Preetham Jukalker
-
చై మంచివాడు, సమంత ఆ ఫోటో డిలీట్ చేసినందుకు..: ప్రీతమ్
సెలబ్రిటీ స్టైలిష్ట్ ప్రీతమ్ జుకల్కర్ పేరు ఆ మధ్య మార్మోగిపోయింది. సెలబ్రిటీలకు డిజైనర్ డ్రెస్సులు రెడీ చేసినందుకు మాత్రమే కాదు సమంతతో క్లోజ్‌గా ఓ ఫోటో దిగినందుకు కూడా! ఇతడి వల్లే సమంత- నాగచైతన్యల పచ్చటి సంసారం చెల్లాచెదురైందని, అసలు సామ్‌తో ఇతగాడికున్న సంబంధం ఏంటంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. అతడు సామ్‌కు మంచి స్నేహితుడు మాత్రమేనని అభిమానులు మొత్తుకున్నా నెటిజన్లు మాత్రం ప్రీతమ్‌ను వదిలిపెట్టలేదు. ఛాన్స్ దొరికినప్పుడల్లా అతడిని ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. సమంత ప్రోత్సాహం వల్లే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చే విమర్శలపై స్పందించాడు ప్రీతమ్. ఆయన మాట్లాడుతూ.. 'సమంత నన్ను నమ్మింది. నా ప్రతిభను ప్రోత్సహించింది. తన ప్రోత్సాహం వల్లే ముందడుగు వేశాను. తనకు స్టైలింగ్ చేశాను. అయితే చాలామంది నన్ను, సామ్‌ను విమర్శించారు. ఇతడు అవసరమా? పాత స్టైలిష్ట్ దగ్గరికే వెళ్లొచ్చుగా.. ఈ బొంబాయి వాళ్లను ఎందుకు నమ్ముతున్నావు? అతడొక గే అన్నారు. నేనేమీ చెడ్డవాడిని కాదు ఆ మాటలు విని చాలా బాధేసింది. ఎటువంటి పరిచయాలు లేకుండా ఇండస్ట్రీకి వచ్చాను. నేనేమీ చెడ్డవాడిని కాదు. సృజనాత్మకత ఉన్న వ్యక్తిని, ఒక కళాకారుడిని.. హీరోయిన్స్‌కే ఎందుకు డిజైనర్స్గా ఉంటామంటే హీరోలు ప్రయోగాలు ఒప్పుకోరు. విభిన్నంగా కాస్ట్యూమ్‌లు వేసుకోవడానికి సుముఖత వ్యక్తం చేయరు. ఇకపోతే సమంత ఓసారి నాపై కాళ్లు పెట్టుకుని ఉన్న ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి డిలీట్ చేసింది. అదో పెద్ద సంచలనమైంది. ఒకటి కొడితే పది దెబ్బలు కొడ్తా ఆ ఫోటో చూసి ఏవేవో ఊహించుకున్నారు. మాది అన్నాచెల్లెళ్ల బంధం అనుకోవచ్చుగా.. మేము మంచి స్నేహితులం మాత్రమే.. మా మధ్య అంతకుమించి మరేం లేదు. చైసామ్ విడిపోయినప్పుడు నామీద చాలా ద్వేషం చూపించారు. నన్ను నానా మాటలు అన్నారు, భరించాను, కానీ నా కుటుంబాన్ని కూడా లాగారు. అది నేను సహించలేకపోయాను. నేనేమీ గాంధీజీలా ఒక దెబ్బ కొడితే మరో చెంప చూపించే రకం కాదు. ఒకటి కొడితే పది దెబ్బలు కొట్టాలన్నంత కోపంగా ఉన్నాను. చై మంచివాడు నాగచైతన్య విషయానికి వస్తే అతడు చాలా మంచివాడు. నేను కలిసిన మంచి వ్యక్తుల్లో అతడు ఒకరు. ఇకపోతే నా కెరీర్లో నేను ఎన్నో ఇబ్బందులు, విమర్శలు ఎదుర్కొన్నాను. నా స్థానంలో వేరొకరు ఉంటే ఆత్మహత్య చేసుకునేవారు. దయచేసి నిజానిజాలు తెలుసుకోకుండా ఎవరినీ టార్గెట్ చేయొద్దని కోరుతున్నాను' అన్నాడు ప్రీతమ్ జుకల్కర్. చదవండి: హనుమంతుడి నోట మాస్ డైలాగ్స్.. విన్నదే రాశానన్న రైటర్ -
తన స్టైలిస్ట్ ప్రీతమ్ కోసం సమంత ఏం చేసిందో చూడండి..
-
తన స్టైలిస్ట్ ప్రీతమ్ కోసం సమంత ఏం చేసిందో చూడండి..
సమంత-నాగ చైతన్య విడాకుల వ్యవహారం ఇప్పటికీ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గానే ఉంది. టాలీవుడ్ మోస్ట్ క్యూటెస్ట్ కపుల్‌గా పేరు సంపాదించుకున్న ఈ జంట అనూహ్యంగా గతేడాది అక్టోబర్2న విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు వీరు ఎందుకు విడిపోయారన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. దీనిపై అటు చై కానీ, ఇటు సమంత కానీ ఎప్పుడూ పెదవి విప్పలేదు. కానీ విడాకుల ప్రకటన అనంతరం సమంతను విమర్శిస్తూ ఓ వర్గం సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఇక అప్పట్లో సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ పేరు కూడా ప్రధానంగా వినిపించింది. కానీ ప్రీతమ్ సమంతను అక్కా అని పిలుస్తాడని ఆమె సన్నిహితులు చెప్పడంతో రూమర్స్‌కి తెర పడినట్లయ్యింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత తనకు సంబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా తన మల్టీటాలెంట్‌ను బయటపెట్టింది. తన స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్కి హెయిర్ కట్ చేసి ఆ వీడియోను తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. నేను మల్టీటాలెంట్‌ని. నేను చేసిన పనికి నువ్ ఇంకా నాకు డబ్బులు చెల్లించలేదు అని పేర్కొంది. దీనికి ప్రీతమ్ కూడా చంపెయ్ అంటూ ఫన్నీగా బదులిచ్చాడు. చదవండి: నాగ చైతన్యను అన్‌ఫాలో చేసిన సమంత.. కానీ చై మాత్రం -
ఎంకరేజ్ చేద్దామనుకున్నా, ప్రీతమ్ ఓడిపోయాడు: సమంత
ఫిట్నెస్ మీద ఎక్కువ దృష్టిపెట్టేవాళ్లలో హీరోయిన్ సమంత ఒకరు. అందుకే ఎప్పుడు చూసినా ఆమె జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ చెమటలు చిందిస్తుంటుంది. తాజాగా సామ్ లెవల్ అప్ అనే కొత్త వర్కవుట్ ఛాలెంజ్‌ను విసిరింది. అంతేకాదు, ముందుగా ఆమె ఆ ఛాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేసి దానికి సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది. ఈ లెవల్ అప్ వర్కవుట్ ఛాలెంజ్‌ను సామ్ స్నేహితులు హెయిర్ స్టైలిస్ట్ రోహిత్ భట్కర్, మేకప్ ఆర్టిస్ట్ రంభియా, ప్రీతమ్ జుకల్కర్లు ట్రై చేశారు. రోహిత్ ఈ ఛాలెంజ్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయగా రంభియా మాత్రం వెల్లకిలా పడిపోయింది. ఇక ప్రీతమ్ అయితే ముందుకు పడటంతో సామ్ నవ్వాపుకోలేకపోయింది. నేను ఎంకరేజ్ చేద్దామనుకున్నా.. కానీ ప్రీతమ్ వల్ల కావడం లేదు, ఓడిపోయాడు అని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే వరుస ప్రాజెక్టులతో దూకుడు మీదున్న సామ్ హాలీవుడ్ మూవీ 'అరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్'లో బై-సెక్సువల్ యువతి పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే! -
మెగా డాటర్ శ్రీజ పోస్ట్‌పై సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ ఆసక్తికర కామెంట్
Samantha Stylist Preetham Jukalker Comments On Mega Daughter Sreeja Post Goes Viral: సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్.. ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా నిలిచిన పేరు ఇది. టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగ చైతన్య-సమంత విడాకుల ముందుకు వరకు ప్రీతమ్ జుకాల్కర్ అంటే పెద్దగా ఎవరికి తెలియదు. కానీ వారి విడాకుల ప్రకటన అనంతరం ఈ పేరు మీడియాలో, సోషల్ మీడియాల్లో మారు మోగింది. ఎందుకంటే చై-సామ్ విడిపోవడానికి ప్రధాన కారణం ఇతడేనంటూ అక్కినేని ఫ్యాన్స్ ప్రీతమ్‌పై మండిపడ్డారు. చదవండి: పోలీసులను ఆశ్రయించిన నటి స్నేహా సమంత స్టైలిస్ట్ అయితే మాత్రం తనతో అంత చనువేంటని, సామ్‌కు దూరంగా ఉండాలంటూ చై-సామ్ అభిమానులు అతడికి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇలా వివాదాలు, విమర్శలు ఎదుర్కొంటు ప్రీతమ్ వార్తల్లోకి ఎక్కాడు. ఇక తాజాగా మరోసారి ప్రీతమ్ పేరు తెరపైకి వచ్చింది. మెగా డాటర్ శ్రీజ కల్యాణ్ బర్త్‌డే రోజున ఆమె పెట్టిన పోస్ట్‌పై ప్రీతమ్ ఆసక్తికర కామెంట్ చేశాడు. దీంతో ప్రీతమ్ పెట్టిన కామెంట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. చదవండి: నాగ్ సినిమా మేకర్స్‌కు చుక్కలు చూపించిన అమలా పాల్, మెహ్రీన్! శ్రీజ తనకు బర్త్‌డే విషెస్ తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ తన ఫొటోతో పోస్ట్ షేర్ చేసింది. దీనికి ప్రీతమ ‘సుందర్ లడికీ(అందమైన అమ్మాయి)’ అంటూ కామెంట్ చేశాడు. దీంతో నెటజన్ల ఫోకస్ ప్రీతమ్ కామెంట్‌పై పడింది. చూస్తుంటే ప్రీతమ్ సమంతకు మాత్రమే కాదు టాలీవుడ్‌కు చెందిన పలువురికి డిజైనర్‌గా వ్యవహరిస్తున్నాడంటూ చర్చించుకుంటున్నారు. అంతేగాక సమంతతో పాటు మెగా కుటుంబానికి కూడా ప్రీతమ్ సుపరిచితుడేనంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: హాట్ టాపిక్‌గా శివకార్తికేయన్ రెమ్యునరేషన్, తక్కువ టైంలో అంత మొత్తమా! View this post on Instagram A post shared by Sreeja (@sreeja_kalyan) -
కొన్నిసార్లు కలపడం కంటే వదిలేయడమే బెటర్: సామ్ ఆసక్తికర వీడియో
నాగ చైతన్యతో విడిపోయినప్పటీ నుంచి సమంత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటున్నారు. విడాకుల ప్రకటన అనంతరం తను ఏం చెప్పాలనుకున్నా ఇన్స్టాగ్రామ్ ద్వారానే మాట్లాడుతున్నారు. ఇక తన బాధను, భావోద్యేగాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. దీంతో సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ప్రతి పోస్ట్ చర్చనీయాంశం అవుతుంది. అయితే ఇటీవల సామ్ తన స్నేహితురాలు, మోడల్ శిల్పారెడ్డితో కలిసి ఛార్‌ధామ్ యాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే. చదవండి: సమంత పోస్ట్‌పై వెంకటేశ్ కూతురు అశ్రిత ఆసక్తికర కామెంట్ యాత్ర నుంచి తిరిగొచ్చిన సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్, మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్‌లతో కలిసి దుబాయ్ పర్యాటనకు వెళ్లారు. ప్రస్తుతం సామ్ దుబాయ్‌లోనే ఉన్నారు. ఈ క్రమంలో సమంత ఓ ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. ఈ సందర్భంగా సామ్ తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. అలాగే ఎప్పుడైన మూడ్ బాగా లేకపోయినా లేదా డిప్రెషన్‌గా అనిపించినా దాని నుంచి బయట పడేందుకు కబోర్డులోని బట్టలన్నీ తీసి సర్దుకుంటానని చెప్పారు. ఈ సందర్భంగా సామ్ మాట్లాడుతూ.. ‘చిందరవందరగా ఉన్న నా డ్రెస్సింగ్ రూంను ఎంత నీట్‌గా చేశారో చూడండి’ అంటూ ఓ కంపెనీకి ప్రమోషన్ ఇచ్చారు. చదవండి: నాగచైతన్యతో కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేసిన సమంత అలాగే తన డ్రెస్సింగ్ రూం టూర్ నిర్వహించారు. ఈ వీడియోలో సమంతతో పాటు తన స్టైలిస్ట్ ప్రీతమ్ జూకల్కర్, మరో మహిళ కనిపించారు. బెడ్‌పై కుప్పలు కుప్పలుగా పడి ఉన్న బట్టలన్నీ చూపించి ఇవి ఇప్పుడు సర్దుకోవాలి అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ వీడియోకు సామ్ ‘కొన్నిసార్లు సర్దడం. కలపడం కంటే వదిలేయడమే మంచిది’ అంటూ ఆసక్తికర క్యాప్షన్‌ను జత చేశారు ఆమె. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇక సమంత క్యాప్షన్ చూసి పలువురు ఆలోచనలో పడుతుంటే.. ఈ వీడియోలో ఆమె స్టైలిస్ట్ ప్రీతమ్‌ను చూసి అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
మరోసారి వార్తల్లో నిలిచిన సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్
Samantha Foreign Tour With Preetham Jukalker And Sadhana Singh: సమంత ప్రస్తుతం వెకేషన్లపై ఎక్కువగా దృష్టి పెట్టింది. నాగచైతన్యతో విడిపోయిన అనంతరం సమంత బాగా కుంగిపోయిందని ఆమె సన్నిహితులు తెలిపారు. దీంతో బాధలోంచి బయటపడేందుకు క్లోజ్‌ఫ్రెండ్స్‌తో ఎక్కువగా సమయాన్ని గడుపుతుందని సమాచారం. విడాకుల ప్రకటనకు కొద్ది రోజుల ముందు కూడా సామ్ తిరుపతి, శ్రీకాశహస్తి దైవ దర్శనాలకు వెళ్లిన సామ్..ఇటీవలె స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి చార్ధామ్ యాత్రను సందర్శించిన సంగతి తెలిసిందే. చదవండి: నా కొడుకులకు అలాంటివి చేయొద్దని చెప్తా : నాగార్జున తాజాగా సమంత మరో వెకేషన్ ట్రిప్‌కు వెళ్లింది. తన పర్సనల్ డిజైనర్, స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్, మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్‌లతో కలిసి సామ్ దుబాయ్‌కు పయనమైంది. దీనికి సంబంధించిన ఫోటోను సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. ఫారిన్‌కు వెళ్తున్నాం అని పేర్కొంది. దీంతో ప్రీతమ్ పేరు మరోసారి నెట్టింట వైరల్‌గా మారింది. ఇది వరకే తనపై వస్తున్న రూమర్స్‌కు ప్రీతమ్ ఖండించిన సంగతి తెలిసిందే. సమంత తనకు అక్కలాంటిదని, ఈ విషయం నాగ చైతన్యకు కూడా తెలుసని పేర్కొన్నాడు. కాగా చైతూతో విడాకుల అనంతరం సమంత ఇటీవలె బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు ప్రకటించింది. వచ్చే నెలలో ఈ సినిమాలు సెట్స్‌పైకి వెళ్లనున్నాయి. చదవండి: సమంత పోస్టుకు కామెంట్ చేసిన వెంకటేశ్ కూతురు ఫారెన్ అమ్మాయితో రెండో పెళ్లి.. స్పందించిన మంచు మనోజ్ అందుకే పూరి జగన్నాథ్ భార్య అంటే ఇష్టం: ప్రభాస్