భారతదేశం నుంచి వెళ్లి ప్రపంచమే గర్వించే స్థాయికి ఎదిగిన గూగుల్ సీఈఓ 'సుందర్ పిచాయ్' (Sundar Pichai) గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. ఎక్కువ జీతం తీసుకునే సీఈఓల జాబితాలో ఒకడైన ఈయన చాలా ఆడంబరంగా ఉంటారని చాలామంది ఊహించి ఉంటారు. కానీ తాజాగా విడుదలైన ఫోటో మీ ఆలోచనలను తారుమారు చేస్తుంది. మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.
బెంగళూరుకు చెందిన 'సిద్ పురి' ఇటీవలే శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లారు. అక్కడ ఉదయం వాకింగ్ చేసే సమయంలో సుందర్ పిచాయ్ పెద్దగా సెక్యూరిటీ లేకుండానే కనిపించారు. అప్పుడు సిద్ ఫోటో తీసుకోవచ్చా.. అని అడిగిన వెంటనే ఒప్పుకున్నాడు. ఈ ఫోటోలు ఆ వ్యక్తి తన సోషల్ మీడియాలో ఖాతాల్లో పోస్ట్ చేసాడు.
ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుల జాబితాలో 'రతన్ టాటా' ఎందుకు లేరు - కారణం ఇదే!
ఈ ఫోటోలలో గమించినట్లతే.. సుందర్ పిచాయ్ చాలా సింపుల్‌గా బ్లూ జీన్స్, జాకెట్, బ్లాక్ సన్ గ్లాసెస్ పెట్టుకున్నాడు. ఈ ఫోటోని ఇప్పటికి 6 లక్షల కంటే ఎక్కువమంది వీక్షించారు. 4000 కంటే ఎక్కువ లైకులు వచ్చాయి. కొంతమంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు.
ఇదీ చదవండి: భారత్‌లో ఐఫోన్ మేనియా.. ఎమ్‌ఆర్‌పీ కంటే ఎక్కువ ధరతో..
ఒక నెటిజన్ అక్కడ సెక్యూరిటీ ఎవరూ లేరా? అని అడిగాడు. దీనికి ఒక్క సెక్యూరిటీ ఉన్నాడు, అతడే ఫోటో తీసాడని సిద్ రిప్లై ఇచ్చాడు. మరి కొందరు అంత పెద్ద కంపెనీకి సీఈఓ అయినా చాలా సాధారణంగా ఉండటం చూస్తే.. చాలా ఆనందంగా ఉందన్నారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బయట తిరగటం కొంత ఆందోళన కలిగిస్తుందని ఒక నెటిజన్ పేర్కొన్నాడు.
go to SF they said, no one prepared me to just run into Sundar Pichai on the street. pic.twitter.com/BJitwCw0EE
— Sid Puri (@PuriSid) September 25, 2023
Comments
Please login to add a commentAdd a comment