సెలబ్రెటీలు వాడిన వస్తువులకు మార్కెట్లో ధరలు భారీగా ఉంటాయని అందరికి తెలుసు. అయితే వాచ్‌లు, షర్ట్స్, బైక్స్ వంటి వస్తువులకు అభిమానులు ఎక్కువ డబ్బు ఖర్చు చేసి కొనేస్తూ ఉంటారు. అయితే దీనికి భిన్నంగా అమెరికాకు చెందిన ఒక మోడల్ గోర్ల క్లిప్పింగ్స్, పాదాల చర్మం, డాండ్రఫ్ వంటివి అమ్ముతూ లక్షల్లో సంపాదిస్తోంది.
అమెరికా నార్త్ కరోలినాలో చెందిన 'రెబెక్కా బ్లూ' గతంలో ఎగ్జోటిక్ డ్యాన్సర్‌గా చేసి ప్రస్తుతం వెబ్‌క్యామ్ మోడల్, ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఉంటోంది. అయితే ఈమె తన వస్తువులను ఆన్‌లైన్‌లో విక్రయిస్తూ కావాల్సినంత డబ్బు సంపాదిస్తోంది. మొదట్లో తన స్ట్రిప్పింగ్ అవుట్‌ఫిట్స్‌ను ఒక వ్యక్తికి 20 డాలర్లకు విక్రయించింది.
ఈ విధంగా ప్రారంభమైన తన వ్యాపారం ఇప్పుడు పరుగులు పెడుతోంది. తన వద్ద ఉన్న వస్తువులకు డిమాండ్ భారీగా ఉండటం గ్రహించి బిజినెస్ ప్రారంభించి 28 ఏళ్లకే బిలినియర్ అయిపోయింది. మొదట సాక్స్ వంటి వాటిని విక్రయించడం మొదలు పెట్టి ఇప్పడు ఉమ్మి, కాలి గోర్లు, పాదాల నుంచి కత్తిరించిన చర్మం, తన ఇంట్లోని చెత్త, కాటన్ స్వాబ్స్, ఇతర చిత్రవిచిత్రమైన వస్తువుల్ని కూడా అమ్మి డబ్బు సంపాదిస్తోంది..
నిజానికి ఇలాంటి వస్తువులను అమ్మిన సెలబ్రిటీలు ఇంతకు ముందు చాలానే ఉన్నారు. అమెరికాకు చెందిన మాజీ రియాల్టీ టీవీ స్టార్ స్టెఫానీ మాటో గతంలో అపాన వాయువును బాటిళ్లలో నింపి విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాపారం ఆమెకు బాగా కలిసి వచ్చింది. దాంతో పెద్ద ఎత్తున డబ్బు సంపాదించింది.
ప్రస్తుతం రెబెక్కా బ్లూ ఇలాంటి చిన్న చిన్న పనికిరానివన్నీ విక్రయిస్తూ నెలకు 2000 డాలర్లు సంపాదిస్తోంది. అంటే ఇది భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.1.60 లక్షలకుపైనే ఉంటుంది. ఇలాంటి ఘటనలు మనదేశంలో చాలా తక్కువగా వినిపిస్తూ ఉంటాయి. కానీ అమెరికా వంటి దేశాల్లో అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment