
Childhood Photo: దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' కంపెనీ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ 'ఆనంద్ మహీంద్రా' గురించి తెలిసే ఉంటుంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త అయినప్పటికీ.. ట్విటర్ వేదికగా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన ఎన్నెన్నో విషయాలను పోస్ట్ చేస్తూ ఉంటారు. నేడు ఆనంద్ మహీంద్రా ఎలా ఉంటారనేది దాదాపు అందరికి తెలుసు. కానీ చిన్నప్పుడు ఎలా ఉండేవాడో బహుశా చాలామందికి తెలియకపోవచ్చు.
ఇప్పటికి అందుబాటులో ఉన్న కొన్ని ఫోటోల ప్రకారం, ఆనంద్ మహీంద్రా చిన్ననాడు ఎలా ఉండేవారో తెలుస్తోంది. ఈ చిత్రంలో మీరు గమనించినట్లయితే ఆనంద్ మహీంద్రా గిటార్ వాయిస్తూ ఉండటం చూడవచ్చు.
ఇదీ చదవండి: 40 సెకన్లకు ఓ కారు.. వినటానికి వింతగా ఉన్నా ఇది నిజం! వీడియో చూడండి
1973లో విడుదలైన ఒక మలయాళీ సినిమా పాటను పాడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో బ్రిటీష్ కుటుంబానికి చెందిన పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. యువకుడుగా ఉన్నప్పుడు ఫోటో కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. ప్రస్తుతం ఆరుపదుల వయసు దాటినా చాలా హుందాగా.. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment