దేశంలో అత్యంత సంపన్న మహిళల్లో ఒకరు. మూడు వేల కోట్లకు పైగా నెట్‌వర్త్.. డాక్టర్ లాల్ పాథలాబ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా విశిష్ట సేవలు. ఎవరీ వందనా లాల్. కొన్ని దశాబ్దాల పాటు సంస్థ కీలక ప్రాతలో ఉంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న వందనాలాల్ విజయగాథపై ఓ లుక్కేద్దాం.
వందనా లాల్ 1995 నుంచి డాక్టర్ లాల్ పాథలాబ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. క్వాలిటీ అస్యూరెన్స్‌లో శిక్షణ పొందిన వందనా లాల్ భారతదేశంలోని అన్ని డాక్టర్ లాల్ పాథలాబ్స్‌లో నాణ్యత అమలు ప్రక్రియకు నాయకత్వం వహిస్తున్నారు. 2007 నుంచి ఆమె క్లినికల్ రీసెర్చ్ సర్వీసెస్ హెడ్‌గా, అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగానికి కూడా అధిపతిగా ఉన్నారు. దేశవ్యాప్తంగా లాల్‌పాత్ లాబ్స్ భారీ విస్తరణ వెనుక వందనలాల్ కృషి ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. క్లినికల్ ట్రయల్స్ విభాగం కాన్సెప్ట్, కొత్త ప్రాజెక్టుల వ్యూహాలు, అమలులో ఆమోది అందెవేసిన చేయి. ఈమె ఆధ్వర్యంలోనే 1990నుంచే అవయవ మార్పిడికి సంబంధించిన HLA పరీక్ష సౌకర్యాన్ని అందిస్తోంది డాక్టర్ లాల్ పాథ్‌లాబ్స్.
ఎవరీ వందనా లాల్ ?
వందనా లాల్ 1983లో డాక్టర్ లాల్ పాథలాబ్స్‌లో చేరారు కంపెనీ పనితీరులో కొన్ని పెద్ద మార్పులను తీసుకొచ్చిన ఘనత ఆమెకు ఉంది. వందనా లాలా కంపెనీలో చేరిన తర్వాత హిస్టోపాథాలజీ &సైటోపాథాలజీ విభాగాన్నిపరిచయం చేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. మార్చి 31, 2023 నాటి కార్పొరేట్ షేర్ హోల్డింగ్స్ ప్రకారం వందనా లాల్ నికర విలువ రూ. 3,143.3 కోట్లు
న్యూఢిల్లీలోని లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీ నుంచి వందనా లాల్ తన ఎండీ (పాథాలజీ)ని పూర్తి చేశారు. స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ & హడ్డింగ్ హాస్పిటల్‌లో ఉన్నత విద‍్యను అభ్యసించారు. ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇమ్యునాలజీలో నిపుణురాలైన వందనా లాల్ కొన్ని పుస్తకాలు కూడా రాశారు.
ఏఎల్‌వీఎల్ ఫౌండేషన్
భారతదేశంలోని అందరికీ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావాలనే లక్క్ష్యంతో డా. లాల్ పాత్‌ల్యాబ్స్ లిమిటెడ్‌కు చెందిన బ్రిగేడియర్ డాక్టర్ అరవింద్లాల్ , డాక్టర్ వందనా లాల్ ఛారిటబుల్ ట్రస్ట్‌ను ప్రారంభించారు. దీంతోపాటు సామాజిక రంగాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు, విద్య, సామాజిక శ్రేయస్సు, జీవనోపాధి వంటి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలకు కూడా మద్దతు ఇస్తుంది.
డాక్టర్ లాల్ పాత్‌లాబ్స్ ప్రస్థానం
1949లో బ్రిటిష్ ఆర్మీలో జూనియర్ డాక్టర్‌గా పనిచేసిన దివంగత ఎస్‌కె లాల్ డా.లాల్ పాథల్యాబ్స్‌ను ప్రారంభించారు. డా.లాల్ పూణేలోని ప్రతిష్టాత్మకమైన ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీలో చదువుకున్నారు. పాథాలజీలో చికాగోలోని కుక్ కౌంటీ ఆసుపత్రిలో అదనపు శిక్షణ తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment