సాధారణంగా హీరోయిన్లు ఎవరైనా సరే సినిమాలు చేసినా చేయకపోయినా.. అప్పుడప్పుడు మీడియాలో అయితే కనిపిస్తుంటారు. అభిమానులతో చిట్ చాట్ చేస్తుంటారు. కానీ 'బాహుబలి' బ్యూటీ అనుష్క మాత్రం బయట దర్శనమిచ్చి చాలా ఏళ్ల గడిచిపోయింది. ఇప్పుడు చాన్నాళ్ల తర్వాత బయటకొచ్చింది. అయితే అందరూ ఈమెని చూసే షాకవుతున్నారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)
'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న అనుష్క.. అదే టైంలో 'సైజ్ జీరో' అనే సినిమా చేసింది. దీని కోసం నిజంగా బరువు పెరిగింది. అక్కడి నుంచి అనుష్కకు సమస్యలు మొదలయ్యాయి. పెరగడమైతే పెరిగిపోయింది గానీ దాన్ని తగ్గించడం కోసం నానా పాట్లు పడింది. అడపాదడపా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేసింది గానీ కమర్షియల్ చిత్రాలకు పూర్తిగా దూరమైపోయింది.
అనుష్క హీరోయిన్‌గా చేసిన 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమా గతేడాది థియేటర్లలో రిలీజైంది. అప్పుడు కూడా కనీసం ఒక్కసారి కూడా బయటకు రాలేదు. బరువు తగ్గకపోవడం, ఒకవేళ బయటకొస్తే విమర్శలు రావొచ్చేమో అనే భయంతో రాలేదని అప్పట్లో మాట్లాడుకున్నారు. ఇన్నాళ్ల పాటు వర్కౌట్స్ చేసిందో ఏమో గానీ ఇప్పుడు స్లిమ్ లుక్‌లో కనిపించింది. తాజాగా ఓ మలాయళ సినిమా షూటింగ్‌లో పాల్గొంది. ఈ క్రమంలోనే అనుష్క లేటెస్ట్ ఫొటోస్ బయటకొచ్చాయి. ఈమెని చూసి ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు.
(ఇదీ చదవండి: హీరోయిన్‌తో హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి.. ఎల్లుండే నిశ్చితార్థం?)
Comments
Please login to add a commentAdd a comment