Mitchell Marsh Gets Engaged To His Girlfriend Greta Mack - Sakshi
Sakshi News home page

Mitchell Marsh: గర్ల్‌ఫ్రెండ్‌తో ఆసీస్ స్టార్‌ ఆల్‌రౌండర్ నిశ్చితార్థం

Published Sat, Sep 11 2021 8:03 PM | Last Updated on Mon, Sep 20 2021 11:27 AM

Mitchell Marsh Gets Engaged To His Girlfriend Greta Mack - Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్.. తన ఇష్ట సఖి, చిరకాల ప్రేయసి గ్రెటా మాక్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. కాబోయే భార్యతో కలిసి తీసుకున్న సెల్ఫీని తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేస్తూ విషయాన్ని పంచుకున్నాడు. ఓ బీచ్ పక్కన దిగినట్టుగా ఉన్న ఈ ఫొటోలో గ్రెటా తన నిశ్చితార్థం ఉంగారాన్ని చూపిస్తోంది. ఈ ఫొటోను షేర్ చేసిన వెంటనే అభిమానులు శుభాకాంక్షలతో హోరెత్తించారు. 

కాగా, మార్ష్‌కు ఈ సీజన్‌ వ్యక్తిగతంగా, క్రికెట్‌ పరంగా బాగా కలిసొచ్చింది. కొద్ది రోజుల కిందట విండీస్‌తో జరిగిన 5 టీ20ల సిరీస్‌లో అతను సూపర్‌ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. మూడు హాఫ్‌ సెంచరీలు సహా పలు కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌ను ఆసీస్‌ 1-4తో కోల్పోయినటప్పటికీ.. మార్ష ప్రదర్శన ఆసీస్‌ సెలక్టర్లను ఆకట్టుకుంది. దీంతో అతనికి టీ20 ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కింది. కాగా, యూఏఈ వేదికగా అక్టోబరు 17 నుంచి ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. 
చదవండి: 'వాతి కమింగ్‌' పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన శ్రేయస్‌ అయ్యర్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement