సాక్షి, హైదరాబాద్: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వజ్రోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. ఊరూవాడ, పట్టణం, వీధి అనే తేడా లేకుండా అంతటా దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ నెల 12 నుంచి జాతీయ పతాకాల ఆవిష్కరణతోపాటు భారీర్యాలీలు చేపట్టారు.
పౌరులందరినీ భాగస్వామ్యం చేస్తూ నిర్వహిస్తున్న మహోత్సవాలు రాష్ట్రంలో అత్యద్భుతంగా కొనసాగుతున్నాయి. ‘హర్ ఘర్ కా తిరంగా’అంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు తోపాటు సీఎం కేసీఆర్ ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఎంపీ కె.కేశవరావు ఆధ్వర్యంలో కమిటీ వేయడం తెలిసిందే.
అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో భారీ ఊరేగింపు నిర్వహిçÜ్తున్నారు. ఫ్రీడం రన్ పేరుతో కార్యక్రమాలు నిర్వహించడమేకాక రాష్ట్రంలో దాదాపు కోటీ 20 లక్షల పతాకాలను రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి పంపిణీ చేసి ప్రతీ ఇంటిపై ఎగురవేసే కార్యక్రమం జోరుగా సాగుతోంది. రాష్ట్రంలోని చరిత్రాత్మక కట్టడాలు, ఫ్లై ఓవర్‌లు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యుద్దీ పాలంకరణతో వెలిగిపోతున్నాయి.
వినూత్న కార్యక్రమాలతో...
వజ్రోత్సవాల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు వినూత్న కార్యక్రమాలతో దేశ భక్తిని చాటుకుంటున్నాయి. వాణిజ్య సముదాయాలు, వివిధ కంపెనీల కార్యాలయాలు మూడు రంగుల కాంతులతో ముస్తాబయ్యాయి. ప్రతిచోట మూడు వర్ణాల జాతీయజెండా రెపరెపలా డుతూ కనిపిస్తున్న దృశ్యం పౌరులందరిలో దేశభక్తిని ఉప్పొంగేలా చేస్తోంది.
స్వాతంత్య్ర సంగ్రామం జరిగిన తీరు, ఉద్యమ స్ఫూర్తి తదితర అంశాలపై విద్యాసంస్థల్లో ఉపన్యాసాలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీ లు నిర్వహిస్తుండగా విద్యా ర్థులు పెద్దసంఖ్యలో పాల్గొంటున్నారు. కొన్నిచోట్ల వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తున్నారు. దేశభక్తిని ఇనుమడింపజేసే గాంధీ చిత్రాన్ని రాష్ట్రంలో 542 థియేటర్లలో ప్రదర్శిస్తుండగా, విద్యా ర్థుల నుంచి కూడా స్పందన వస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు జాతీయతను చాటేలా చే సిన అలంకరణలు కనువిందు చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment