singapore airport
-
విమానాశ్రయంలో ఇదో కొత్త రకం: జారుకుంటూ వెళ్లిపోవడమే..
విమానాశ్రయం అంటే.. అక్కడ మెట్లు లేదా ఎస్కలేటర్స్ వంటివి ఉంటాయి. కానీ సింగపూర్‌లోని చాంగి విమానాశ్రయంలో ఎత్తైన ఇండోర్ స్లయిడ్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో గమనిస్తే.. ఇండోర్ స్లయిడ్ దగ్గరకు తీసుకెళ్లడానికి రెండు గేట్స్ ఉన్నాయి. వీటిని దాటేసిన తరువాత స్లయిడ్ దగ్గరకు వెళ్ళవచ్చు. దీని ద్వారా బోర్డింగ్ గేట్ వద్దకు వెళ్ళవచ్చు. అంటే మెట్లు వంటివి ఉపయోగించకుండానే.. కిందికి వెళ్లొచ్చన్నమాట.నిజానికి ఇలాంటివి పార్కుల్లో లేదా ఎగ్జిబిషన్స్ వంటి వాటిలో కనిపిస్తాయి. అయితే ఇప్పుడు ఏకంగా విమానాశ్రయంలో కనిపించడంతో.. ఈ వీడియో చూసిన చాలామంది ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఆనంద్ మహీంద్రా మండే మోటివేషన్ పేరుతో దీనిని పోస్ట్ చేశారు. దీనిపైనా పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.ఇదీ చదవండి: గూగుల్‌లో ఉచిత భోజనం ఎందుకంటే?: సుందర్ పిచాయ్చాంగీ విమానాశ్రయంలో ఇప్పటికే కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టారు. ఇప్పుడు తాజాగా టెర్మినల్ 3లో ఈ స్లయిడ్‌ను ఇన్స్టాల్ చేసారు. దీనిని స్లయిడ్@T3 అని పిలుస్తారు. 12 మీటర్ల ఎత్తైన ఇండోర్ స్లయిడ్, ప్రయాణికులు సెకనుకు 6 మీటర్ల వేగంతో ప్రయాణించేలా చేస్తుంది. దీనిని పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారు చేశారు.Apparently at Singapore’s Changi airport you can take a slide to your gate. That’s the way to view Monday mornings & a new week…Beat uncertainty by sliding right into it… #MondayMotivation pic.twitter.com/ZZPuyJX7Kf— anand mahindra (@anandmahindra) October 21, 2024 -
జలపాతం...‘ఛాంగీ’ భళా!
మీకు మయసభ గురించి తెలుసుకదా.. సుందర భవనాంతరమ్మున తటాకాలా? అంటూ ఈ భవనాన్ని చూసి దుర్యోధనుడు ఆశ్చర్యపోవడం మనం సినిమాల్లో చూశాం కూడా. సింగపూర్‌లోని ఛాంగీ విమానాశ్రయాన్ని సందర్శించే వారు కూడా ఇకపై ఇలాగే ముక్కున వేలేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కొత్తగా ఓ జలపాతాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇదేదో చిన్నా చితకా జలపాతం అనుకునేరు. ఏకంగా తొమ్మిది అంతస్తుల ఎత్తుంది. బటర్‌ఫ్లై పార్క్, 24 గంటల సినిమాహాల్స్, స్పాలతో విమానాశ్రయానికి కొత్త అర్థాన్ని చెప్పిన ఛాంగీ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ‘రెయిన్ వర్టెక్స్’ జలపాతం సరికొత్త ఆకర్షణగా నిలుస్తోంది. ‘వెట్’ అనే సంస్థ దీని కోసం విమానాశ్రయపు అద్దాల పైకప్పులో భారీ కన్నం చేసింది. తొమ్మిది అంతస్తుల పైనుంచి పడే నీరు గ్రౌండ్ లెవెల్లో ఉండే పెద్ద పూల్‌లోకి పడతాయి. జలపాతానికి ఎల్ఈడీ రంగుల హంగులు కూడా జోడించారు. అసలైన వాటర్‌ఫాల్‌ను నిర్మించేందుకు ముందుగా ‘వెట్’ ఇంజినీర్లు ముందుగా ఒక స్కేల్ మోడల్‌ను నిర్మించి గాలి పీడనం తదితర అంశాలను అర్థం చేసుకున్నారు. సాధారణ జలపాతం మాదిరిగా నీరు చెల్లాచెదరు కాకుండా అన్ని సమయాల్లోనూ ఒకేచోట పడేలా జాగ్రత్త తీసుకున్నారు. విమానాశ్రయం పైభాగం నుంచి సేకరించే వర్షపునీటితోనే ఈ వాటర్‌ఫాల్ నడవడం మరో విశేషం. భారీ వర్షాలు పడినప్పుడు ఈ జలపాతం ద్వారా నిమిషానికి దాదాపు 40,000 లీటర్ల నీరు జాలువారుతూంటుందని అంచనా.