ప్రపంచవ్యాప్తంగా 20 కంటే ఎక్కువ దేశాల్లో విస్తరించి.. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలలో,భారతదేశంతో 2300 స్టోర్లను కలిగిన ల్యాండ్‌మార్క్ కంపెనీ వారసురాలు & ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరైన 'నిషా జగ్తియాని' (Nisha Jagtiani) గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
దుబాయ్‌లోని అత్యంత ధనవంతులైన భారతీయుల వ్యాపారవేత్తలలో ఒకరైన 'మిక్కీ జగ్తియాని' కుమార్తె 'నిషా జగ్తియాని'. ఈమె లండన్‌లోని కింగ్స్ కాలేజీలో చదువుకుంది. ఆ తరువాత హార్డ్వేర్ బిజినెస్ స్కూల్ నుంచి బిజినెస్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్ పూర్తి చేసింది. ఇది మాత్రమే కాకుండా దుబాయ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ ఇన్నోవేషన్‌కు బోర్డు సభ్యురాలు కూడా.
మిక్కీ జగ్తియాని విషయానికి వస్తే.. ఈయన టాక్సీ డ్రైవర్‌గా, హోటల్ క్లీనర్‌గా కెరీర్ ప్రారంభించాడు. 1973లో మిక్కీ బహ్రెయిన్‌లో బేబీ ఉత్పత్తుల వ్యాపారం ప్రారంభించి తరువాత అనతి కాలంలో బిలియనీర్ వ్యాపారవేత్తగా తన వ్యాపారాన్ని విస్తరించాడు. జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
మిక్కీ జగ్తియాని మరణానంతరం ఆయన భార్య రేణుక ల్యాండ్‌మార్క్ గ్రూప్ సీఈఓగా ఉన్నారు. కాగా వీరి కుమార్తె నిషా జగ్తియాని కంపెనీ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ ముఖేష్ అంబానీ రిలయన్స్ రిటైల్, టాటా గ్రూప్ ట్రెంట్ వంటి వాటికి గట్టి పోటీ ఇస్తోంది.
ఇదీ చదవండి: 300 కోట్ల ట్రిప్పులు.. సంపాదన ఎన్ని కోట్లో తెలిస్తే అవాక్కవుతారు!
ల్యాండ్‌మార్క్ గ్రూప్ దుస్తులు, చెప్పులు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, కాస్మొటిక్, కాస్మొటిక్ ప్రొడక్స్ట్ వంటి వాటిని విక్రయిస్తోంది. అంతే కాకుండా ఈ సంస్థ హాస్పిటాలిటీ అండ్ హెల్త్ రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టి.. తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తోంది. నిషా జగ్తియాని ప్రస్తుతం 9.5 బిలియన్ డాలర్లు లేదా రూ. 78,000 కోట్లకంటే ఎక్కువ సంపద కలిగి ల్యాండ్‌మార్క్ గ్రూప్ బోర్డులో ఒక్కరుగా ఉన్నారు. అంతే కాకుండా గ్రూప్‌లో హ్యూమన్ రిసోర్స్, కమ్యూనికేషన్ అండ్ సిఎస్ఆర్ హెడ్‌గా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment