
హీరోయిన్ అనుష్క శెట్టి కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. సినిమా ఫంక్షన్లు సహా సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్‌గా కనిపించడం లేదు. బాహుబలి లాంటి అద్భుతమైన విజయం తర్వాత ఆమె వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ అవుతుందనుకున్నారు. కానీ చాలా రోజులుగా అనుష్క బయట ఎక్కడా కనిపించడం లేదు.
అయితే తాజాగా కుటుంబసభ్యులతో కలిసి బెంగళూరులో శివరాత్రి వేడుకలకు హాజరైంది.దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాదాపు రెండేళ్ల తర్వాత అనుష్క బయట కనిపించడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
కాగా ఇందులో అనుష్క కాస్త బొద్దుగా కనిపిస్తున్నారు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె నవీన్ పొలిశెట్టికి జోడీగా ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ అనే సినిమాలో నటిస్తున్నారు.యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment