మరోసారి వార్తల్లో నిలిచిన సమంత స్టైలిస్ట్‌ ప్రీతమ్‌ జుకల్కర్‌ | Samantha Foreign Tour With Preetham Jukalker And Sadhana Singh | Sakshi
Sakshi News home page

Samantha: ఫారిన్‌ వెళ్తున్నాం అంటూ పోస్ట్‌ చేసిన సామ్‌..

Published Wed, Oct 27 2021 3:43 PM | Last Updated on Wed, Oct 27 2021 9:23 PM

Samantha Foreign Tour With Preetham Jukalker And Sadhana Singh - Sakshi

Samantha Foreign Tour With Preetham Jukalker And Sadhana Singh: సమంత ప్రస్తుతం వెకేషన్‌లపై ఎక్కువగా దృష్టి పెట్టింది. నాగచైతన్యతో విడిపోయిన అనంతరం సమంత బాగా కుంగిపోయిందని ఆమె సన్నిహితులు తెలిపారు. దీంతో బాధలోంచి బయటపడేందుకు క్లోజ్‌ఫ్రెండ్స్‌తో ఎక్కువగా సమయాన్ని గడుపుతుందని సమాచారం. విడాకుల ప్రకటనకు కొద్ది రోజుల ముందు కూడా సామ్‌ తిరుపతి, శ్రీకాశహస్తి దైవ దర్శనాలకు వెళ్లిన సామ్‌..ఇటీవలె స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి చార్‌ధామ్‌ యాత్రను సందర్శించిన సంగతి తెలిసిందే. చదవండి: నా కొడుకులకు అలాంటివి చేయొద్దని చెప్తా : నాగార్జున

తాజాగా సమంత మరో వెకేషన్‌ ట్రిప్‌కు వెళ్లింది. తన పర్సనల్‌ డిజైనర్‌, స్టైలిస్ట్‌ ప్రీతమ్‌ జుకల్కర్‌, మేకప్‌ ఆర్టిస్ట్‌ సాధనా సింగ్‌లతో కలిసి సామ్‌ దుబాయ్‌కు పయనమైంది. దీనికి సంబంధించిన ఫోటోను సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేస్తూ.. ఫారిన్‌కు వెళ్తున్నాం అని పేర్కొంది. దీంతో ప్రీతమ్‌ పేరు మరోసారి నెట్టింట వైరల్‌గా మారింది.

ఇది వరకే తనపై వస్తున్న రూమర్స్‌కు ప్రీతమ్‌ ఖండించిన సంగతి తెలిసిందే. సమంత తనకు అక్కలాంటిదని, ఈ విషయం నాగ చైతన్యకు కూడా తెలుసని పేర్కొన్నాడు. కాగా చైతూతో విడాకుల అనంతరం సమంత ఇటీవలె బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు ప్రకటించింది. వచ్చే నెలలో ఈ సినిమాలు సెట్స్‌పైకి వెళ్లనున్నాయి. 

చదవండి: సమంత పోస్టుకు కామెంట్‌ చేసిన వెంకటేశ్‌ కూతురు
ఫారెన్‌ అమ్మాయితో రెండో పెళ్లి.. స్పందించిన మంచు మనోజ్‌
అందుకే పూరి జగన్నాథ్‌​ భార్య అంటే ఇష్టం: ప్రభాస్‌


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement