Landmark Group
-
వేలకోట్ల సామ్రాజ్యానికి వారసురాలు.. ఎవరీ 'నిషా జగ్తియాని'?
ప్రపంచవ్యాప్తంగా 20 కంటే ఎక్కువ దేశాల్లో విస్తరించి.. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలలో,భారతదేశంతో 2300 స్టోర్లను కలిగిన ల్యాండ్‌మార్క్ కంపెనీ వారసురాలు & ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరైన 'నిషా జగ్తియాని' (Nisha Jagtiani) గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. దుబాయ్‌లోని అత్యంత ధనవంతులైన భారతీయుల వ్యాపారవేత్తలలో ఒకరైన 'మిక్కీ జగ్తియాని' కుమార్తె 'నిషా జగ్తియాని'. ఈమె లండన్‌లోని కింగ్స్ కాలేజీలో చదువుకుంది. ఆ తరువాత హార్డ్‌వేర్ బిజినెస్ స్కూల్ నుంచి బిజినెస్ లీడర్షిప్ ప్రోగ్రామ్ పూర్తి చేసింది. ఇది మాత్రమే కాకుండా దుబాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ ఇన్నోవేషన్‌కు బోర్డు సభ్యురాలు కూడా. మిక్కీ జగ్తియాని విషయానికి వస్తే.. ఈయన టాక్సీ డ్రైవర్‌గా, హోటల్ క్లీనర్‌గా కెరీర్ ప్రారంభించాడు. 1973లో మిక్కీ బహ్రెయిన్‌లో బేబీ ఉత్పత్తుల వ్యాపారం ప్రారంభించి తరువాత అనతి కాలంలో బిలియనీర్ వ్యాపారవేత్తగా తన వ్యాపారాన్ని విస్తరించాడు. జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మిక్కీ జగ్తియాని మరణానంతరం ఆయన భార్య రేణుక ల్యాండ్‌మార్క్ గ్రూప్ సీఈఓగా ఉన్నారు. కాగా వీరి కుమార్తె నిషా జగ్తియాని కంపెనీ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ ముఖేష్ అంబానీ రిలయన్స్ రిటైల్, టాటా గ్రూప్ ట్రెంట్ వంటి వాటికి గట్టి పోటీ ఇస్తోంది. ఇదీ చదవండి: 300 కోట్ల ట్రిప్పులు.. సంపాదన ఎన్ని కోట్లో తెలిస్తే అవాక్కవుతారు! ల్యాండ్‌మార్క్ గ్రూప్ దుస్తులు, చెప్పులు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, కాస్మొటిక్, కాస్మొటిక్ ప్రొడక్స్ట్ వంటి వాటిని విక్రయిస్తోంది. అంతే కాకుండా ఈ సంస్థ హాస్పిటాలిటీ అండ్ హెల్త్ రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టి.. తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తోంది. నిషా జగ్తియాని ప్రస్తుతం 9.5 బిలియన్ డాలర్లు లేదా రూ. 78,000 కోట్లకంటే ఎక్కువ సంపద కలిగి ల్యాండ్‌మార్క్ గ్రూప్ బోర్డులో ఒక్కరుగా ఉన్నారు. అంతే కాకుండా గ్రూప్‌లో హ్యూమన్ రిసోర్స్, కమ్యూనికేషన్ అండ్ సిఎస్ఆర్ హెడ్‌గా ఉన్నారు. -
చిన్న నగరాల్లో ఈజీబై స్టోర్లు
రెండేళ్లలో మొత్తం 50 కేంద్రాలు కంపెనీ బిజినెస్ హెడ్ ఆనంద్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెడీమేడ్ దుస్తుల రంగంలో ఉన్న ఈజీబై రెండేళ్లలో స్టోర్ల సంఖ్యను 50కి చేర్చనుంది. ల్యాండ్‌మార్క్ గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీకి ప్రస్తుతం 15 ఔట్లెట్లు ఉన్నాయి. కొత్త దుకాణాలన్నీ దక్షిణాది రాష్ట్రాల్లోనే వస్తాయని ఈజీబై బిజినెస్ హెడ్ ఆనంద్ అయ్యర్ తెలిపారు. ఒక్కో రాష్ట్రంలో విస్తరించిన తర్వాతే మరో రాష్ట్రంలో అడుగుపెడుతున్నట్టు వెల్లడించారు. ఫ్రాంచైజీ అయిన వి-రిటైల్ తెలంగాణలో అతిపెద్ద ఈజీబై స్టోర్‌ను హైదరాబాద్‌లోని కేపీహెచ్బీలో ప్రారంభించిన సందర్భంగా బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక దుకాణాన్ని తెరుస్తామని చెప్పారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఫ్రాంచైజీ విధానంలోనే వీటిని నెలకొల్పుతామన్నారు. ‘ఒక్కో స్టోర్‌కు రూ.1 కోటి దాకా వ్యయం అవుతుంది. సరుకు నిర్వహణ పూర్తిగా కంపెనీయే చూసుకుంటుంది. థర్డ్ పార్టీ ప్లాంట్ల నుంచి నాణ్యమైన దుస్తులను కొనుగోలు చేస్తున్నాం’ అని వివరించారు. ప్రస్తుతం అయిదు స్టోర్లు నిర్వహిస్తున్నామని, డిసెంబరుకల్లా మరో మూడు స్టోర్లు ప్రారంభిస్తామని వి-రిటైల్ డెరైక్టర్ మధుసూధన్ తెలిపారు. దుస్తుల ధర రూ.69-699 మధ్య ఉంది. -
ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ఈజీబై స్టోర్
కంపెనీ బిజినెస్ హెడ్ రాజీవ్ రంజన్ హైదరాబాద్, బిజినెస్‌బ్యూరో: రెడీమేడ్ దుస్తుల విక్రయ రంగంలో ఉన్న ఈజీబై దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ల్యాండ్‌మార్క్ గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీకి ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో కలిపి 9 కేంద్రాలున్నాయి. రెండేళ్లలో వీటి సంఖ్యను 50కి చేరుస్తామని ఈజీబై బిజినెస్ హెడ్ రాజీవ్ రంజన్ బుధవారం తెలిపారు. హైదరాబాద్‌లో విక్రమ్‌పురి, దిల్‌సుఖ్‌నగర్‌లో ఈజీబై స్టోర్లను ప్రారంభించిన సందర్భంగా ఫ్రాంచైజీ అయిన వి-రిటైల్ డెరైక్టర్ మధుసూధన్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. భారత్‌లో ప్రతి జిల్లా కేంద్రానికి 2021 నాటికి విస్తరిస్తామన్నారు. 2015-16లో రూ.100 కోట్ల టర్నోవర్ ఆశిస్తున్నట్టు చెప్పారు. అన్ని ఔట్లెట్లు ఫ్రాంచైజీ విధానంలోనే ఏర్పాటవుతాయని తెలిపారు. తెలుగు రాష్ట్రాలే ప్రాధాన్యత.. ఫ్యాషన్ విషయంలో భారత్‌లో తెలుగు రాష్ట్రాలు ముందు వరుసలో ఉంటాయని రాజీవ్ రంజన్ తెలిపారు. ‘2014లో తొలి స్టోర్‌ను కరీంనగర్లో ఏర్పాటు చేయడం ద్వారా కంపెనీ తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. తొమ్మిదికిగాను ఏడు స్టోర్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో ఏడాదిలో అడుగు పెడతాం. రూ.69 నుంచి దుస్తులు లభించడం ఈజీబై ప్రత్యేకత. 45 రోజులకు ఒకసారి కొత్త వెరైటీలను తీసుకొస్తాం. 1,000కిపైగా రకాలు కొలువుదీరాయి’ అన్నారు. త్వరలో ఆన్‌లైన్‌లోకి ల్యాండ్‌మార్క్ గ్రూప్.. రిటైల్ రంగ దిగ్గజం ల్యాండ్‌మార్క్ గ్రూప్ భారత్‌లో ఈ-కామర్స్ విభాగంలోకి ప్రవేశిస్తోంది. జనవరికల్లా ఇది కార్యరూపంలోకి వచ్చే అవకాశం ఉంది. గ్రూప్ కంపెనీలన్నింటినీ ఒకే వెబ్సైట్ కిందకు తేనుంది. తద్వారా కస్టమర్లకు సులభంగా చేరేందుకు వీలవుతుందన్నది కంపెనీ ఆలోచన. రూ.32,500 కోట్ల టర్నోవర్ కలిగిన దుబాయికి చెందిన ల్యాండ్‌మార్క్ భారత్‌సహా 19 దేశాల్లో రిటైల్, హాస్పిటాలిటీ, హెల్త్కేర్ల్లో నిమగ్నమైంది. ఈజీబై, లైఫ్‌స్టైల్, మ్యాక్స్, బేబీషాప్, హోం సెంటర్, గ్లోరియా జీన్స్, పాలీనేషన్ తదితర బ్రాండ్లు గ్రూప్ సొంతం. డిస్కౌంట్ల వార్‌కు దూరం: ఆన్లైన్ అనగానే ముం దుగా గుర్తొచ్చేది భారీ డిస్కౌంట్లు. వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ఇబ్బడిముబ్బడిగా నిధులు ఇస్తున్నాయి కాబట్టే ఈ-కామర్స్ కంపెనీలు భారీగా డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. తాము మాత్రం డిస్కౌంట్ల వార్‌కు దూరంగా ఉంటామని ఈజీబై బిజినెస్ హెడ్ రాజీవ్ రంజన్ వెల్లడించారు. కంపెనీ వృద్ధికి దోహదం చేస్తుంది కాబట్టే ఆన్‌లైన్‌లోకి అడుగు పెడుతున్నట్టు చెప్పారు. ‘పుస్తకాలు, ఎలక్ట్రానిక్స్‌కు టచ్ అండ్ ఫీల్ అక్కరలేదు. దుస్తులను ప్రత్యక్షంగా చూసి కొనేందుకే అత్యధికులు మొగ్గు చూపుతారు. ఆన్లైన్లో ఫ్యాషన్ వేగంగా మారుతోంది. అందుకు తగ్గట్టుగా కొత్త వెరైటీలను తీసుకు రావడం ద్వారా ఆఫ్లైన్లోనూ పోటీ పడతాం’ అని వెల్లడించారు.