
మహిళా వ్యాపారవేత్తకు మత్తుమందు ఇచ్చి..
న్యూఢిల్లీ: ఢిల్లీలో మరో అత్యాచార ఘటన వెలుగు చూసింది. ఓ మహిళా వ్యాపారవేత్తపై మరో వ్యాపారవేత్త అత్యాచారం చేశాడు. శుక్రవారం కనాట్ ప్లేస్లోని ఓ హోటల్లో ఈ దారుణం జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి.
దక్షిణ ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీకి చెందిన బాధిత మహిళ సొంతంగా వ్యాపారం నిర్వహిస్తోంది. బిజినెస్ వ్యవహారాలపై చర్చించేందుకు ఛత్తీస్గఢ్కు చెందిన మరో వ్యాపారవేత్త ఆమెను హోటల్కు లంచ్కు ఆహ్వానించారు. ఇద్దరికీ గతంలో పరిచయం ఉండటంతో ఆమె వెళ్లారు. కాగా నిందితుడు ఆమెకు మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లాక హోటల్లోని రూమ్కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాధితురాలు స్పృహలోకి వచ్చాక పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. అప్పటికే నిందితుడు అక్కడ నుంచి వెళ్లిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.