వామ్మో.. కోతులు ఏమాత్రం భయం లేకుండా.. స్పైడర్‌మాన్‌లా.. | Two Monkeys Playing And Sliding Down Building s Wall Viral Video | Sakshi
Sakshi News home page

వామ్మో.. కోతులు ఏమాత్రం భయం లేకుండా..

Published Mon, Jun 21 2021 11:55 AM | Last Updated on Mon, Jun 21 2021 2:15 PM

Two Monkeys Playing And Sliding Down  Building s Wall Viral Video - Sakshi

న్యూఢిల్లీ: సాధారణంగా కోతులు ఒకప్పుడు అడవులలో ఎక్కువగా ఉండేవి. పాపం.. వాటికి సరైన ఆహారం దొరక్క జనావాసాల మధ్యన చేరుకున్నాయి. అయితే, కోతులు చేసే హంగామా.. మాములుగా ఉండదు. అవి ఆహారం కోసం గుంపులు గుంపులుగా ఇళ్లపై దాడిచేసి, చేతికందినవి ఎత్తుకు పోతుంటాయి. ఈ క్రమంలో​ కోతులు ఒక్కోసారి ప్రవర్తించే తీరు చాలా ఫన్నీగా ఉంటుంది. అవి పెద్ద చెట్లపై అమాంతం ఎక్కి, కొమ్మలను పట్టుకొని వేలాడుతుంటాయి. అదే విధంగా, ఒక ఇంటిపై నుంచి మరొక ఇంటిపై దూకుతూ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఈ క్రమంలో ఒకదానిపై మరొకటి దాడిచేసుకోవడం మనకు తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఈ కోవకు చెందిన ఒక వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

దీనిలో​ రెండు కోతులు ఎనిమిది అంతస్థుల భవనంపైకి ఎక్కాయి. అవి వెళ్లిన పని అయిపోయిందేమో.. మరేమో.. కానీ ఆ తర్వాత ఒక గోడను ఆధారంగా చేసుకుని.. ఒకదాని తర్వాత మరొకటి మెల్లగా, పాకుతూ నేలను చేరుకున్నాయి. కాగా, ఈ వీడియోను టైకూన్‌కు చెందిన వ్యాపారవేత్త హార్ష గొయెంకా తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. ‘ఆ కోతులు అంత ఎత్తున ఉన్న బిల్డింగ్‌పై నుంచి కూడా.. ఎంత తెలివిగా, జాగ్రత్తగా దిగుతున్నాయో.. మనిషి కూడా అదే విధంగా ఎంత పెద్ద సమస్యలు ఎదురైనా వాటిని తేలికగా ఎదుర్కొవచ్చని ’ చెప్పారు.

ఇదే వీడియోను ఇండియన్‌ ఫారెస్ట్‌ అధికారి సుషాంత్‌నందా కూడా తన ఇన్‌స్టాలో వేదికగా పోస్ట్‌ చేశారు. దీనికి ఆయన ‘మనిషి జీవింతంలో సమస్యలు ఉండటం సహాజం.. కానీ, వీటిని మరింత జటిలం చేసుకుంటున్నారని ’ అని కోడ్‌ చేశారు. ఈ వీడియో ఎంతో స్పూర్తీవంతంగా ఉందని అన్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ ఈ కోతులకు ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌లో ఏమైనా ట్రైనింగ్‌ ఇచ్చారా..’, ‘స్పైడర్‌మెన్‌ ఏంటా జారటం..’, ‘పట్టు తప్పితే.. ఇంకేమైనా ఉందా..’, ‘వాటి తెలివికి జోహర్లు..’ ‘హమ్మయ్య.. మొత్తానికి కిందకు చేరుకున్నాయి.’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. 

చదవండి: సైకిల్‌పై వచ్చి చోరీ.. వీడియో తీస్తూ నిలబడిన కస్టమర్లు..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement