Early Independence Day Celebrations Started in WETA | California - Sakshi
Sakshi News home page

WETA ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

Published Sat, Aug 14 2021 2:31 PM | Last Updated on Sat, Aug 14 2021 3:44 PM

Independence Day Celebration In America - Sakshi

కాలిఫోర్నియాలోని "విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ స్వాతంత్ర దిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా సంస్థ ప్రెసిడెంట్ ,ఫౌండర్ హనుమండ్ల ఝాన్సీ రెడ్డి మట్లాడుతూ దేశం అన్నింటా అభివృద్ధి చెందుతున్న సమయం లో ఒక వైరస్ అస్థిత్వానికి సవాల్ విసిరింది .కోవిడ్‌ సెకండ్ వేవ్ లో WETA ఎన్నో గ్రామాలలో సేవాకార్యక్రమాలని చేయగలిగిందని,సహాయం చేసిన దాతలకు ఈ సమయంలో ముందు ఉండి పని చేసిన  కోవిడ్‌ వారియర్స్ కి ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి , WETA వాలంటీర్స్ కి కృతజ్ఞత తెలిపారు.

కోవిడ్‌ కష్ట కాలంలో చురుకు గా పని చేసిన కొంత మంది వాలంటీర్స్ ని అవార్డ్స్ తో సత్కరించామని తెలిపారు.స్వాతంత్ర దినోత్సవంలో ఝాన్సీ రెడ్డి పాల్గొని జాతీయ పథకాన్ని ఎగరవేశారు. ఈ వేడుకలలో పలువురు ఎగ్జిక్యూటివ్ టీం సభ్యులు, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శైలజ కల్లూరి పాల్గొని ..శుభాకాంక్షలు  తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement