
నారా రోహిత్
నారా రోహిత్, కృతిక, నీలమ్ ఉపాధ్యాయ హీరో హీరోయిన్లుగా ఓ చిత్రం తెరకెక్కింది. కార్తికేయను దర్శకునిగా పరిచయం చేస్తూ కోటి తూముల నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత కోటి తూముల మాట్లాడుతూ– ‘‘లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది.
ఇందులో నారా రోహిత్ న్యూ లుక్‌లో కనిపించనున్నారు. ఆయన కెరీర్‌లో మా చిత్రం బెస్ట్‌గా నిలుస్తుంది. ఇటీవల చిత్ర ప్రధాన తారాగణం పాల్గొనగా క్లైమాక్స్ తీశాం. టర్కీలో రెండు పాటలు గ్రాండ్‌గా తీశాం. డైరెక్టర్ కథ చెప్పిన దానికన్నా సినిమా చాలా బాగా తీశారు. అనూప్ రూబెన్స్‌గారి సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్’’ అన్నారు. నాగబాబు, పోసాని, రఘుబాబు, అలీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: శివేంద్ర.
Comments
Please login to add a commentAdd a comment