Rishabh Pant New Insta Post, Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Rishabh Pant: పంత్‌ 'బుద్ధిమంతుడు' పోస్ట్‌పై టీమిండియా క్రికెటర్ల సెటైర్లు

Published Tue, Aug 24 2021 8:21 PM | Last Updated on Wed, Aug 25 2021 8:47 AM

Team Mates Troll Rishabh Pant Over His New Instagram Post - Sakshi

లీడ్స్: టీమిండియా అల్లరి పిల్లగాళ్లలో ముఖ్యుడైన రిషబ్ పంత్.. తన ఇటీవలి ఇన్‌స్టా పోస్ట్‌ కారణంగా విపరీతంగా ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఆ పోస్ట్‌పై స్పందించిన సహచర టీమిండియా సభ్యులు పంత్‌ను ఓ ఆట ఆడుకున్నారు. వివారాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌తో లార్డ్స్ టెస్ట్‌ అనంతరం టీమిండియా వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌.. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ ఫొటోను షేర్‌ చేశాడు. ఆ ఫొటోలో రంగురంగుల హుడీ, షార్ట్‌తో పాటు రెండు కలర్ల (ఎరుపు, నీలం) సాక్సులు ధరించి కాస్త విచిత్రంగా కనిపించిన పంత్‌.. 'క్లాస్‌లో అందరికంటే బుద్ధిమంతుడు' అంటూ హిందీలో కాప్షన్ జోడించాడు. నవ్వుతున్న ఎమోజీలను ఫొటోకు జత చేశాడు. 

దీంతో అది కాస్త నెట్టింట వైరల్ అయ్యింది. ఈ ఫోటోకు నెటిజన్లు నుంచి విపరీతమైన రెస్పాన్స్‌ వస్తుంది. పంత్‌ పోస్ట్‌పై పలువురు టీమిండియా క్రికెటర్లు సైతం స్పందించారు. జోకులు వేయొద్దంటూ పంత్‌ను ఓ రేంజ్‌లో ఆటాడుకున్నారు. పంత్‌ ఐపీఎల్‌ జట్టు సహచరుడు అక్షర్‌ పటేల్‌ స్పందిస్తూ.. ఆ ఫొటోను తానే తీశానని తెలియజేసేలా.. 'బుద్ధిమంతుడివి నువ్వు కాదు.. ఆ ఫొటో తీసిన వ్యక్తి' అంటూ కామెంట్ చేశాడు. అక్షర్‌ పటేల్ కామెంట్‌పై మరో ఢిల్లీ క్యాపిటల్‌ సభ్యుడు ఇషాంత్‌ శర్మ సెటైర్‌ వేశాడు. 

మీరిద్దరూ అమాయకులా? అన్నట్లు కామెంట్‌ పెట్టాడు. ఈ క్రికెటర్ల సంభాషణ చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. పంత్‌.. బుద్ధిమంతుడేంటి అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. ఇలాంటి ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందోనని మరికొందరు రియాక్ట్‌ అవుతున్నారు. ఇదిలా ఉంటే, లార్డ్స్‌ టెస్ట్‌లో చిరస్మరణీయ విజయం నమోదు చేయడంతో ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రేపటి నుంచి ఇరు జట్ల మధ్య లీడ్స్‌ వేదికగా మూడో టెస్ట్‌ ప్రారంభంకానుంది.
చదవండి: టీమిండియా తదుపరి కోచ్‌ అతడేనా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement