మనిషి అనుకుంటే ఏదైనా సాధిస్తాడనే మాటను మరొక్కసారి ఋజువుచేసింది కోయంబత్తూరుకు చెందిన 'కృతిక కుమారన్'. వంటగదిలో ప్రారంభమైన తన వ్యాపారం ఈ రోజు కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిని చేసింది.
తమిళనాడులోని చిన్న పట్టణమైన గోబిచెట్టిపాళయంలో జన్మించిన కృతికా కుమారన్ తన స్కూల్ ఎజికేషన్ శ్రీ విద్యాలయ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో, తరువాత కోయంబత్తూరులో కుమారగురు కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో బి.టెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పూర్తి చేసింది.
ఇంజినీరింగ్ పూర్తయ్యాక 21 ఏళ్ల వయసులో MBA పూర్తి చేసిన తమిళ్ కుమరన్‌ని పెళ్లి చేసుకుని గృహిణిగా మారింది. కృతిక కుమారన్ చర్మ సమస్యతో బాధపడుతున్న తన కుమార్తె కోసం సహజమైన, సేంద్రియ పద్దతిలో ఒక చక్కటి పరిష్కారం కనుగొంది. ఇందులో భాగంగానే ఒక సోప్ తయారు చేసింది. ఆ పరిష్కారమే ఒక కంపెనీ నడిపే స్థాయికి తీసుకువచ్చింది.
(ఇదీ చదవండి: క్రిప్టో కింగ్ కిడ్నాప్ డ్రామా.. ప్రజలను నిండా ముంచి ప్రైవేట్ జెట్ కొనేసాడు!)
విల్వా (Vilvah) పేరుతో ప్రారంభమైన కంపెనీ ఇప్పుడు 29 కోట్ల టర్నోవర్ కలిగి ఉంది. 2017 మార్చిలో కేవలం రూ. 10,000 ప్రారంభ పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించి తన భర్త సహాయం కోరింది. అయితే అతడు ఫైనాన్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్‌పై ద్రుష్టి సారిస్తూనే ఆమెకు సంహరించడం మొదలు పెట్టాడు.
వ్యాపారం ప్రారంభించిన మొదటి సంవత్సరంలో ఈమె కోటి రూపాయల టర్నోవర్ సాధించింది, అయితే ఇప్పుడు ఆ టర్నోవర్ 29 కోట్లకు చేరింది. ప్రస్తుతం 70 విభిన్న చర్మ సంరక్షణ, జుట్టు సంరక్షణ ఉత్పత్తులను తయారు చేస్తూ ఎక్కువ లాభాలను ఆర్జిస్తోంది.
శివునికి ప్రీతిపాత్రమైన 'బిల్వ' ఆకుని సూచించే ఈ బ్రాండ్ (విల్వా) ఈ రోజు అధికారికి వెబ్‌సైట్, ఈ కామర్స్ ప్లాట్‌ఫారమ్స్, చెన్నై, కోయంబత్తూరులోని రెండు ఫిజికల్ స్టోర్‌లతో ఉత్పత్తులను విక్రయిస్తూ పరిధిని రోజు రోజుకి విస్తరిస్తూనే ఉంది. కృతిక కుమారన్ యూట్యూబ్‌లో వీడియోలు చూసి సబ్బులు తయారు చేయడం నేర్చుకున్నట్లు, అంతే కాకుండా రెండు నెలలు కాస్మోటాలజీ డిప్లొమా కోర్సును చదివి ఈ రంగంలో ప్రావీణ్యం పొందినట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment