క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు, ముంబై ఇండియన్స్ యువ క్రికెటర్ అర్జన్ టెండూల్కర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్‌తో అతను సన్నిహితంగా ఉన్న ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఈ ఫోటోల్లో అర్జున్.. వ్యాట్‌తో కాస్త చనువుగా ఉన్నట్లు కనిపించడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు.. సచిన్ తనయుడు ఇంగ్లీష్ పిల్ల బుట్టలో పడ్డాడా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో విషయం తెలీకుండా తప్పుగా కామెంట్లు చేస్తున్న వారికి చురకలంటిస్తున్నారు. మొత్తానికి ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ మహిళా జట్టు ఆల్‌రౌండర్ అయిన వ్యాట్ అర్జున్ తండ్రి సచిన్‌కు వీరాభిమాని. తండ్రి తనయులు ఎప్పుడు లార్డ్స్ మైదానానికి వచ్చినా ఆమె వారిని తప్పకుండా కలిసేది. 2009 నుంచి సచిన్, అర్జున్‌లతో తనకు పరిచయం ఉందని వ్యాట్ గతంలో పలు సందర్భాల్లో పేర్కొంది. 31 ఏళ్ల వ్యాట్ ఇంగ్లండ్ తరఫున 93 వన్డేలు, 124 టీ20 ఆడింది. వ్యాట్.. తన కెరీర్‌లో మొత్తం 4 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీల సాయంతో 3400కు పైగా పరుగులు సాధించింది. హాఫ్ స్పిన్ బౌలర్ అయిన వ్యాట్ రెండు ఫార్మాట్లలో కలిపి 73 వికెట్లు పడగొట్టింది.
చదవండి: అతన్ని ఓపెనర్‌గా పంపండి.. సెహ్వాగ్‌లా సక్సెస్ అవుతాడు..!
Comments
Please login to add a commentAdd a comment