USA: టీటీఏ అధ్యక్షుడిగా నవీన్ రెడ్డి మల్లిపెద్ది | Mallipeddi Naveen Reddy Oath As TTA New President | Sakshi
Sakshi News home page

USA: టీటీఏ అధ్యక్షుడిగా నవీన్ రెడ్డి మల్లిపెద్ది

Published Fri, Jan 24 2025 7:18 AM | Last Updated on Fri, Jan 24 2025 10:54 AM

Mallipeddi Naveen Reddy Oath As TTA New President

వాషింగ్టన్‌: మన తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (TTA) అధ్యక్షుడిగా నవీన్ రెడ్డి మల్లిపెద్ది బాధ్యతలు స్వీకరించారు. 2025–2026 సంవత్సరాల పదవీకాలానికి కొత్తగా ఎన్నికైన బోర్డ్‌ సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. టీటీఏ వ్యవస్థాపకుడు డాక్టర్‌ పైళ్ళ మల్లారెడ్డి, సలహా మండలి చైర్మన్‌ డాక్టర్‌ విజయపాల్‌ రెడ్డి, కో-ఛైర్మన్‌ డాక్టర్‌ మోహన్‌ రెడ్డి పాటలోల్ల, సభ్యుడు భరత్‌ రెడ్డి మాదాది, అధ్యక్షుడు నవీన్‌ రెడ్డి మల్లిపెద్ది, మాజీ అధ్యక్షుడు వంశీ రెడ్డి కంచరకుంట్ల ఈ సందర్భంగా కొత్త బోర్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

బోర్డ్‌ సభ్యులుగా నవీన్‌ రెడ్డి మల్లిపెద్ది, డా. నరసింహారెడ్డి దొంతిరెడ్డి, కవితా రెడ్డి, సహోదర్‌ పెద్దిరెడ్డి, డా. దివాకర్‌ జంధ్యం, శివారెడ్డి కొల్ల, మనోహర్‌ బొడ్కె, ప్రదీప్‌ మెట్టు, సురేశ్‌ రెడ్డి వెంకన్నగరి, నిశాంత్‌ సిరికొండ, అమిత్‌ రెడ్డి సురకంటి, గణేశ్‌ మాధవ్‌ వీరమనేని, స్వాతి చెన్నూరి, ఉషారెడ్డి మన్నం, సంతోష్‌ గంటారం, నరసింహ పెరుక, కార్తిక్‌ నిమ్మల, శ్రీకాంత్‌ రెడ్డి గాలి, అభిలాష్‌ రెడ్డి ముదిరెడ్డి, మయూర్‌ బండారు, రంజిత్‌ క్యాతం, అరుణ్‌ రెడ్డి అర్కల, రఘునందన్‌ రెడ్డి అలుగుబెల్లి, దిలీప్‌ వాస, ప్రదీప్‌ బొద్దు, ప్రభాకర్‌ మదుపాటి, నరేంద్ర దేవరపల్లి, ప్రవీణ్‌ సామల, ప్రవీణ్‌ చింట, నరేశ్‌ బైనగరి, వెంకట్‌ అన్నపరెడ్డి కొత్తగా బోర్డ్‌ సభ్యులుగా నియమితులయ్యారు.

మన తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (TTA) అధ్యక్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ నవీన్ రెడ్డికి, బోర్డు స‌భ్యుల‌కు స్వ‌దేశం, స్వ‌రాష్ట్రం నుంచి అభినందనలు, శుభాకాంక్ష‌లు అందుతున్నాయి. నవీన్ రెడ్డి ఉద్యోగిగా అమెరికాలో అడుగుపెట్టి, కన్సల్టింగ్ కంపెనీలు, మీడియా, రెస్టారెంట్లు, గ్యాస్ స్టేషన్లతో పాటు అనేక ఇతర సంస్థ‌ల‌ను స్థాపించి, ఎన్నో విజ‌యాలు అందుకుంటూ, తెలుగు వారికి గర్వకారణంగా నిలుస్తున్నారంటూ ఈ సంద‌ర్భంగా ప‌లువురు కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement