Netizens feel Shubman Gill and Sara Tendulkar visited the cafe in London on Valentine's day - Sakshi
Sakshi News home page

Shubman Gill-Sara Tendulkar: వాలెంటైన్స్‌ డే ఎంత పని చేసింది.. శుభ్‌మన్‌, సారా రిలేషన్‌ను బయటపెట్టింది..!

Published Wed, Feb 15 2023 2:14 PM | Last Updated on Wed, Feb 15 2023 2:57 PM

Are Shubman Gill, Sara Tendulkar Dating, Netizens Reactions - Sakshi

టీమిండియా యువ సంచలనం శుభ్‌మన్‌ గిల్‌ అడ్డంగా బుక్కయాడు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తనయ సారాతో రిలేషన్‌ విషయంలో ఆధారాలతో సహా దొరికిపోయాడు. ఇనాళ్లు తాను దాచిన నిజాన్ని తన వాలెంటైన్స్‌ డే-2023 పోస్ట్‌తో పొరపాటున బహిర్గతం చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. టీమిండియా నయా స్టార్‌ శుభ్‌మన్‌ గిల్‌, క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ గారాలపట్టి సారాతో డేటింగ్‌లో ఉన్నట్లు చాలాకాలంగా ప్రచారం జరుగుతుంది.

అయితే, ఈ విషయంపై మీడియా శుభ్‌మన్‌,సారాలను ఎన్ని సార్లు ప్రశ్నించినా స్పందించలేదు. ఇంతలో శుభ్‌మన్‌ డేటింగ్‌ చేస్తోంది సచిన్‌ కుమార్తె సారాతో కాదని, బాలీవుడ్‌ నవాబ్‌ సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రియ తనయ సారా అలీ ఖాన్‌తో అని ప్రచారం మొదలైంది. శుభ్‌మన్‌-సారా అలీ ఖాన్‌ రిలేషన్‌ను కనుక్కునేందుకు అభిమానులు, మీడియా విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ఎలాంటి క్లారిటీ దొరకలేదు.

దీంతో శుభ్‌మన్‌ ఏ సారాతో రిలేషన్‌లో ఉన్నాడని తెలుసుకోలేక సచిన్‌, సైఫ్‌, శుభ్‌మన్‌, ఇరువురు సారాల అభిమానులు జట్టు పీక్కున్నారు. తాజాగా శుభ్‌మన్‌ సోషల్‌మీడియాలో చేసిన ఓ పోస్ట్‌ ద్వారా అభిమానులకు ఓ విషయంపై క్లారిటీ వచ్చింది. శుభ్‌మన్‌ తన 2023 వాలంటైన్స్‌ డే పోస్ట్‌లో ఓ ఫోటో పోస్ట్‌ చేస్తూ.. What Day Is It Again? అని కామెంట్‌ జోడించాడు. ఈ పోస్ట్‌లో ఫోటోనే శుభ్‌మన్‌, సారా టెండూల్కర్‌ రిలేషన్‌ను బయటపెట్టింది.

ఈ ఫోటోలో శుభ్‌మన్‌ ఓ రెస్టరెంట్‌లో కాఫీ తాగుతూ కనిపించాడు. గతంలో ఇదే ప్లేస్‌లో దిగిన ఫోటోను సారా టెండూల్కర్‌ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. ఇరువురు పోస్ట్‌ చేసిన ఫోటోల్లో ఓ కామన్‌ పాయింట్‌ బట్టి చూస్తే.. గతంలో శుభ్‌మన్‌, సారా టెండూల్కర్‌ ఇద్దరు ఇదే ప్లేస్‌లో కలిసి కూర్చున్న విషయం స్పష్టమవుతుంది. దీని ఆధారంగా శుభ్‌మన్‌-సారా టెండూల్కర్‌తోనే రిలేషన్‌లో ఉన్నాడన్న విషయాన్ని అభిమానులు నిర్ధారించుకున్నారు.

మరోపక్క ఇంకో ప్రచారం కూడా జరుగుతుంది. శుభ్‌మన్‌.. సారా టెండూల్కర్‌తో డేటింగ్‌ చేసిన మాట వాస్తవమే. అయితే వారిద్దరు ఇప్పుడు విడిపోయారని, వీరి రిలేషన్‌ బ్రేక్‌ అయ్యాక శుభ్‌మన్‌ సారా అలీ ఖాన్‌తో ప్రేమాయణం సాగించాడని, ప్రస్తుతం సారా అలీ ఖాన్‌కు కూడా శుభ్‌మన్‌ బ్రేకప్‌ చెప్పాడని సోషల్‌మీడియా కోడై కూస్తుంది. శుభ్‌మన్‌ వాలంటైన్స్‌ డే పోస్ట్‌ తర్వాత నెటిజన్లు మరో కొత్త విషయాన్ని ట్రోల్‌ చేస్తున్నారు.

శుభ్‌మన్‌ ఇద్దరు సారాలతో డేటింగ్‌ చేసింది వాస్తవమే. అయితే గిల్‌ సారా టెండూల్కర్‌ను మర్చిపోలుకపోతున్నాడు అంటూ ఎవరికి తోచిన విధంగా వారు ఊహించుకుంటున్నారు. ఏదిఏమైనప్పటికీ.. అభిమానులకు.. శుభ్‌మన్‌ సారా టెండూల్కర్‌తో డేటింగ్‌ చేశాడన్న విషయంపై క్లారిటీ వచ్చింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం గిల్‌ బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023తో బిజీగా ఉన్నాడు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement