
Charmi Kaur Birthday Wishes To Director Puri Jagannadh: డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా చార్మీ ఆయనకు స్పెషల్ బర్త్‌డే విషెస్‌ను తెలియజేసేంది. 'నాకెంతో ఇష్టమైన వ్యక్తికి హ్యాపీ బర్త్‌డే. మీరు నాపై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు. మీరు గర్వపడేలా ఆ నమ్మకాన్ని ఎప్పుడూ నిలబెట్టుకుంటానని ఆశిస్తున్నాను' అంటూ మందు గ్లాసు పట్టుకొని పూరితో కలిసి ఉన్న ఓ ఫోటోను షేర్ చేసింది. ఇందులో పూరి జగన్నాథ్ కుర్చీలో కూర్చొని ఉండగా, చార్మీ మందు గ్లాసుతో దర్శనమిచ్చింది.
హీరోయిన్‌గా గుడ్‌బై చెప్పిన చార్మీ ప్రస్తుతం పూరి జగన్నాథ్‌తో కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో సినిమాలు చేస్తుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడెక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. విజయ్ ఈ చిత్రంలో బాక్సర్‌గా అలరించబోతున్న సంగతి తెలిసిందే. తెలుగు,హిందీ, తమిళం, కన్నడలో ఒకేసారి సెప్టెంబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Happy birthday to my most favourite human 🤩
— Charmme Kaur (@Charmmeofficial) September 27, 2021
the trust and belief u have over me , I hope I live upto it always n keep making u feel proud 🤗#purijagannadh #hbdpurijagannadh 💕@puriconnects pic.twitter.com/7Aq9U4KA2a