాళ్లు ఈ రోజు అంతరిక్షానికి కూడా వెళ్లి వచ్చేస్తున్నారు. దీన్ని బట్టి మహిళలు ఎంతగా ఎదిగారనేది స్పష్టంగా తెలిసిపోతుంది. ఎంతోమంది స్త్రీలు తమ ఆలోచనలతో గొప్ప వ్యాపారవేత్తలుగా ఎదిగారు. ఈ కోవకు చెందినవారిలో ఒకరు మామా ఎర్త్ కో ఫౌండర్ 'గజల్ అలఘ్' (Ghazal Alagh). ఈ కథనంలో గజల్ ఎవరు? ఆమె సాధించిన సక్సెస్ ఏంటి? నెట్ వర్త్ ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
హర్యానాలో జన్మించిన ఈమె 2010లో పంజాబ్ యూనివర్శిటీ నుంచి కంప్యూటర్ అప్లికేషన్‌లో డిగ్రీ, 2013లో న్యూయార్క్ అకాడమీ ఆఫ్ ఆర్ట్‌లో డిజైన్ అండ్ అప్లైడ్ ఆర్ట్స్‌లో సమ్మర్ ఇంటెన్సివ్, మోడరన్ ఆర్ట్‌లో ఫిగరేటివ్ ఆర్ట్‌లో ఇంటెన్సివ్ కోర్సును పూర్తి చేసింది.
మామా ఎర్త్ ప్రారంభం
నిజానికి 2008 నుంచి 2010 వరకు ఎన్ఐఐటీ లిమిటెడ్‌లో కార్పొరేట్ ట్రైనర్‌గా పనిచేస్తూ.. కొందరికి సాఫ్ట్‌వేర్ అండ్ కోడింగ్ లాంగ్వేజ్‌లో ట్రైనింగ్ అందించింది. చదువు పూర్తయ్యి పెళ్లయిన తరువాత 2016లో తన భర్త 'వరుణ్ అలఘ్'తో కలిసి 'మామా ఎర్త్' ప్రారంభించింది.
మామా ఎర్త్ ద్వారా గజల్ అలఘ్ చిన్న పిల్లలకు పర్యావరణ అనుకూలమైన వ్యక్తిగత పరిశుభ్రత ఉత్పత్తులను రూపొందించడం ప్రారంభించింది. ఇందులో భాగంగానే రాష్ క్రీమ్‌లు, లోషన్లు, షాంపులు, మసాజ్ ఆయిల్‌లు, బాడీ వాష్‌లు, డైపర్‌లను తయారు చేసి విక్రయించడం ప్రారంభించారు. ఈ ఉత్పత్తులు ఆనతి కాలంలోనే ప్రజాదరణ పొందగలిగాయి.
రూ. 9800 కోట్లు
గజల్ అలఘ్ ప్రస్తుతం మామా ఎర్త్ సంస్థ ద్వారా పిల్లల సంరక్షణలో ఉపయోగించే దాదాపు 500 వస్తువులను విక్రయిస్తూ.. ఆసియాలో సేఫ్ సర్టిఫైడ్ బ్రాండ్‌గా అవతరించింది. రూ. 25 లక్షలతో ప్రారంభమైన మామా ఎర్త్ సంపద రూ. 9,800 కోట్లకు పెరిగినట్లు సమాచారం.
ఇదీ చదవండి: వేతనాల్లో ఇంత తేడానా? పదేళ్లలో పెరిగిన సీఈఓ, ఫ్రెషర్స్ శాలరీ రిపోర్ట్
వీకెండ్ కార్పోరేట్ ట్రైనర్‌గా మొదట సంపాదించిన డబ్బు కేవలం 1,200 రూపాయలు మాత్రమే, దాంతో మా అమ్మను షాపింగ్‌కి తీసుకెళ్ళడం ఎప్పటికి మరచిపోలేని అనుభూతిని మిగిల్చిందని ఎక్స్‌లో ఇటీవలి పోస్ట్ చేసింది. ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగిన గజల్ అలఘ్ 'షార్క్ ట్యాంక్ ఇండియా' రియాలిటీ షో ద్వారా ప్రసిద్ధి చెందింది. ఈమె మొత్తం ఆస్థి విలువ వంద కోట్లు కంటే ఎక్కువ ఉంటుంది.
My first income was modest, earning Rs 1200/day as a weekend corporate trainer.
— Ghazal Alagh (@GhazalAlagh) October 16, 2023
I recall the joy of taking my mom shopping and sharing a memorable dinner.
What about you? How did you use your first earnings?
Comments
Please login to add a commentAdd a comment