Virat Kohli Shares a Photo With Several Lookalikes - Sakshi
Sakshi News home page

Virat Kohli: ఈ ఫోటోలో టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎక్క‌డున్నాడో గుర్తు ప‌ట్టండి..! 

Published Tue, Feb 22 2022 7:34 PM | Last Updated on Wed, Feb 23 2022 8:07 AM

Spot Virat Kohli In Viral Pic - Sakshi

టీమిండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లికి సంబంధించిన ఫోటో ఒక‌టి ప్ర‌స్తుతం నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. కోహ్లినే స్వ‌యంగా ట్విట‌ర్‌లో షేర్ చేసిన ఈ చిత్రానికి నెటిజ‌న్ల నుంచి విప‌రీత‌మైన రెస్పాన్స్ వ‌స్తుంది. నిమిషాల వ్య‌వ‌ధిలో ల‌క్ష‌ల కొద్దీ లైకులు, వేల‌ల్లో కామెంట్లు వ‌చ్చాయి. ఇంత‌కీ ఈ ఫోటోలో స్పెష‌ల్ ఎంట‌ని అనుకుంటున్నారా.. ? ఈ ఫోటోపై ఓసారి లుక్కేస్తే అది మీకే అర్ధ‌మ‌వుతుంది. 


విరాట్ కోహ్లిలా అచ్చుగుద్దిన‌ట్లు ఉన్న‌ 10 మంది ఈ ఫోటో ఉన్నారు. వీరిలో తాను ఎక్క‌డున్నానో క‌నుక్కోవాలంటూ కోహ్లి స‌వాల్ విసిరాడు. ఈ ఫోటో చూసిన చాలామందికి వీరిలో అస‌లు రియ‌ల్ కోహ్లి ఉన్నాడా అన్న‌ డౌట్ వ‌స్తుంది. అంతలా ఈ ఫోటో నెటిజ‌న్ల‌ను తిక‌మ‌క‌పెడుతుంది. ఈ ఫోటోలో అసలైన విరాట్ కోహ్లిని క‌నుక్కునేందుకు నెటిజ‌న్లు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ ఫోటోను కోహ్లి ఎందుకు షేర్ చేశాడో తెలీదు కానీ.. అభిమానుల బుర్ర‌ల‌కు మాత్రం భ‌లే ప‌ని పెట్టాడు.


చ‌ద‌వండి:  IPL 2022: వేలంలో ఎవ‌రూ కొన‌లేదు.. క‌నీసం విదేశీ లీగ్‌లు ఆడే అనుమ‌తైనా ఇవ్వండి..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement