Rhea Chakraborty Attends To Rajiv Lakshman Son Birthday Party, Pictures Viral - Sakshi
Sakshi News home page

రియా కొత్త ఫొటో వైరల్‌.. మండిపడుతున్న నెటిజన్లు

Published Fri, Jan 8 2021 3:21 PM | Last Updated on Fri, Jan 8 2021 6:03 PM

Rhea Chakraborty Joins Roadies Fame Rajiv Lakshman Son Birthday Party - Sakshi

ముంబై: దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసు, బాలీవుడ్‌ డ్రగ్‌ వ్యవహరంలో ప్రధాన నిందితురాలైన రియా చక్రవర్తి గత నెల బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. అయితే బయటకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆమె మీడియాకు ఎదురుపడలేదు. ఈ క్రమంలో ఇటీవల ఓ బర్త్‌డే పార్టీకి హాజరైన రియా ఫొటో నెట్టింటా హల్‌చల్‌ చేస్తోంది. రోడీస్‌ ఫేం రాజీవ్‌ లక్ష్మన్‌ కుమారుడి మొదటి బర్త్‌డే పార్టీకి ఇటీవల రియా హజరయ్యారు. ఈ సందర్భంగా రియాతో కలిసి సన్నిహితంగా దిగిన ఓ ఫొటోను రాజీవ్‌తో తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. ‘మై ఫ్రెండ్‌ ’అంటూ పోస్టు చేసిన ఈ ఫొటో రియా రాజీవ్‌ను హగ్‌ చేసుకుని కెమెరాకు నవ్వుతూ ఫొజ్‌ ఇచ్చారు. దీంతో అతనితో అత్యంత సన్నిహితంగా ఉండటమే కాక సంతోషంతో నవ్వుతూ కనిపించిన రియాపై నెటిజన్‌లు విమర్శలు గుప్పించడంతో రాజీవ్‌ ఈ పోస్టును డిలీట్‌ చేశాడు. (చదవండి: సుశాంత్‌ కేసు: రూ. 2.5 కోట్ల డ్రగ్స్‌ స్వాధీనం)

దీంతో చాలా రోజుల తర్వాత రియా మళ్లీ వార్తల్లో నిలిచారు. సుశాంత్‌ మృతి కేసులో వెలుగు చూసిన బాలీవుడ్‌ డ్రగ్‌ వ్యవహరంలో నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో గతేడాది సెప్టెంబర్‌లో రియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దాదాపు నెల రోజుల జైలు జీవితం అనంతరం అక్టోబర్‌లో ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు. ఇక బయటకు రాగానే కేరీర్‌పై దృష్టి పెట్టిన రియా తిరిగి సినిమాల్లో నటించనున్నట్లు దర్శకుడు రూమి జాఫరీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘రియా 2021 నుంచి షూటింగ్‌లో పాల్గొననున్నారని, ప్రస్తుతం ఆమె చేతిలో ‘సోనాలి కేబుల్’‌, ‘జలేబీ’, ‘మేరే డాడ్‌కి మారుతి’ వంటి ప్రాజెక్టులు ఉన్నట్లు ఆయన తెలిపారు. (చదవండి: ‘అందుకే రియా, సుశాంత్‌ ఇంటిని వీడింది’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement