విమానాశ్రయంలో ఇదో కొత్త రకం: జారుకుంటూ వెళ్లిపోవడమే.. | Slide at Singapore Airport Anand Mahindra Post Viral | Sakshi
Sakshi News home page

విమానాశ్రయంలో ఇదో కొత్త రకం: జారుకుంటూ వెళ్లిపోవడమే..

Published Tue, Oct 22 2024 5:52 PM | Last Updated on Tue, Oct 22 2024 6:21 PM

Slide at Singapore Airport Anand Mahindra Post Viral

విమానాశ్రయం అంటే.. అక్కడ మెట్లు లేదా ఎస్కలేటర్స్ వంటివి ఉంటాయి. కానీ సింగపూర్‌లోని చాంగి విమానాశ్రయంలో ఎత్తైన ఇండోర్ స్లయిడ్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో గమనిస్తే.. ఇండోర్ స్లయిడ్ దగ్గరకు తీసుకెళ్లడానికి రెండు గేట్స్ ఉన్నాయి. వీటిని దాటేసిన తరువాత స్లయిడ్ దగ్గరకు వెళ్ళవచ్చు. దీని ద్వారా బోర్డింగ్ గేట్‌ వద్దకు వెళ్ళవచ్చు. అంటే మెట్లు వంటివి ఉపయోగించకుండానే.. కిందికి వెళ్లొచ్చన్నమాట.

నిజానికి ఇలాంటివి పార్కుల్లో లేదా ఎగ్జిబిషన్స్ వంటి వాటిలో కనిపిస్తాయి. అయితే ఇప్పుడు ఏకంగా విమానాశ్రయంలో కనిపించడంతో.. ఈ వీడియో చూసిన చాలామంది ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఆనంద్ మహీంద్రా మండే మోటివేషన్ పేరుతో దీనిని పోస్ట్ చేశారు. దీనిపైనా పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

ఇదీ చదవండి: గూగుల్‌లో ఉచిత భోజనం ఎందుకంటే?: సుందర్ పిచాయ్

చాంగీ విమానాశ్రయంలో ఇప్పటికే కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టారు. ఇప్పుడు తాజాగా టెర్మినల్ 3లో ఈ స్లయిడ్‌ను ఇన్‌స్టాల్ చేసారు. దీనిని స్లయిడ్@T3 అని పిలుస్తారు. 12 మీటర్ల ఎత్తైన ఇండోర్ స్లయిడ్, ప్రయాణికులు సెకనుకు 6 మీటర్ల వేగంతో ప్రయాణించేలా చేస్తుంది. దీనిని పూర్తిగా స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement