Kruthika
-
కూతురి కోసం తయారు చేసిన సబ్బు.. కోట్లకు అధిపతిని చేసింది
మనిషి అనుకుంటే ఏదైనా సాధిస్తాడనే మాటను మరొక్కసారి ఋజువుచేసింది కోయంబత్తూరుకు చెందిన 'కృతిక కుమారన్'. వంటగదిలో ప్రారంభమైన తన వ్యాపారం ఈ రోజు కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిని చేసింది. తమిళనాడులోని చిన్న పట్టణమైన గోబిచెట్టిపాళయంలో జన్మించిన కృతికా కుమారన్ తన స్కూల్ ఎజికేషన్ శ్రీ విద్యాలయ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో, తరువాత కోయంబత్తూరులో కుమారగురు కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో బి.టెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పూర్తి చేసింది. ఇంజినీరింగ్ పూర్తయ్యాక 21 ఏళ్ల వయసులో MBA పూర్తి చేసిన తమిళ్ కుమరన్‌ని పెళ్లి చేసుకుని గృహిణిగా మారింది. కృతిక కుమారన్ చర్మ సమస్యతో బాధపడుతున్న తన కుమార్తె కోసం సహజమైన, సేంద్రియ పద్దతిలో ఒక చక్కటి పరిష్కారం కనుగొంది. ఇందులో భాగంగానే ఒక సోప్ తయారు చేసింది. ఆ పరిష్కారమే ఒక కంపెనీ నడిపే స్థాయికి తీసుకువచ్చింది. (ఇదీ చదవండి: క్రిప్టో కింగ్ కిడ్నాప్ డ్రామా.. ప్రజలను నిండా ముంచి ప్రైవేట్ జెట్ కొనేసాడు!) విల్వా (Vilvah) పేరుతో ప్రారంభమైన కంపెనీ ఇప్పుడు 29 కోట్ల టర్నోవర్ కలిగి ఉంది. 2017 మార్చిలో కేవలం రూ. 10,000 ప్రారంభ పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించి తన భర్త సహాయం కోరింది. అయితే అతడు ఫైనాన్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్పై ద్రుష్టి సారిస్తూనే ఆమెకు సంహరించడం మొదలు పెట్టాడు. వ్యాపారం ప్రారంభించిన మొదటి సంవత్సరంలో ఈమె కోటి రూపాయల టర్నోవర్ సాధించింది, అయితే ఇప్పుడు ఆ టర్నోవర్ 29 కోట్లకు చేరింది. ప్రస్తుతం 70 విభిన్న చర్మ సంరక్షణ, జుట్టు సంరక్షణ ఉత్పత్తులను తయారు చేస్తూ ఎక్కువ లాభాలను ఆర్జిస్తోంది. శివునికి ప్రీతిపాత్రమైన 'బిల్వ' ఆకుని సూచించే ఈ బ్రాండ్ (విల్వా) ఈ రోజు అధికారికి వెబ్సైట్, ఈ కామర్స్ ప్లాట్‌ఫారమ్స్, చెన్నై, కోయంబత్తూరులోని రెండు ఫిజికల్ స్టోర్లతో ఉత్పత్తులను విక్రయిస్తూ పరిధిని రోజు రోజుకి విస్తరిస్తూనే ఉంది. కృతిక కుమారన్ యూట్యూబ్‌లో వీడియోలు చూసి సబ్బులు తయారు చేయడం నేర్చుకున్నట్లు, అంతే కాకుండా రెండు నెలలు కాస్మోటాలజీ డిప్లొమా కోర్సును చదివి ఈ రంగంలో ప్రావీణ్యం పొందినట్లు వెల్లడించింది. -
కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను వదలని సైబర్ నేరగాళ్లు
-
మనసున్న మారాజు మా జగనన్న
సాక్షి, కాకినాడ: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాయకరావుపేటలో పర్యటించిన సందర్భంలో ఓ తల్లి కష్టం చూసి చలించిపోయిన విషయం తెలిసే ఉంటుంది. వైకల్యంతో బాధపడుతున్న తన బిడ్డకు సాయం అందించాలని ఓ తల్లి ఆయన్ని దీనంగా వేడుకుంది. దీంతో చలించిపోయిన సీఎం జగన్.. తక్షణ ఆర్థిక సహాయం అందించాలని, అలాగే పింఛను మంజూరు చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను అక్కడిక్కడే ఆదేశించారు. అయితే.. జగనన్న ఇచ్చిన సాయం మాటగానే మిగిలిపోలేదు. ఆయన సూచనల మేరకు అంతేత్వరగతిన అధికారులు స్పందించారు. రెండు గంటలలోపే జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా.. తనూజ, చిన్నారి ధర్మతేజలను కాకినాడ కలెక్టరేటుకు రావాలని సూచించారు. డీఆర్డీఏ పీడీ కె. శ్రీరమణితో ఆ తల్లీకొడుకుల రాకకోసం ప్రత్యేక వాహనం ఏర్పాటు చేయించారు. కలెక్టరేట్లోని తన ఛాంబరుకు పిలిపించుకుని రూ.10 వేల తక్షణ ఆర్థిక సహాయం ఆ తల్లికి అందించారు. అలాగే చిన్నారి ధర్మతేజకు వచ్చే నెల నుండి పింఛను మంజూరు చేస్తున్నట్లు భరోసా ఇచ్చారు. చిన్నారికి పూర్తిస్థాయి వైకల్యం ఉండడంతో.. రూ. 35 వేల రూపాయల విలువైన వీల్ చైర్ అందించారు. అసలేం జరిగిందంటే.. కాకినాడ జిల్లా శంఖవరం మండలం మండపం గ్రామానికి చెందిన నక్కా తనూజకు వైకల్యంతో బాధపడుతున్న కొడుకు ఉన్నాడు. పూర్తిగా బిడ్డ ఆలనాపాలనా చూస్కోవాల్సి రావడంతో.. తనూజ కూలీ పనులకు వెళ్లలేక ఆర్థికంగా ఇబ్బందిపడింది. అధికారులకు అర్జీ పెట్టుకుంది. ఈలోపు తన నిస్సహాయ స్థితిని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు చిన్నారితో సహా ఎదురుచూసింది. గురువారం పాయకరావు పేటలో సీఎం జగన్ ఓ వివాహ కార్యక్రమానికి హాజరవుతారని తెలిసి.. ఆ కళ్యాణ మండపం దగ్గరకు చేరుకుని.. జనం మద్యలో నిలుచుంది. ఇంతలో అక్కడకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ నుంచే తనూజను చూశారు. కాన్వాయ్‌ను ఆపించి.. ఆమెను దగ్గరకు పిలిచి కష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. పిలిచి సహాయం అందించి, తన కష్టాలను తొలగించిన జగనన్న మంచి మనసుకు.. ఆ తల్లి పదే పదే కన్నీళ్లతో కృతజ్ఞతలు చెబుతోంది. ఆ తల్లి కష్టం చూసి చలించి.. సీఎం జగన్ సత్వర సాయం -
సేంద్రియ బ్యూటీ
తీవ్రమైన చర్మ సంబంధ సమస్యలతో తల్లి చనిపోయింది. తల్లికి అన్నీ తానై సేవలందించిన కృతికకు తల్లి చనిపోయాక ఏం చేయాలో తోచలేదు. దీంతో తన తల్లిపడిన కష్టం మరెవరూ పడకూడదన్న ఉద్దేశ్యంతో చర్మానికి హానికరం కానీ కూరగాయలు, మేకపాలతో సబ్బులు, బ్యూటీ ఉత్పత్తులను తయారు చేసింది. వాటిని విల్వా పేరుతో విక్రయిస్తోంది తమిళనాడుకు చెందిన కృతిక. తల్లిదండ్రులది వ్యవసాయ కుటుంబం కావడంతో కృతిక కుమరన్ పచ్చని పంటపొలాల మధ్య పెరిగింది. 21 ఏళ్ల వయసులో పెళ్లి అయ్యింది. దీంతో ఎçప్పుడూ రాష్ట్రం దాటి బయటకు వెళ్లింది లేదు. చిన్నప్పటినుంచి అమ్మ మంజులాదేవితో అనుబంధం ఎక్కువ. మంజులా దేవికి చర్మ సంబంధ సమస్య వచ్చింది. అది తగ్గడానికి వివిధ రకాల స్టెరాయిడ్స్ వాడడంతో అవి చర్మసమస్యను తగ్గించకపోగా కిడ్నీలు పాడయేలా చేశాయి. దీంతో మంజులాదేవి 2016లో మరణించారు. ఎప్పుడూ తనతో ఉండే అమ్మ దూరం కావడాన్ని కృతిక తట్టుకోలేకపోయింది. నిరాశానిస్పృహలకు గురవుతుండేది. ఎలాగైనా వీటి నుంచి బయటపడాలనుకుంది. ఈ క్రమంలోనే... వివిధరకాల సబ్బులు, బ్యూటీ ఉత్పత్తుల వల్ల చర్మసంబంధ సమస్యలు ఎదురవుతున్నాయి. వాటి వల్ల ఎంత ఇబ్బంది కలుగుతుందో అమ్మను దగ్గరనుంచి చూసిన కృతికకు మార్కెట్లో దొరికే వాటికి ప్రత్యామ్నాయంగా ఇంట్లోనే సేంద్రియ పద్ధతిలో వాటిని తయారు చేయాలనుకుంది. కానీ వాటిని ఎలా రూపొందించాలో తెలిసేది కాదు. మేకపాలతో సబ్బు.. వివిధ రకాల పదార్థాలతో సహజసిద్ధంగా సబ్బులు తయారు చేసేందుకు ప్రయత్నిస్తూనే.. నేచురల్ కాస్మటాలజీ కోర్సు చేసింది. మేకపాలకు కొన్ని ఇతర రకాల పదార్థాలు కలిపి సబ్బులు తయారు చేసి తెలిసిన వారికి, స్నేహితులకు ఇచ్చేది. ఆ సబ్బులు తామరవ్యాధితో బాధపడేవారికి బాగా ఉపయోగపడుతున్నట్లు చెప్పడంతో కృతికకు మంచి ప్రోత్సాహంగా అనిపించింది. ఈ ప్రోత్సాహంతో మరిన్ని ఉత్పత్తులను తయారు చేసేది. విల్వా.. అమ్మ చనిపోయిన ఏడాది తరువాత 2017లో ‘విల్వా’ పేరుతో స్టోర్‌ను ప్రారంభించింది. బిల్వపత్రం పేరుమీదగా ఈ పేరుపెట్టింది. ప్రారంభంలో కృతిక తయారు చేసే ఉత్పత్తులను ఫేస్బుక్ పేజిలో పోస్టు చేసి అందరికీ తెలిసేలా చేసింది. సబ్బులతోపాటు, స్కిన్‌కేర్, బ్యూటీ ఉత్పత్తులను సహజసిద్ధ పదార్థాలు, ఎసెన్షియల్ ఆయిల్స్, వెన్నను ఉపయోగించి తయారు చేసేది. క్లెన్సర్స్, టోనర్స్, ఫేస్‌మాస్క్‌లు, సీరమ్స్, కండీషనర్లు, మాయిశ్చరైజర్, జెల్, పెదవులు, కళ్లకు సంబంధించిన ఉత్పత్తులతోపాటు, షాంపులు, హెయిర్ ఆయిల్స్‌ను తయారు చేసి విక్రయిస్తోంది. మహిళలకేగాక, పురుషులకు సైతం బ్యూటీ ఉత్పత్తులను అందించడం విశేషం. ఇండియాలోనేగాక, యూకే, యూఎస్, మలేసియా, సింగపూర్, గల్ఫ్‌దేశాలకు సైతం కృతిక తన విల్వా ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. వివిధ ఆన్లైన్ వేదికలపై విల్వా ఉత్పత్తులు లభ్యమవుతున్నాయి. -
నెల్లూరు పిల్ల.. ఇండస్ట్రీలో ఔరా అనిపిస్తోంది..
గడుసుదనం.. అల్లరితనం.. పెంకితనం.. పాత్రలో జీవించడం.. బుల్లితెరపై రౌడీపిల్ల.. ఇవన్నీ కలిపితే నటి బేబీ కృతిక గుర్తుకు వస్తుంది. ప్రతి ఇంట్లోనూ ఇప్పుడు సౌర్యగా గుర్తింపు పొందిన కృతిక ఐదున్నరేళ్ల వయసులోనే బుల్లితెరపై నటించి అందరినీ ఔరా.. అనిపించింది. ఒకవైపు చదువుకుంటూనే ఇంకోవైపు టీవీ సీరియళ్లు, సినిమాల్లో నటిస్తూ చిన్నతనంలోనే అశేష అభిమానుల్ని సొంతం చేసుకుంది. – బంజారాహిల్స్ ►నెల్లూరుకు చెందిన గ్రంధి వంశీకృష్ణ, వరంగల్‌కు చెందిన దూదిపాల స్వప్నల కూతురు కృతిక(9) ప్రస్తుతం ఉప్పల్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. తండ్రి వ్యాపారి. తల్లి ఓ బ్యాంక్‌లో పనిచేస్తున్నారు. ►చిన్నప్పటి నుంచి నటన పట్ల ఆసక్తి చూపే కృతిక మొదట గీతాంజలి ధారావాహిక సీరియల్లో నటించి తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. అప్పటికి ఆమె వయసు 5 సంవత్సరాలు మాత్రమే. అప్పటి నుంచి వెనుతిరిగి చూడకుండా 15 సీరియళ్లు, 10 సినిమాలు, రియాల్టీ షోలలో నటించి మెప్పించింది. ►ప్రస్తుతం అందరినీ అలరిస్తున్న కార్తీక దీపం సీరియల్లో రౌడీపిల్లగా గుర్తింపు పొందింది. సౌర్యలా(రౌడీ బేబీ) తన నటనతో అందరినీ ఆకట్టుకుంటోంది. సీరియల్లో లీడ్ రోల్ కృతికదే. ఒకవైపు బుల్లితెర మీద ప్రతిభ చాటుకుంటూనే సినిమాల్లోనూ పెద్ద నటులతో నటిస్తోంది. ►ఇటీవల విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి అగ్రనటి విజయశాంతి ప్రశంసలు అందుకుంది. జైసింహాలో నయనతార చిన్ననాటి పాత్రను పోషించింది. స్టార్ మాలో వదినమ్మ, అష్టాచమ్మ, పవిత్ర బంధం, ఈటీవీలో కాంచనమాల తదితర సీరియళ్లతో ఆదరణ పొందుతోంది. చదువులోనూ ఫస్ట్.. నెలలో 10 రోజులు షూటింగ్‌లకు, మిగతా 20 రోజులు స్కూల్‌కు కేటాయిస్తున్న కృతిక.. చదువులోనూ ప్రతిభ చాటుతోంది. బుల్లితెరపై దూసుకుపోతున్న కృతిక ప్రస్తుతం వెండితెరపై కూడా కాల్షీట్లు ఖాళీ లేకుండా బిజీగా ఉంది. -
న్యూ లుక్‌లో...
నారా రోహిత్, కృతిక, నీలమ్ ఉపాధ్యాయ హీరో హీరోయిన్లుగా ఓ చిత్రం తెరకెక్కింది. కార్తికేయను దర్శకునిగా పరిచయం చేస్తూ కోటి తూముల నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత కోటి తూముల మాట్లాడుతూ– ‘‘లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో నారా రోహిత్ న్యూ లుక్‌లో కనిపించనున్నారు. ఆయన కెరీర్లో మా చిత్రం బెస్ట్‌గా నిలుస్తుంది. ఇటీవల చిత్ర ప్రధాన తారాగణం పాల్గొనగా క్లైమాక్స్ తీశాం. టర్కీలో రెండు పాటలు గ్రాండ్‌గా తీశాం. డైరెక్టర్ కథ చెప్పిన దానికన్నా సినిమా చాలా బాగా తీశారు. అనూప్ రూబెన్స్గారి సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్’’ అన్నారు. నాగబాబు, పోసాని, రఘుబాబు, అలీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: శివేంద్ర. -
మా రోజులు మారాయి
జిల్లావాసుల ఆదరణ మరువలేనిదని, తమ చిత్రాన్ని గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు తమ చిత్రయూనిట్ ఎంతగానో రుణపడి ఉందని, ఈ చిత్రంతో ‘మా రోజులు మారాయి’ అని అన్నారు ‘రోజులు మారాయి’ చిత్ర హీరోలు, హీరోయిన్. ఆ చిత్ర యూనిట్ బుధవారం కాకినాడ, రాజమహేంద్రవరంలలో సందడి చేసింది. చిత్ర విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా వచ్చిన హీరోలు పార్వతీశం, చేతన్‌మద్దినేని, హీరోయిన్ కృతిక, దర్శకుడు మురళీకృష్ణ ‘సాక్షి’తో ముచ్చటించారు. సినిమా విశేషాలు వెల్లడించారు. కాకినాడ శ్రీప్రియ థియేటర్‌ను సందర్శించిన చిత్రయూనిట్‌కు థియేటర్ యాజమాన్యం ఘన స్వాగతం పలికి, పుష్పగుచ్ఛాలతో అభినందించింది. చిత్ర కథానాయిక కృతిక మాట్లాడుతూ హాస్యం, సస్పెన్స్ తో నిర్మించి ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోందన్నారు. తనకు ‘దృశ్యం’ చిత్రం బాగా గుర్తింపు తెచ్చిందన్నారు. ‘కేరింత’ నూకరాజని పిలుస్తున్నారు రోజులు మారాయి హీరో పార్వతీశం ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం) : తనను ఇప్పటి వరకు ప్రేక్షకులు ‘కేరింత’ నూకరాజుగానే గుర్తిస్తున్నారని, అదే తనపేరైందని ‘రోజులు మారాయి’ హీరో పార్వతీశం పేర్కొన్నారు. స్థానిక ఆనందరీజెన్సీ హోటల్లో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. సాక్షి : స్వగ్రామం, పెరిగింది ఎక్కడ? పార్వతీశం : స్వగ్రామం పలాస, బెంగళూరులో పెరిగా. అక్కడే బీటెక్ చదివా, యాక్టింగ్‌పై మక్కువతో హైదరాబాద్ వచ్చేశా. సాక్షి : ఇప్పటి వరకు చేసిన సినిమాలు? పార్వతీశం : కేరింత, రోజులు మారాయి చిత్రాలు చేశాను. బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా ‘నాన్నా.. నేను నా బాయ్‌ప్రెండ్స్’ చిత్రం చేస్తున్నా. హెబ్సాపటేల్ హీరోయిన్గా చేస్తుంది. సాక్షి : రోజులు మారాయి చిత్రానికి ఎలాంటి స్పందన వస్తోంది? పార్వతీశం : రోజులు మారాయి చిత్రానికి రోజురోజుకి ఆదరణ పెరుగుతోంది. మేము వెళుతున్న ప్రతి థియేటర్లో ఈ సినిమాలో పీటర్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కేరింత నూకరాజు అనేవారు పీటర్ అంటూ పిలుస్తున్నారు. సినిమాలోని డైలాగులు నాకంటే ముందే ప్రేక్షకులు చెప్పేస్తుండడంతో చాలా ఆనందంగా ఉంది. సాక్షి : ఏ పాత్రలు చేయాలని అనుకుంటున్నారు? పార్వతీశం : ప్రకాష్‌రాజ్, నాని, అమీర్‌ఖాన్‌లు అంటే చాలా ఇష్టం. అన్ని రకాల పాత్రలలో నటించాలన్నదే తన ఆకాంక్ష. ‘తొలి సినిమాకే ఆదరణ చూపిస్తున్నారు’ రోజులు మారాయి హీరో చేతన్ మద్దినేని తాను నటించిన మొదటి సినిమా ‘రోజులు మారాయి’కి ప్రేక్షకులను నుంచి మంచి ఆదరణ లభిస్తోందని సినిమా హీరో చేతన్ మద్దినేని పేర్కొన్నారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే. ‘‘మా స్వగ్రామం విశాఖపట్నం. 15 ఏళ్ల క్రితం తల్లిదండ్రులు యూఎస్‌లో సెటిల్అయ్యారు. యాక్టింగ్‌పై మక్కువతో హైదరాబాద్‌లో ఉంటున్నా. రోజులుమారాయి నా మొదటి సినిమా. సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో ‘గల్ఫ్’సినిమాలో నటించాను. మూడు భాషల్లో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. రోజులు మారాయి చిత్రం నాకు ఎంతగానో గుర్తింపు తెచ్చింది. ప్రతి థియేటర్లో నన్ను ఈజీగానే గుర్తుపట్టారు. రిపీట్ ఆడియన్స్ ఎక్కువగా వస్తున్నారు. మేము చెప్పే డైలాగులను ముందుగానే ప్రేక్షకులు చెప్పడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. అన్ని రకాల పాత్రలను చేస్తాను. అంతేకాకుండా దర్శకుడు మారుతి చిత్రాల్లోనే నటిస్తా. ఆయనే నాకు గాడ్‌ఫాదర్. ఆయన వల్లే చిత్రసీమకు వచ్చా. ‘మా అమ్మమ్మ వాళ్లది రాజమహేంద్రవరమే’ రోజులు మారాయి దర్శకుడు మురళీకృష్ణ ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం) : ‘మా స్వగ్రామం కృష్ణాజిల్లా గుడివాడైనా.. అమ్మమ్మవాళ్లది రాజమహేంద్రవరమే’ అని రోజులు మారాయి చిత్ర దర్శకుడు మురళీకృష్ణ పేర్కొన్నారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. సాక్షి : ఎన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. మురళీకృష్ణ : ఇప్పటివరకు సీరియల్స్‌కు దర్శకత్వం వహించాను. రోజులు మారాయి నా మొదటి చిత్రం. సాక్షి : ఏయే సీరియల్స్‌కు దర్శకత్వం వహించారు. మురళీకృష్ణ : నాన్న, చిన్నారి, అమ్మమ్మ డాట్ కమ్ సీరియల్స్‌కు దర్శకత్వం వహించాను. మూడింటికీ ఉత్తమ సీరియల్స్‌గా నంది అవార్డులు అందుకున్నా. అలాగే నాన్న, అమ్మమ్మ డాట్ కమ్ సీరియల్స్‌కు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు వచ్చింది. సాక్షి : రోజులు మారాయి సినిమాకు ఎలాంటి స్పందన వస్తుంది? మురళీకృష్ణ : వెళ్లిన ప్రతి చోట ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. యూత్, ఫ్యామిలీ ఎంటర్టైైనర్ సినిమా. ప్రేక్షకుల ఆదరణ మరువలేనిది. సాక్షి : కొత్తగా దర్శకత్వం వహించే సినిమాలు మురళీకృష్ణ : నిర్మాతలు దిల్‌రాజు, జి.శ్రీనివాసరావుల తో కలిసి కొత్తగా ఒక సినిమా చేద్దామని అన్నారు. త్వరలోనే మొదలు పెడతాం. సాక్షి : సెలవులకు రాజమహేంద్రవరం వచ్చినప్పుడు ఏం చేసేవారు? మురళీకృష్ణ : అమ్మమ్మవాళ్లది రాజమహేంద్రవరంలోని ఇన్నీసుపేట. చిన్నప్పుడు సెలవులకు వచ్చినప్పుడు సైకిల్ తొక్కుకుంటూ గోదావరి గట్లపై తిరుగుతూ ఉండేవాడిని. ఎంతో ఆనందంగా ఉండేది. ఇప్పటి కీ మరిచిపోలేని అనుభూతి. మరలా రాజమహేంద్రవరం ‘రోజులు మారాయి’ విజయోత్సవ ర్యాలీకి రావడం ఆనందంగా ఉంది. -
'మా సినిమాపై దుష్ప్రచారం తగదు'
‘‘ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. వీవీ వినాయక్‌గారు కూడా ఫోన్ చేసి అభినందించారు. కొంతమంది ఈ సినిమా చూసి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ రెంటినీ సమీక్షల్లో ప్రస్తావించారు. కొంతమంది పనిగట్టుకుని మరీ దుష్ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల ప్రేక్షకులు తప్పుదారి పట్టే అవకాశం ఉంది. ఎంతో కష్టపడి తీసిన సినిమాపై ఇలాంటి ప్రచారాలు తగదు’’ అని నిర్మాత కృష్ణారెడ్డి అన్నారు. జి. రామ్‌ప్రసాద్ దర్శక త్వంలో తన తనయుడు నాగ అన్వేష్ని హీరోగా పరిచయం చేస్తూ, ఆయన నిర్మించిన చిత్రం ‘వినవయ్యా రామయ్యా’. ఈ చిత్రం విజయోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు నా థ్యాంక్స్’’ అన్నారు. సినిమా ఫస్ట్‌హాఫ్‌లో కామెడీ, ద్వితీయార్ధంలో ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బాగా పండాయని నాగ అన్వేష్ అన్నారు.