సారా అలీఖాన్- శుబ్‌మన్ గిల్
Shubman Gill Reveals His Crush Name: టీమిండియా ఓపెనర్ శుబ్‌మన్ గిల్.. ఆటతోనే కాదు చూడచక్కటి రూపంతోనూ ఆకట్టుకునే యువ క్రికెటర్ల జాబితాలో ముందుంటాడు. ఈ సొట్టబుగ్గల కుర్రాడికి అమ్మాయిల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 23 ఏళ్ల ఈ హ్యాండ్సమ్ బ్యాటర్‌కు.. ఇటీవల మైదానంలోనే ఓ అమ్మాయి ప్రపోజ్ చేసింది. తన స్వీట్ ప్రపోజల్‌తో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
కాగా న్యూజిలాండ్‌తో స్వదేశంలో టీ20 సిరీస్‌లో సచిన్ టెండుల్కర్ సమక్షంలో గిల్ శతకం బాది పలు రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ లేడీ ఫ్యాన్.. ‘శుబ్‌మన్‌తో నాకు జోడీ కలపండి’’ అంటూ ప్లకార్డు ప్రదర్శించింది. గిల్‌కు ఉన్న ఫాలోయింగ్ అలాంటిది మరి!
సచిన్ తనయ.. సారాతో
ఇక ఇప్పటికే సచిన్ తనయ సారా టెండుల్కర్, బాలీవుడ్ హీరోయిన్, పటౌడీ పరగణా యువరాణి సారా అలీఖాన్‌తో కలిపి గిల్ పేరు వినిపిస్తున్న విషయం తెలిసిందే. సారాతో బ్రేకప్ అయిన తర్వాత సారా అలీఖాన్‌తో అతడు ప్రేమలో పడ్డాడంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
గిల్- సారా టెండుల్కర్
నా క్రష్ ఆమే!
ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో సంభాషణలో భాగంగా శుబ్‌మన్ గిల్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. నీ క్రష్ ఎవరో చెప్పాలని కోరగా.. తొలుత సంశయించినప్పటికీ ఎట్టకేలకు నోరు విప్పాడు గిల్. ‘పుష్ప’ సినిమాతో ప్యాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించిన హీరోయిన్ రష్మిక మందన్న అంటే తనకు ఇష్టమన్నాడు. ఆమే నా సెలబ్రిటీ క్రష్ అంటూ నేషనల్ క్రష్ రష్మిక పేరు చెప్పాడు.
గిల్- రష్మిక
ఈ క్రమంలో గిల్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘సారా’లలో ఎవరో ఒకరి పేరు చెప్తావనుకుంటే ఇలా ఊహించని ట్విస్ట్ ఇచ్చావేంటి భయ్యా! అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ ఆన్సర్‌కు రష్మిక ఎలా బదులిస్తూ చూడాలి అంటూ ఆట పట్టిస్తున్నారు.
రష్మిక మందన
నిరాశపరిచిన గిల్
శుబ్‌మన్ గిల్ ప్రస్తుతం బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023తో బిజీగా ఉన్నాడు. తొలి రెండు టెస్టుల్లో కేఎల్ రాహుల్ ఆడగా.. అతడు విఫలమైన కారణంగా గిల్ మూడో మ్యాచ్‌తో జట్టులోకి వచ్చాడు. అయితే, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక ఉసూరుమనిపించాడు. మొత్తంగా 26 పరుగులు మాత్రమే చేసిన గిల్ నిరాశపరిచాడు.
ఇక ఈ మ్యాచ్‌లో ఓడిన టీమిండియా మార్చి 9 నుంచి అహ్మదాబాద్‌లో ఆరంభం కానున్న నాలుగో టెస్టు కచ్చితంగా గెలవాల్సి ఉంది. 2-1తో ఆధిక్యంలో ఉన్న రోహిత్ సేనకు.. ఆఖరి టెస్టులో గెలిస్తేనే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఈ మ్యాచ్‌తో పాటు న్యూజిలాండ్- శ్రీలంక టెస్టు సిరీస్ ఫలితం తేలితేనే ఇంగ్లండ్‌లో ఆస్ట్రేలియాతో పోటీ పడేది ఎవరన్న అంశంపై స్పష్టత వస్తుంది. దీంతో టీమిండియా ఆటగాళ్లపై బాధ్యత మరింత పెరిగింది.
చదవండి: WI vs SA: వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. దక్షిణాఫ్రికాకు ఊహించని షాక్!
Virat Kohli: సెంచరీ కరువైంది.. ఆ విషయం తెలుసు.. కానీ: ఆసీస్ దిగ్గజం
Comments
Please login to add a commentAdd a comment