
సారాతో డిన్నర్‌లో గిల్(PC: Social Media)
బాలీవుడ్ నటి సారా అలీఖాన్‌తో శుబ్‌మన్ గిల్ డేటింగ్? అంటూ సోషల్ మీడియాలో కథనాలు.. వైరల్ అవుతున్న ఫొటోలు
Shubman Gill- Sara Ali Khan: కెరీర్‌లో ప్రస్తుతం అత్యుత్తమ దశలో ఉన్నాడు టీమిండియా క్రికెటర్ శుబ్‌మన్ గిల్. ఇటీవల జరిగిన వెస్టిండీస్, జింబాబ్వే వన్డే సిరీస్‌లలో ఓపెనర్‌గా.. వన్‌డౌన్ బ్యాటర్‌గా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా జింబాబ్వే పర్యటనలో భాగంగా మూడో వన్డే సందర్భంగా కెరీర్‌లో తొలి శతకం నమోదు చేశాడు. జట్టును గెలిపించడంతో పాటుగా వ్యక్తిగతంగానూ టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మ రికార్డులు బద్దలు కొట్టాడు.
ఇక 22 ఏళ్ల గిల్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. సచిన్ తనయ సారా టెండుల్కర్‌తో డేటింగ్‌లో ఉన్నాడంటూ గతంలో వదంతులు వ్యాపించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో అవుతూ ఒకరి పోస్టులకు మరొకరు కామెంట్లు పెట్టడంతో ఈ వార్తలు పుట్టుకొచ్చాయి.
ఆ సారాతో బ్రేకప్.. ఇప్పుడు ఈ సారాతో..
అయితే, కొన్నాళ్ల క్రితం.. దేవతలతో ప్రేమలో పడకూడదంటూ గిల్ ఇన్‌స్టాలో ఓ పోస్టు షేర్ చేయడంతో ఈ జంట బ్రేకప్ చెప్పుకొందంటూ గాసిప్ రాయుళ్లు మరోసారి తమ ఇష్టారీతిన కథనాలు అల్లేశారు. కెరీర్‌లో తొలి సెంచరీ చేయడం సహా.. సచిన్ రికార్డును గిల్ బద్దలు కొట్టిన తరుణంలో సారా నుంచి విషెస్ వస్తాయని ఊహించామని.. అయితే, విడిపోయిన కారణంగానే ఆమె.. గిల్ విజయంపై స్పందించలేదని మరికొందరు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు.
ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారని.. ఇక వీరిద్దరి ప్రేమకథకు ఎండ్‌కార్డ్ పడిందనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. దీంతో సారా పేరు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఇదిలా ఉంటే.. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ ఫొటో గిల్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఇందులో శుబ్‌మన్ గిల్.. బాలీవుడ్ నటి సారా అలీఖాన్‌తో దుబాయ్‌లోని రెస్టారెంట్‌లో డిన్నర్‌కు వచ్చినట్లుగా కనిపిస్తోంది.
టిక్‌టాక్ యూజర్ వీడియోతో..
ఓ టిక్‌టాక్ యూజర్ బస్తియాన్‌లో సారా అలీ ఖాన్‌ను చూశానంటూ 12 సెకన్ల నిడివి గల వీడియోను షేర్ చేసింది. ఇక ఇందులో సారాతో ఉన్నది గిల్ అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ టీమిండియా బ్యాటర్ ఇప్పుడు 27 ఏళ్ల సారా అలీఖాన్‌తో డేటింగ్ చేస్తున్నాడా ఏంటి అంటూ కథనాలు అల్లేస్తున్నారు. ఏంటో సారా అనే పేరు గల వాళ్లే గిల్‌కు ఎందుకు నచ్చుతారో అంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు.
ఇక భారత క్రికెట్ రంగానికి, బాలీవుడ్‌కి విడదీయరాని బంధం ఉందన్న విషయం తెలిసిందే. చాలా మంది క్రికెటర్లు.. బాలీవుడ్ నటీమణులతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నారు. మొదటితరం క్రికెటర్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ.. షర్మిలా ఠాగూర్‌ను పెళ్లాడారు. ఆ దంపతులు కొడుకు సైఫ్ అలీఖాన్ కూతురే సారా. అమృతా సింగ్‌తో సైఫ్‌నకు కలిగిన మొదటి సంతానం. ఇక అమృతా సైతం.. సైఫ్ కంటే ముందు టీమిండియా మాజీ ఆటగాడు రవిశాస్త్రితో ప్రేమలో పడిందన్న వార్తలు వచ్చాయి.
చదవండి: T20 World Cup 2022: టీమిండియాకు గుడ్ న్యూస్.. స్టార్ బౌలర్ వచ్చేస్తున్నాడు!
KL Rahul Wedding: టీమిండియా వైస్ కెప్టెన్ పెళ్లి ఆమెతోనే! ధ్రువీకరించిన ‘మామగారు’.. కానీ ట్విస్ట్ ఏంటంటే!
Shubman gill date sara ali khan ko kar eha tha aur hum kisi aur hi sara ko lapet rhe the🥲#Shubmangill #CricketTwitter pic.twitter.com/oEAAXqXgOz
— Arun (@ArunTuThikHoGya) August 29, 2022