Preetham Jukalker Shocking Comments On Chiranjeevi Daughter Sreeja Photo Goes Viral - Sakshi
Sakshi News home page

Preetham Jukalker: మెగా డాటర్‌ శ్రీజ ఫొటోకు ప్రీతమ్‌ కామెంట్‌, షాకవుతున్న నెటిజన్లు

Published Fri, Nov 19 2021 12:53 PM | Last Updated on Fri, Nov 19 2021 3:08 PM

Preetham Jukalker Interesting Comment On Chiranjeevi Daughter Sreeja Post - Sakshi

Samantha Stylist Preetham Jukalker Comments On Mega Daughter Sreeja Post Goes Viral: సమంత స్టైలిస్ట్‌ ప్రీతమ్‌ జుకాల్కర్.. ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా నిలిచిన పేరు ఇది. టాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌ నాగ చైతన్య-సమంత విడాకుల ముందుకు వరకు ప్రీతమ్‌ జుకాల్కర్ అంటే పెద్దగా ఎవరికి తెలియదు. కానీ వారి విడాకుల ప్రకటన అనంతరం ఈ పేరు మీడియాలో, సోషల్‌ మీడియాల్లో మారు మోగింది. ఎందుకంటే చై-సామ్‌ విడిపోవడానికి ప్రధాన కారణం ఇతడేనంటూ అక్కినేని ఫ్యాన్స్‌ ప్రీతమ్‌పై మండిపడ్డారు.

చదవండి: పోలీసులను ఆశ్రయించిన నటి స్నేహా

Chiranjeevi Daughter Sreeja

సమంత స్టైలిస్ట్‌ అయితే మాత్రం తనతో అంత చనువేంటని, సామ్‌కు దూరంగా ఉండాలంటూ చై-సామ్‌ అభిమానులు అతడికి వార్నింగ్‌ కూడా ఇచ్చారు. ఇలా వివాదాలు, విమర్శలు ఎదుర్కొంటు ప్రీతమ్‌ వార్తల్లోకి ఎక్కాడు. ఇక తాజాగా మరోసారి ప్రీతమ్‌ పేరు తెరపైకి వచ్చింది. మెగా డాటర్‌ శ్రీజ కల్యాణ్‌ బర్త్‌డే రోజున ఆమె పెట్టిన పోస్ట్‌పై ప్రీతమ్‌ ఆసక్తికర కామెంట్‌ చేశాడు. దీంతో ప్రీతమ్‌ పెట్టిన కామెంట్‌ సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది.

చదవండి: నాగ్‌ సినిమా మేకర్స్‌కు చుక్కలు చూపించిన అమలా పాల్‌, మెహ్రీన్‌!

Preetham Jukalker Comments On Sreeja Photo

శ్రీజ తనకు బర్త్‌డే విషెస్ తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ తన ఫొటోతో పోస్ట్‌ షేర్‌ చేసింది. దీనికి ప్రీతమ ‘సుందర్ లడికీ(అందమైన అమ్మాయి)’ అంటూ కామెంట్‌ చేశాడు. దీంతో నెటజన్ల ఫోకస్‌ ప్రీతమ్‌ కామెంట్‌పై పడింది. చూస్తుంటే ప్రీతమ్‌ సమంతకు మాత్రమే కాదు టాలీవుడ్‌కు చెందిన పలువురికి డిజైనర్‌గా వ్యవహరిస్తున్నాడంటూ చర్చించుకుంటున్నారు. అంతేగాక సమంతతో పాటు మెగా కుటుంబానికి కూడా ప్రీతమ్‌ సుపరిచితుడేనంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

చదవండి: హాట్‌ టాపిక్‌గా శివకార్తికేయన్‌ రెమ్యునరేషన్‌, తక్కువ టైంలో అంత మొత్తమా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement