డెవాన్‌ కాన్వే ప్రీ వెడ్డింగ్‌ పార్టీ.. పంచ కట్టుతో రచ్చరచ్చ చేసిన సీఎస్‌కే ప్లేయర్లు | IPL 2022: CSK Players Rock Devon Conway Pre Wedding Party With Traditional Indian Wear | Sakshi
Sakshi News home page

IPL 2022: డెవాన్‌ కాన్వే ప్రీ వెడ్డింగ్‌ పార్టీ.. పంచ కట్టుతో రచ్చరచ్చ చేసిన సీఎస్‌కే ప్లేయర్లు

Published Wed, Apr 20 2022 1:47 PM | Last Updated on Wed, Apr 20 2022 3:25 PM

IPL 2022: CSK Players Rock Devon Conway Pre Wedding Party With Traditional Indian Wear - Sakshi

Devon Conway Pre Wedding Party: ఐపీఎల్‌ 2022 సీజన్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు రేపు (ఏప్రిల్‌ 21)ముంబైతో జరుగబోయే కీ ఫైట్‌కు ముందు ఓ ముఖ్యమైన ఈవెంట్‌లో పాల్గొంది. జట్టు కీలక సభ్యుడు, విదేశీ ఆటగాడు (న్యూజిలాండ్‌) డెవాన్‌ కాన్వే ప్రీ వెడ్డింగ్ పార్టీలో చెన్నై ఆటగాళ్లు రచ్చరచ్చ చేశారు. ముంబైలోని ట్రైడెంట్ హోటల్‌లో సీఎస్‌కే యాజమాన్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ పార్టీలో కాన్వే సహా సీఎస్‌కే బృంద సభ్యులంతా తమిళ సంప్రదాయ పంచ కట్టుతో మెరిశారు. 


ఈ వేడుకలో కాన్వే సహా జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, మాజీ, ప్రస్తుత కెప్టెన్లు ధోని, జడేజా, మొయిన్ అలీ, బ్రావో, రుతురాజ్ గైక్వాడ్, ఉతప్ప, అంబటి రాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సహచరుడి ప్రీ వెడ్డింగ్‌ ఈవెంట్‌కు సీఎస్‌కే ప్లేయర్లు కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. ఈ వేడుకకు కాన్వే ఫియాన్సి కిమ్ వాట్సన్ వర్చువల్‌గా హాజరైంది. న్యూజిలాండ్‌లో ఉన్న కిమ్‌ పసుపురంగు పట్టు చీరలో మెరిసిపోయింది. కాన్వే, కిమ్‌ ఇద్దరు వర్చువల్‌గా సంభాషించుకుంటుండగా.. సహచర సభ్యులు చప్పట్లతో ఇద్దరినీ విష్‌ చేశారు. 


అనంతరం కేక్‌ కట్టింగ్‌, ఆలింగనాలతో పార్టీ సందడి సందడిగా సాగింది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలు,  వీడియోలను సీఎస్‌కే యాజమాన్యం ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం వైరలవుతున్నాయి. కాగా, డెవాన్ కాన్వే-కిమ్ వాట్సన్ 2020లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఈ ఏడాది వారు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఇదిలా ఉంటే, సీఎస్‌కే.. తమ తదుపరి మ్యాచ్‌లో తమ కంటే దారుణమైన ప్రదర్శన కనబరుస్తున్న ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ సీజన్‌లో సీఎస్‌కే ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 5 ఓటములను చవిచూడగా, ముంబై.. ఆడిన ఆరింటిలో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. 


చదవండి: RCB VS LSG: కోహ్లి గోల్డెన్‌ డక్‌ ఎక్స్‌ప్రెషన్‌పై ఆసక్తికర ట్వీట్‌ చేసిన సజ్జనార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement