గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) 'సుందర్ పిచాయ్' టెక్ దిగ్గజంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నారు. ఏప్రిల్ 26 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.
''2004 ఏప్రిల్ 26 గూగుల్ కంపెనీలో నా మొదటి రోజు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మార్పులు వచ్చాయి. టెక్నాలజీ మాత్రమే కాకుండా.. మా ఉత్పత్తులను ఉపయోగించే వారి సంఖ్య కూడా పెరిగింది. ఈ అద్భుతమైన కంపెనీలో పని చేయడం వల్ల చాలా థ్రిల్ పొందాను. సంస్థలో పనిచేస్తున్నందుకు ఇప్పటికీ నన్ను నేను అదృష్టవంతుడిగా భావిస్తున్నాను'' అంటూ సుందర్ పిచాయ్ పోస్ట్ చేశారు.
సుందర్ పిచాయ్ చేసిన ఈ పోస్ట్ కొన్ని గంటల్లోనే వైరల్ అయింది. ఇప్పటికే 1,42,999 కంటే ఎక్కువ లైక్స్ పొందిన ఈ పోస్ట్ మీద నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. చాలామంది సుందర్ పిచాయ్ విజయాన్ని గొప్పగా అభినందించారు.
సుందర్ పిచాయ్ 2004లో గూగుల్‌లో ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ హెడ్‌గా చేరాడు. ఆ తరువాత దినదినాభివృద్ధి చెందుతూ ఆ కంపెనీకి సీఈఓగా ఎదిగారు. ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన పిచాయ్ నేడు భారతదేశం గర్వించదగ్గ వ్యక్తిగా ఎదిగారంటే దాని వెనుక ఉన్న ఆయన కృషి అనన్య సామాన్యమనే చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment