slide
-
జారి పట్టుతప్పినా పడిపోని ఒడుపు
ఫూటుగా తాగిన వ్యక్తి చెరువు గట్టు దిగుతుంటే తూలి పడటం సహజం. ఒకవేళ తూలిపడబోతుంటే తమాయించుకుని నిలబడగలిగితే భలేగా నిలబడ్డాడే అని పక్కన ఉన్నవాళ్లు నవ్వుకుంటూ మెచ్చుకోవడం సహజం. మానవులకు సాధ్యమయ్యే ఇలాంటి పనిని మరమనిషి సైతం సాధించి చూపించింది. మట్టిగట్టుపై నడుస్తూ కాలిజారి గబాలున పడబోతూ రోబోట్ వెంటనే తమాయించుకున్న వీడియో ఒకటి ప్రస్తుతం అధునాతన రొబోటిక్ సాంకేతికరంగంలో పెద్ద చర్చనీయాంశమైంది. మనిషికి సాధ్యమయ్యే అసంకల్పిత ప్రతీకార చర్యలు మరమనుషులకు సాధ్యమా? అనే చర్చ మొదలైంది. అయితే వీడియో చూసిన వాళ్లలో కొందరు నవ్వు తెప్పించే కామెంట్లు పెట్టారు. ‘‘హ్యూమనాయిడ్ రోబోట్ ఆప్టిమస్ మనిషిలాగే నడవగలిగే సామర్థ్యం సాధించాలంటే ముందుగా మనిషిలాగా ఇలా జారాలి. వెంటనే సర్దుకొని నిలబడగలగాలి’’అని కామెంట్ చేశారు. ‘పార్టీకి వెళ్లొస్తూ తెల్లవారుజామున నాలుగు గంటలకు నేను ఇలాగే నడుస్తా’అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పుడీ రోబోలు పిల్లాడిలా నడుస్తున్నాయిగానీ చూస్తుండండి త్వరలో ఇవి తుపాకులు పట్టుకుని మన వెంటే పడతాయి’’అని ఇంకొకరు అన్నారు. ‘‘విమానం మెట్ల మీద, సైకిల్ తొక్కుతూ తరచూ పడిపోయే అమెరికా వృద్ధ అధ్యక్షుడు బైడెన్ కంటే ఈ రోబో చాలా బెటర్. పట్టుతప్పినా పడిపోలేదు’’అని ఇంకో వ్యక్తి కామెంట్ చేశారు. – న్యూయార్క్ -
విమానాశ్రయంలో ఇదో కొత్త రకం: జారుకుంటూ వెళ్లిపోవడమే..
విమానాశ్రయం అంటే.. అక్కడ మెట్లు లేదా ఎస్కలేటర్స్ వంటివి ఉంటాయి. కానీ సింగపూర్‌లోని చాంగి విమానాశ్రయంలో ఎత్తైన ఇండోర్ స్లయిడ్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో గమనిస్తే.. ఇండోర్ స్లయిడ్ దగ్గరకు తీసుకెళ్లడానికి రెండు గేట్స్ ఉన్నాయి. వీటిని దాటేసిన తరువాత స్లయిడ్ దగ్గరకు వెళ్ళవచ్చు. దీని ద్వారా బోర్డింగ్ గేట్ వద్దకు వెళ్ళవచ్చు. అంటే మెట్లు వంటివి ఉపయోగించకుండానే.. కిందికి వెళ్లొచ్చన్నమాట.నిజానికి ఇలాంటివి పార్కుల్లో లేదా ఎగ్జిబిషన్స్ వంటి వాటిలో కనిపిస్తాయి. అయితే ఇప్పుడు ఏకంగా విమానాశ్రయంలో కనిపించడంతో.. ఈ వీడియో చూసిన చాలామంది ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఆనంద్ మహీంద్రా మండే మోటివేషన్ పేరుతో దీనిని పోస్ట్ చేశారు. దీనిపైనా పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.ఇదీ చదవండి: గూగుల్‌లో ఉచిత భోజనం ఎందుకంటే?: సుందర్ పిచాయ్చాంగీ విమానాశ్రయంలో ఇప్పటికే కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టారు. ఇప్పుడు తాజాగా టెర్మినల్ 3లో ఈ స్లయిడ్‌ను ఇన్స్టాల్ చేసారు. దీనిని స్లయిడ్@T3 అని పిలుస్తారు. 12 మీటర్ల ఎత్తైన ఇండోర్ స్లయిడ్, ప్రయాణికులు సెకనుకు 6 మీటర్ల వేగంతో ప్రయాణించేలా చేస్తుంది. దీనిని పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారు చేశారు.Apparently at Singapore’s Changi airport you can take a slide to your gate. That’s the way to view Monday mornings & a new week…Beat uncertainty by sliding right into it… #MondayMotivation pic.twitter.com/ZZPuyJX7Kf— anand mahindra (@anandmahindra) October 21, 2024 -
Viral Video: అలా కాదు ఇలా.. ఇలా జారాలి.. జర్రుమని..
పిల్లల్ని ఆటస్థలంలో వదిలేస్తే వాళ్ల ఆటలకి హద్దే ఉండదు. ఎగరడాలు, దూకడాలు, జారడాలు.. ఒకటేమిటి అన్నీ చేస్తారు. అయితే పిల్లలే కాదు మాకు ఆటలంటే సరదానే అని ఒక ఎలుగుబంటి దానిపిల్ల ఆడి మరీ నిరూపించాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అవి ఎలా ఆడుకున్నాయో మీరే చూడండి. ఈ వీడియోలో అమ్మ ఎలుగుబంటి, పిల్ల ఎలుగుబంటి ఎలా వచ్చాయోగానీ స్కూల్ ప్లే గ్రౌండ్లోకి రావడం కనిపిస్తుంది. వాటికి అక్కడి ఆట స్థలంలో స్లైడ్ కనిపించింది. ఇంకేముంది. తల్లి ఎలుగుబంటి ఎక్కి కూర్చుంది. పాపం ఎలుగుబంటి పిల్లకు మాత్రం ఏం చేయాలో ఎలా ఆడాలో తెలియక తికమక పడిపోతూ అటూఇటూ తిరుగుతుంటే పైన కూర్చున్న అమ్మ ఎలుగుబంటి పెద్ద స్లైడ్‌లో నుంచి సర్రుమని జారి కిందికి వచ్చింది. ఇదిగో ఇలా జారాలని చెప్పినట్టు పిల్ల ఎలుగుబంటికి అర్థమైంది. వెంటనే తను కూడా చిన్న స్లైడ్‌లో నుంచి జారి కిందికి వచ్చింది. ఇక తల్లి పిల్ల ఒకదానిపై ఒకటి పడి సరదాగా ఆడుకుంటున్న దృశ్యం ఈ వీడియోలో కనిపిస్తుంది. దీనిని నార్త్ కరొలినాలోని ఇస్సాక్ డెక్సన్ ఎలిమెంటరీ స్కూల్ టీచర్ బెట్సీ స్టాక్ స్లేగర్ ఫేస్ బుక్‌లో ‘దిస్ మేడ్ మై డే - ప్లే గ్రౌండ్ ఎట్ స్కూల్.. వాచ్ ది హోల్ థింగ్!! క్యప్షన్‌తో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో విపరీతంగా షేర్ కావడమేకాకుండా వందల్లో కామెంట్లు వచ్చాయి. ఈ కొంటె ఎలుగుబంట్లను ప్రేమిస్తున్నానని ఒకరు, ఇవి రెండూ సరదాగా ఆడుకుంటున్న దృశ్యం చూడటానికి చాలా బాగుందని మరొకరు కామెంట్ చేశారు. దీంతో పలువురు నెటిజన్లు ఈ వీడియోను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. చదవండి: నటి పుట్టినరోజు వేడుకల్లో అపశ్రుతి... కొంచెమైతే ఏమయ్యేదో.. -
వామ్మో.. కోతులు ఏమాత్రం భయం లేకుండా.. స్పైడర్‌మాన్‌లా..
న్యూఢిల్లీ: సాధారణంగా కోతులు ఒకప్పుడు అడవులలో ఎక్కువగా ఉండేవి. పాపం.. వాటికి సరైన ఆహారం దొరక్క జనావాసాల మధ్యన చేరుకున్నాయి. అయితే, కోతులు చేసే హంగామా.. మాములుగా ఉండదు. అవి ఆహారం కోసం గుంపులు గుంపులుగా ఇళ్లపై దాడిచేసి, చేతికందినవి ఎత్తుకు పోతుంటాయి. ఈ క్రమంలో కోతులు ఒక్కోసారి ప్రవర్తించే తీరు చాలా ఫన్నీగా ఉంటుంది. అవి పెద్ద చెట్లపై అమాంతం ఎక్కి, కొమ్మలను పట్టుకొని వేలాడుతుంటాయి. అదే విధంగా, ఒక ఇంటిపై నుంచి మరొక ఇంటిపై దూకుతూ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఈ క్రమంలో ఒకదానిపై మరొకటి దాడిచేసుకోవడం మనకు తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఈ కోవకు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిలో రెండు కోతులు ఎనిమిది అంతస్థుల భవనంపైకి ఎక్కాయి. అవి వెళ్లిన పని అయిపోయిందేమో.. మరేమో.. కానీ ఆ తర్వాత ఒక గోడను ఆధారంగా చేసుకుని.. ఒకదాని తర్వాత మరొకటి మెల్లగా, పాకుతూ నేలను చేరుకున్నాయి. కాగా, ఈ వీడియోను టైకూన్‌కు చెందిన వ్యాపారవేత్త హార్ష గొయెంకా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ‘ఆ కోతులు అంత ఎత్తున ఉన్న బిల్డింగ్‌పై నుంచి కూడా.. ఎంత తెలివిగా, జాగ్రత్తగా దిగుతున్నాయో.. మనిషి కూడా అదే విధంగా ఎంత పెద్ద సమస్యలు ఎదురైనా వాటిని తేలికగా ఎదుర్కొవచ్చని ’ చెప్పారు. ఇదే వీడియోను ఇండియన్ ఫారెస్ట్ అధికారి సుషాంత్నందా కూడా తన ఇన్‌స్టాలో వేదికగా పోస్ట్ చేశారు. దీనికి ఆయన ‘మనిషి జీవింతంలో సమస్యలు ఉండటం సహాజం.. కానీ, వీటిని మరింత జటిలం చేసుకుంటున్నారని ’ అని కోడ్ చేశారు. ఈ వీడియో ఎంతో స్పూర్తీవంతంగా ఉందని అన్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ ఈ కోతులకు ఫైర్ డిపార్ట్మెంట్లో ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా..’, ‘స్పైడర్‌మెన్ ఏంటా జారటం..’, ‘పట్టు తప్పితే.. ఇంకేమైనా ఉందా..’, ‘వాటి తెలివికి జోహర్లు..’ ‘హమ్మయ్య.. మొత్తానికి కిందకు చేరుకున్నాయి.’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. There are simple things in life you see and they light up your day….. pic.twitter.com/ceciyhKTox — Harsh Goenka (@hvgoenka) June 19, 2021 చదవండి: సైకిల్‌పై వచ్చి చోరీ.. వీడియో తీస్తూ నిలబడిన కస్టమర్లు.. -
దీపావళికి ఊరిస్తున్న బంగారం ధరలు
ముంబై: ఒకవైపు పండుగ సీజన్తరుముకొస్తోంటే.. మరోవైపు పసిడి పరుగుకు పడిన బ్రేక్ మగువల మనసును దోచుకుంటోంది. ఛలో.. గోల్డ్ షాపింగ్... అంటూ ఊరిస్తోంది. అవును గత కొన్ని సెషన్లు గా తగ్గుముఖం పట్టిన బంగారం వెండి ధరలు మరింత దిగి వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలతో వరుసగా మూడో రోజు కూడా క్షీణతను నమోదు చేశాయి. బులియన్ మార్కెట్ లో 10 గ్రా. పసిడి మరో 50 రూపాయలు క్షీణించి 30,250 వద్ద ఉంది. ఇదే బాటలో మరో విలువైన లోహం వెండి కూడా పయనిస్తోంది. 150 రూపాయలు పతనమై కిలో వెండి 42,200 లు పలుకుతోంది. అటు ఎంసీఎక్స్ మార్కెట్ లో 71 పతనమైన 10 గ్రా.పసిడి 29, 638 గా నమోదవుతోంది. మరోవైపు ప్రపంచవ్యాపితంగా బంగారు ధరలు 0.58 శాతం తగ్గి ఔన్స్ ధర 1,250 డాలర్లుగా ఉండగా, ఒక ఔన్స్ వెండి ధర 0.49 శాతం పతనమై 17.38 డాలర్లుగా ఉంది. ఎనిమిది గ్రాముల సావరిన్ గోల్డ్ రూ. 24,300ల వద్ద ఫ్లాట్ గా ఉంది. వెండి నాణేల డిమాండ్ లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంది.అమెరికా ఫెడ్ రేట్లు పెంచనుందనే అంచనాలతో బులియన్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది.అలాగే కోనుగోలుదారుల కొనుగోళ్లు తగ్గిపోవడంతో బులియన్ మార్కెట్ లో బేరిష్ ట్రెండ్ నెలకొందని బులియన్ ట్రేడ్ ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో నగల వ్యాపారులు, పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గిందని బులియన్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. దేశీయ స్పాట్ మార్కెట్లో ఆభరణాలకు , రీటైల్ వర్తకుల డిమాండ్ కూడా తగ్గిందన్నారు. -
పరుగులు పెడుతున్న బంగారం
బ్రెగ్జిట్ దెబ్బతో దూసుకెళ్తున్న పసిడి పరుగుకు బ్రేక్ పడట్లేదు. ఏకంగా రెండేళ్ల గరిష్ట స్థాయిలో పరుగులు తీస్తోంది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ ప్రజాభిప్రాయం ఊహించని విధంగా ఉండటంతో, ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు, కరెన్సీ మార్కెట్లు అతలాకుతలమయ్యాయి. ఆ అనిశ్చిత పరిస్థితిలో ప్రారంభమైన పసిడి దూకుడు, ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉంది. సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారం వైపు ఇన్వెస్టర్లు ఎక్కువగా మొగ్గుచూపుతుండటంతో పసిడి ధరలు రికార్డులు సృష్టిస్తున్నాయి. అన్ని కోణాల నుంచి ఫైనాన్సియల్ మార్కెట్లు బలహీన సంకేతాలు అందిస్తున్నాయి. బ్రెగ్జిట్ దెబ్బతో అంతర్జాతీయంగా వస్తున్న ప్రతికూల పవనాలతో ఆసియన్ స్టాక్స్ 31 ఏళ్ల కనిష్టానికి నమోదవుతున్నాయి. దీంతో సురక్షిత సాధనంగా భావిస్తున్న పసిడి వైపు ఎక్కువగా పెట్టుబడులు తరలిపోతూ..అంతర్జాతీయంగా రెండేళ్లకు పైగా గరిష్టంలో పసిడి ధరలు నమోదవుతున్నాయి. స్పాట్ బంగారం ఔన్స్ కు 1,371.40 డాలర్లు(రూ.92,624.29) పైగా ఎగిసింది. 2014 మార్చిలో ఈ స్థాయిలో రికార్డు అయ్యాయి. కమెక్స్ గోల్డ్ ఫ్యూచర్లు 0.9 శాతం పెరిగి, 1,371.10డాలర్ల(రూ.92590.31)గా నమోదవుతోంది. 2010 నుంచి ఇదే అత్యంత పెరుగుదల. దేశీయ మార్కెట్లో సైతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.170 ఎగిసి రూ.31,953గా నమోదైంది. బ్రెగ్జిట్ పరిణామం బుల్లిష్ మార్కెట్లో పసిడికి మద్దతు పలుకుతూ సెంటిమెంట్ ను మరింత బలపరుస్తుందని ఎంకేఎస్ ట్రేడర్ జేమ్స్ గార్డినర్ తెలిపారు. బంగారం భారీ స్థాయిలో దూసుకెళ్తుండటంతో, 10 బిలియన్ ఫౌండ్ల విలువ చేసే మూడు బ్రిటీష్ కమర్షియల్ ప్రాపర్టి ఫండ్స్ 24గంటల్లోనే తమ ట్రేడింగ్ లను నిలిపివేశాయి. మరోవైపు ఆయిల్ ధరలు పడిపోతున్నాయి. బ్రెండ్ క్రూడ్ 0.4శాతం పడిపోయి 47.79 డాలర్లుగా నమోదవుతోంది. మంగళవారం ఒక్కరోజు 4.3శాతం బ్రెండ్ క్రూడ్ పతనమైంది.