Indian Barbie Doll: కాలానుగుణంగా, ప్రమాణాలకు అనుగుణంగా మారుతూ వస్తున్న బార్బీ బొమ్మలు తాజాగా మరో కొత్త రూపును సంతరించుకున్నాయి. కేవలం అందానికే పరిమితమైన బార్బీ బొమ్మ తొలిసారి కొత్తగా ముస్తాబైంది. ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా, భారతీయ వ్యాపార మహిళగా 2022 బార్బీని తీసుకొచ్చామని కంపెనీ వెల్లడించింది.
బార్బీ బొమ్మల తయారీ సంస్థ మాట్టెల్, మేకప్ బ్రాండ్ లైవ్ టింటెడ్ వ్యవస్థాపకురాలు, సీఈఓ దీపికా ముత్యాల సహకారంతో ఈ లేటెస్ట్ బార్బీ బొమ్మ రూపుదిద్దుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను దీపిక ముత్యాల తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. లాంగ్ జుంకీలు, బ్యాంగిల్స్‌తో ప్యాంట్‌సూట్‌ను ధరించిన బార్బీ బొమ్మలను ఆమె పోస్ట్ చేశారు. లేత రంగు చర్మం, పెద్ద పెద్ద కళ్లు, చక్కగా తీర్చిదిద్దిన కనుబొమ్మలు, పవర్ సూట్‌తో హుందాగా ఉన్న 2022 బార్బీని కలవండి. సాంస్కృతిక అడ్డంకులను తొలగించుకని, సరికొత్త తీరాలనే లక్క్ష్యంతో, దయా దాక్షిణ్యాలతో, ప్రపంచాన్ని జయించాలనే గాఢమైన కోరికతో నిర్భయమైన సీఈఓ మా ఈ కొత్త బార్బీ అని ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment