Naveen reddy
-
కొండగల్‌లో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
సాక్షి, వనపర్తి: తెలంగాణ రాజకీయాల్లో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని కొత్తకోట పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా చేపట్టిన పాదయాత్రను అడ్డుకునే క్రమంలో పోలీసులు నరేందర్ రెడ్డి, నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా రైతుల పక్షాన పోలెపల్లి ఎల్లమ్మ దేవస్థానం నుంచి దుద్వాల్ ఎమ్మార్వో ఆఫీసు వరకు పాదయాత్ర చేయాలని బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. ఈ క్రమంలో పాదయాత్రకు అనుమతి లేదని చెబుతూ తుంకిమెట్ల వద్ద బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ సందర్భంగా పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ..‘రైతుల కోసం పాదయాత్ర చేస్తామని మేము ముందే పోలీసులకు చెప్పాము. ప్రశాంతమైన వాతావరణంలో పాదయాత్ర చేసుకోమని వాళ్లు పర్మిషన్ ఇచ్చారు. కొడంగల్‌లో పాదయాత్రకు పెద్ద ఎత్తున ప్రజలు రైతులు తరలి రావడం చూసి సీఎం రేవంత్ రెడ్డి భయపడ్డాడు. దీంతో, మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేసి వనపర్తి జిల్లా కొత్తకోట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ముఖ్యమంత్రిని ఒకటే నేను ప్రశ్నిస్తున్నా.. మీ సొంత నియోజకవర్గంలో పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో ఎలా ఉందో అర్థం చేసుకోవాలి.హైదరాబాద్‌లో ఫార్మా సిటీ కోసం మహేశ్వరంలో 14వేల ఎకరాలు సిద్ధంగా ఉంది. హైదరాబాద్‌ను వదిలేసి కొడంగల్‌లో పచ్చని పంటలు పండే మూడు వేల ఎకరాలను ఫార్మా సిటీ కోసం ఎందుకు ఎంపిక చేశారు. మహేశ్వరంలో ఉన్న వేల ఎకరాలలో రియల్ ఎస్టేట్ కోసం ప్లాన్ చేశారా?. ఫార్మా కంపెనీలు కాకుండా కొడంగల్‌కు మంచి కంపెనీలు తీసుకురావాలి. ప్రభుత్వం రైతుల పొట్ట కొట్టొద్దు. యువతకు ఉపాధినిచ్చే ఐటీ కంపెనీలను తీసుకొస్తే దానికి మేము వ్యతిరేకం కాదు. కాబట్టి వెంటనే ఫార్మా కంపెనీల భూముల విషయంపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. చివరి వరకు కొడంగల్ రైతుల పక్షాన నిలబడి పోరాడుతాము’ అని చెప్పారు.ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ..‘రైతులకు మద్దతుగా పాదయాత్ర చేస్తుంటే ప్రభుత్వం ఓర్చుకోవడం లేదు. తన సొంత నియోజకవర్గంలో ఫార్మా కంపెనీలు కాకుండా ఏ కంపెనీలు నెలకొల్పినా మాకు అభ్యంతరం లేదు. భూములను తీసుకునేటప్పుడు ఆ గ్రామాల ప్రజలను కూర్చోబెట్టి ఒప్పించి భూములు తీసుకోవాలి. వారికి ఇష్టం లేనిదే వారి భూములు తీసుకోవడం ఎంత వరకు సమంజసం?. యువతకు ఉపయోగపడే కంపెనీలను తీసుకురావాలి. ఇందిరమ్మ రాజ్యంలో పేదల ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చుతోంది. రైతులకు ఇబ్బంది కలిగిస్తే సీఎం ఇంటిని ముట్టడిస్తాం’ అంటా హెచ్చరించారు.ఎమర్జెన్సీని తలపిస్తున్న రేవంత్ పాలనకొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ ఏర్పాటును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చేపట్టిన పాదయాత్రను అడ్డుకుని అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులుఫార్మా కంపెనీ పేరుతో చేసే రియల్ ఎస్టేట్ దందాను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి ఎన్ని… pic.twitter.com/cI4mGemzp2— BRS Party (@BRSparty) October 9, 2024 -
వార్డు సభ్యుడి నుంచి ఎమ్మెల్సీగా..
షాద్‌నగర్: వార్డు సభ్యుడిగా ప్రస్థానం ప్రారంభించాడు.. రాజకీయ ప్రావీణ్యతకు పదును పెట్టాడు.. యువనేతగా మొదలై జన నేతగా ఎదిగి అనతి కాలంలోనే ఎమ్మెల్సీ పీఠాన్ని అధిరోహించాడు. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఘన విజయం అందుకున్నాడు నాగర్‌కుంట నవీన్‌రెడ్డి. షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మండలం మొదళ్లగూడ గ్రామానికి చెందిన నాగర్‌కుంట శోభారెడ్డి, వెంకట్రాంరెడ్డి దంపతుల రెండో కుమారుడైన నవీన్‌రెడ్డి చిన్ననాటి నుంచి రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నాడు. 2006లో రాజకీయ అరంగ్రేటం చేసి అప్పట్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుడిగా పోటీ చేసి గెలుపుతోపాటు ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.ఆ తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున కొత్తూరు జెడ్పీటీసీగా విజయం సాధించి ఉమ్మడి మహబూబ్‌నగర్ జెడ్పీ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి కల్వకుర్తి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల సంఘం అధికారులు ఎన్నికలు నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ తరపున ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు నవీన్‌రెడ్డి పేరును ప్రకటించడంతో ఆయన బరిలోకి దిగారు. ఎమ్మెల్సీ స్థానానికి మార్చి 28న ఉప ఎన్నిక జరిగింది.111 ఓట్ల మెజార్టీతో ఘన విజయంఎమ్మెల్సీ బరిలో బీఆర్ఎస్ నుంచి నవీన్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్ బరిలో దిగారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లోని బాలుర జూనియర్ కళాశాలో లెక్కింపు జరిగింది. మొత్తం 1,437 ఓట్లు పోలవగా అందులో 21 చెల్లనవిగా అఽధికారులు గుర్తించారు. మిగిలిన 1,416 ఓట్లలో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌రెడ్డికి 762 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డికి 653 ఓట్లు పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థి సుదర్శన్‌గౌడ్‌కు ఒక ఓటు మాత్రమే పోలైంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో విజయం సాధించేందుకు 709 ఓట్లు రావాల్సి ఉండగా నవీన్‌రెడ్డికి కోటా కన్న 53 ఓట్లు అధికంగా వచ్చాయి. దీంతో ఎన్నికల అధికారులు నవీన్‌రెడ్డి విజయం సాధించినట్లు ప్రకటించారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో నవీన్‌రెడ్డి విజయం సాధించి కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చారు.నవీన్‌రెడ్డిని అభినందించిన కేసీఆర్ఎమ్మెల్సీగా విజయం సాధించిన నాగర్‌కుంట నవీన్‌రెడ్డి ఆదివారం సాయంత్రం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా నవీన్‌రెడ్డికి కేసీఆర్ శాలువా కప్పి సన్మానించారు. అనంతరం మాజీ మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్, షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ తదితరులు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్సీగా నవీన్‌రెడ్డి విజయం సాధించడంతో బీఆర్ఎస్ నేతల్లో కొత్త ఉత్సహం నెలకొంది. -
వాస్తవ ఘటనల స్ఫూర్తితో...
‘‘నవీన్ రెడ్డిగారు ‘వెయ్ దరువెయ్’ కథ చెప్పినప్పుడు కామెడీ, సెంటిమెంట్ బాగా నచ్చాయి. 80 శాతం వినోదం, 20 శాతం తండ్రి, సోదరి నేపథ్యంలో భావోద్వేగాలుంటాయి. ఈ మూవీ కోసం సాయిరామ్‌గారు చాలా కష్టపడ్డారు’’ అన్నారు నిర్మాత దేవరాజు పోత్తూరు. సాయిరామ్ శంకర్ హీరోగా, యషా శివకుమార్, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా నవీన్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘వెయ్ దరువెయ్’. లక్ష్మీనారాయణ పోత్తూరు సమర్పణలో దేవరాజు పోత్తూరు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలవుతోంది. దేవరాజు మాట్లాడుతూ–‘‘ఆటోమొబైల్ వ్యాపారం చేస్తున్న నేను సినిమాలపై ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చాను. తొలి ప్రయత్నంగా ‘బుల్లెట్ సత్యం’ తీశా. ‘వెయ్ దరువెయ్’ నా రెండో సినిమా. వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ మూవీ తీశాం. నాకు నటనంటే ఇష్టం. అందుకే ‘బుల్లెట్ సత్యం’, ‘వెయ్ దరువెయ్’ చిత్రాల్లో నటించాను’’ అన్నారు. -
‘సాక్షి’ రాసింది.. ఏసీబీ కదిలింది!
సాక్షి, హైదరాబాద్: పెంచిన మామూళ్లతో పాటు ‘పాత బకాయిల’ కోసం పబ్ యజమానిని వేధించి, బెదిరించి, తప్పుడు కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ ఎం.నరేందర్, ఎస్సై ఎస్.నవీన్‌రెడ్డి, హోంగార్డు హరిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చర్యలకు ఉపక్రమించారు. రాజకీయ నాయకుల ప్రమేయంతో కొన్నాళ్ల క్రితం అటకెక్కిన ఈ కేసు వ్యవహారంపై ‘సాక్షి’ సోమవారం ‘ఏ’ క్లాస్ రాజీ! శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురించింది. దీంతో స్పందించిన ఏసీబీ అధికారులు శుక్రవారం బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌పై దాడి చేశారు. నరేందర్, నవీన్‌రెడ్డి, హరిలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే నరేందర్ అస్వస్థతకు గురి కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ముగ్గురి పైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేయడానికి ఉన్నతాధికారులు సన్నాహాలు చేపట్టారు. మామూలు పెంచి ‘ఎరియర్స్’ ఇమ్మని... బంజారాహిల్స్ పీఎస్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న ఎం.నరేందర్‌కు రాజకీయ అండదండలు దండిగా ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే. తన పరిధిలో ఉన్న పబ్స్, బార్ అండ్ రెస్టారెంట్స్‌తో పాటు మసాజ్ సెంటర్ల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారు. తన వద్ద హోంగార్డుగా పని చేస్తున్న హరికి ఈ కలెక్షన్స్ బాధ్యతలు అప్పగించారు. అతడే ప్రతి నెలా అందరికీ ఫోన్లు చేసి, డబ్బు వసూలు చేసుకుని వస్తుంటాడు. కొన్ని నెలల క్రితం నరేందర్ తన పరిధిలో ఉన్న పబ్స్ ఇచ్చే నెల వారీ మామూళ్లను రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షలకు పెంచేశారు. అంతటితో ఆగకుండా రెండు నెలల ‘ఎరియర్స్’తో కలిపి మొత్తం రూ.4.5 లక్షలు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని రాక్ క్లబ్ అండ్ స్కై లాంజ్ పబ్‌ను లక్ష్మణ్ రావు, శివలాల్ నిర్వహిస్తున్నారు. అంత మొత్తం ఇచ్చేందుకు వారు అంగీకరించకపోవడంతో ‘రిబేటు’ ఇచ్చిన నరేందర్ రూ.3 లక్షలకు తగ్గించారు. ఈ డబ్బు ఇవ్వాలంటూ లక్ష్మణ రావుకు హోంగార్డు హరితో పదేపదే వాట్సాప్ కాల్స్ చేయించాడు. హేయమైన ఆరోపణలతో తప్పుడు కేసు... పబ్ యాజమాన్యం తన మాట వినకపోవడంతో వారిపై తప్పుడు కేసు నమోదు చేసేందుకు ఎస్సై ఎస్.నవీన్‌రెడ్డితో కలిసి పథక రచన చేశాడు. ఈ ఏడాది జులై 30 రాత్రి నవీన్‌రెడ్డికి రాక్ క్లబ్ అండ్ స్కై లాంజ్‌లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్లు సమాచారం అందినట్లు, అతడు దానిపై దాడి చేసినట్లు కేసు నమోదు చేశారు. సదరు పబ్ యాజమాన్యం తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం పబ్‌లో మహిళలను కూడా సరఫరా చేస్తోందని, వారితోనే కస్టమర్లకు సర్విస్ చేయిస్తూ రెచ్చగొడుతోందని, ఆకర్షితులైన వినియోగదారులతో కలిసి గడిపేలా ప్రోత్సహిస్తోందనే ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేశారు. అదే నెల 31న మహిళల అక్రమ రవాణా నిరోధక చట్టం కిందన నమోదు చేసిన కేసులో ఇద్దరు యజమానులనూ నిందితులుగా చేర్చారు. కాగా రోజు పబ్‌లో వారు ఇరువురూ లేరని, అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరగట్లేదని, అసలు పోలీసులు దాడే చేయలేదని ఇటీవల ఏసీబీ గుర్తించింది. ఒత్తిడితో మిన్నకుండిపోయిన ఏసీబీ... ఈ నేపథ్యంలో లక్ష్మణ్ రావు ఆగస్టులోనే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అవసరమైన ఆధారాల కోసం అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. రహస్య కెమెరాలతో కూడిన వాచీలు తదితరాలను ఏర్పాటు చేసి పబ్‌కు సంబంధించిన ఓ వ్యక్తిని నరేందర్ వద్దకు పంపారు. లంచా నికి సంబంధించిన బేరసారాలు ఆడియో, వీడియో లు రికార్డు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఓ దశలో సదరు వ్యక్తి రహస్య కెమెరాలతో వచ్చిన విషయం గుర్తించిన నరేందర్ అప్రమత్తమయ్యారు. అసలు విషయం గ్రహించి తన ‘బంధువైన’ రాజకీయ నాయకుడిని ఆశ్రయించారు. ఆయన జోక్యంతో ఏసీబీకి చెందిన కింది స్థాయి అధికారులు అడుగు వెన క్కు వేశారు. మరోసారి సదరు పబ్ జోలికి రావద్దని ఇన్స్పెక్టర్ నరేందర్‌కు, నరేందర్‌ను వదిలేయని పబ్ యాజమాన్యానికి చెప్పి రాజీ చేసి ఫైల్‌ను అటకెక్కించేశారు. దీంతో దాదాపు రెండు నెలలుగా కేసు మరుగున పడిపోయింది. ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువస్తూ ‘సాక్షి’ సోమవారం ‘ఏ’ క్లాస్ రాజీ! శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన ఉన్నతాధి కారులు ‘బంజారాహిల్స్ ఫైల్8 దుమ్ము దులిపించారు. ఓసారి షుగర్ డౌన్... మరోసారి ఛాతి నొప్పి... ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ నేతృత్వంలోని బృందం శుక్రవారం ఉదయం బంజారాహిల్స్ ఠాణాపై దాడి చేసింది. నరేందర్, నవీన్‌రెడ్డి, హరిలను అదుపులోకి తీసుకుని వివిధ కోణాల్లో ప్రశ్నించింది. పబ్ యాజమాన్యంపై నమోదు చేసిన కేసుకు సంబంధించిన పత్రాలు సేకరించింది. సుదీర్ఘంగా ఈ ముగ్గురు నిందితులను విచారించింది. దీంతో తొలుత తన షుగర్ లెవల్స్ పడిపోయాయంటూ నరేందర్ చెప్పడంతో వైద్య బృందాన్ని ఠాణాకు పిలిపించి చికిత్స చేయించా రు. సాయంత్రం తనకు ఛాతీ నొప్పంటూ పడిపోవడ ంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించింది. హాస్పిటల్ వెళ్ళడానికి నరేందర్ నడుచుకుంటూ వచ్చి తన వాహనమే ఎక్కడం గమనార్హం. ఈ కేసుపై ప్రకటన విడుదల చేసిన అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్.. ‘ఇన్స్పెక్టర్ నరేందర్ ఆదేశాల మేరకు నవీన్‌రెడ్డి గత శనివారం అర్ధరాత్రి సదరు పబ్ వద్దకు వెళ్లా రు. లక్ష్మణ్ రావును అనవసరంగా పబ్ బయటకు పిలిచారు. రోడ్డుపై ఆపి ఉంచిన పోలీసు వాహనం వద్దకు వచ్చిన ఆయన్ను బలవంతంగా అందులో ఎక్కించుకుని ఠాణాకు తరలించారు. అక్కడ కొన్ని గంటల పాటు నిర్భంధించారు. నరేందర్, నవీన్‌రెడ్డి, హరిలపై నమోదు చేసి కేసు దర్యాప్తులో ఉందని, చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు. -
మరోసారి తెరపైకి మన్నెగూడ వైశాలి కిడ్నాప్ కేసు
సాక్షి, హైదరాబాద్: మన్నెగూడ వైశాలి కిడ్నాప్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. వైద్య విద్యార్థినిని అపహరించిన కేసులో అరెస్టైన ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డిపై నమోదైన పీడీ యాక్ట్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కాగా రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలోని మన్నెగూడలో గతేడాది వైశాలి కిడ్నాప్ కేసు అప్పట్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మన్నెగూడకు చెందిన వైద్య విద్యార్థిని వైశాలిని నవీన్ డిసెంబర్ 9న కిడ్నాప్ చేశాడు తన అనుచరులతో కలిసి ఒక్కసారిగా ఆమె ఇంటిపై, అడ్డు వచ్చిన వారిపై దాడికి తెగబడ్డారు. అనంతరం ఆమెను వదిలేశాడు. వైశాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన ఆదిభట్ల పోలీసులు ఇప్పటి వరకు దాదాపు 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. నవీన్ రెడ్డిని సైతం పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో రాచకొండ పోలీసులు ఇటీవల నవీన్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు రిమాండ్ చేశారు. దీనిని సవాల్ చేస్తూ నవీన్ రెడ్డి తన న్యాయవాది ద్వారా హైకోర్టులో పిటిషన్ వేసాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు నవీన్ రెడ్డిపై విధించిన పీడీ యాక్ట్‌ను కొట్టివేస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. చదవండి: మిస్టరీగా వికారాబాద్ శిరీష కేసు -
వైశాలిపై దాడి చేసినట్లు విచారణలో నవీన్ రెడ్డి వెల్లడి
-
వైశాలి కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. నవీన్ రెడ్డి కీలక కామెంట్స్!
సాక్షి, హైదరాబాద్: మన్నెగూడ వైశాలి కిడ్నాప్ కేసు తెలంగాణంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కాగా, కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. కేసు విచారణలో భాగంగా ఆదివారం పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. కేసులో హస్తినాపురం నుంచి మన్నెగూడ వరకు సీన్ రీకన్స్ట్రక్షన్ చేపట్టారు. వైశాలి ఇంటి ముందు టీషాపు కోసం షెడ్డు రిపేర్ చేయాలంటూ మిస్టర్ టీకి చెందిన వాట్సాప్ గ్రూప్ ద్వారా ముఠాను నవీన్ అక్కడికి పిలిచాడు. అనంతరం, వైశాలిని కిడ్నాప్ చేసి కారు ఆమెపై దాడి చేసినట్టు నవీన్ రెడ్డి విచారణలో వెల్లడించాడు. ఇక, మూడు రోజుల విచారణలో భాగంగా నవీన్ రెడ్డిని పోలీసులు కూడా విచారించనున్నారు. ఈ కేసులో ఇంకా 36 మంది నిందితులు జైలులోనే ఉన్నారు. -
వైశాలి అపహరణ కేసు: నవీన్‌రెడ్డి అల్లిన కట్టుకథ ఇది!
సాక్షి, హైదరాబాద్: మన్నెగూడ వైద్య విద్యార్థిని వైశాలి అపహరణ కేసులో ప్రధాన నిందితుడు కె.నవీన్‌రెడ్డి.. వైశాలితో పెళ్లి కట్టుకథేనని పోలీసులు తేల్చారు. అరెస్టుకు ముందు నవీన్ గోవాలో పలు సెల్ఫీ వీడియోలు తీసి తనపై తప్పుడు ప్రకటనలు చేశాడని వైశాలి ఆదిభట్ల పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. పలు టీవీ, యూట్యూబ్ చానళ్లలో వీటిని ప్రచారం చేయడంతో సమాజంలో తన, కుటుంబ సభ్యుల ప్రతిష్టకు భంగం కలిగిందని పేర్కొన్నారు. కిడ్నాప్ కేసు నుంచి తప్పించుకోవడానికి, సానుభూతి పొందేందుకు నేరపూరిత ఉద్దేశంతో నవీన్ ఈ దుష్చర్యకు ఒడిగట్టాడని ఆరోపించింది. దీంతో కేసు నమోదు చేసి, విచారించిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైశాలితో ప్రైవేట్ ప్రదేశాల్లో సన్నిహితంగా గడిపామని సెల్ఫీ వీడియోలు చిత్రీకరించిన నవీన్.. వాటిని తన సోదరులు నందీప్‌రెడ్డి, వంశీ భరత్ రెడ్డి అలియాస్ చింటులకు పెన్ డ్రైవ్ ద్వారా పంపించాడని తెలిపారు. వీటిని నందీప్ తన కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకుని, 9010272378 వాట్సాప్ నంబర్ ద్వారా పలు ప్రసార మాధ్యమాలకు, యూట్యూబ్ చానళ్లకు పంపించాడని పేర్కొన్నారు. శుక్రవారం నందీప్, వంశీ భరత్‌ను ఆదిభట్ల పోలీసులు అరెస్టు చేసి, జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి సీపీయూ, మానిటర్, పెన్ డ్రైవ్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
యువతి కిడ్నాప్ కేసు.. వీడియోలు వైరల్.. నవీన్‌రెడ్డి సోదరుడి అరెస్ట్
సాక్షి, రంగారెడ్డి: ఆదిభట్ల పరిధిలోని మన్నెగూడ యువతి వైశాలి కిడ్నాప్ కేసులో నిందితుడు నవీన్‌రెడ్డి సోదరుడు నందీప్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నవీన్‌రెడ్డి, వైశాలి వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారనే నేపథ్యంలో నందీప్ రెడ్డిని అందుపులోకి తీసుకున్నారు. గోవాలో నవీన్‌రెడ్డి వీడియోలను రికార్డు చేసిన నందీప్ రెడ్డి.. వాటిని మీడియాకు పంపినట్లు పోలీసులు గుర్తించారు. వైశాలి ఫిర్యాదుతో నందీప్‌రెడ్డి, వంశీభరత్‌రెడ్డిని ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. మీడియాలో వైశాలి వీడియోలు ప్రసారం చేయొద్దని పోలీసులు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడైన నవీన్ రెడ్డిని పోలీసులు కోర్టు ఎదుట హాజరుపర్చగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. మరోవైపు నవీన్ రెడ్డికి చెందిన రెండు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాను ఒక గంట నిడివి ఉన్న వీడియో విడుదల చేస్తే.. తప్పు ఒప్పుకున్నట్లు ఒక్క నిమిషం మాత్రమే ఎడిట్ చేసి చూపించారని నవీన్ పేర్కొన్నాడు. వీడియోలో తాను వైశాలిని ఎంతగా ప్రేమించాను, తాము ఎక్కడెక్కడికి వెళ్లాం, తిరిగిన ప్రదేశాలు, షాపింగ్‌లకు సంబంధించిన విషయాలు, తమ ప్రేమకు ఎవరకు అడ్డంకులు సృష్టించారనే విషయాలు అందులో చెప్పుకొచ్చాడు నవీన్. తన వీడియోను చూసి పోలీసులు తనకు న్యాయం చేయాలని కోరాడు. ఈ వీడియో గోవాలో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: వివాహేతర సంబంధానికి భర్త అడ్డు..గ్రామంలో జాతర ఉందని చెప్పి! -
వైశాలి కేసులో మరో ట్విస్ట్? సంచలనం రేపుతున్న నవీన్ రెడ్డి వీడియో
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని మన్నెగూడ కిడ్నాప్ కేసు మొదటి నుంచి సంచలనం రేపుతూ వస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నిందితుడు నవీన్ రెడ్డి వీడియో పలు అనుమానాలకు తావిస్తోంది. తాను ఒక గంట నిడివి ఉన్న వీడియో విడుదల చేస్తే.. తప్పు ఒప్పుకున్నట్లు ఒక్క నిమిషం మాత్రమే చూపించారని ఆవేదన వ్యక్తం చేశాడు నవీన్. ఈ వీడియో ప్రకారం.. వైశాలికి నవీన్‌రెడ్డితో సాన్నిహిత్యం ఉందా? వారి వివాహం జరిగిందా? నవీన్ రెడ్డి చెబుతున్న సంచలన విషయాలేంటి? నవీన్ రెడ్డితో పోలీసులు బలవంతంగా వీడియో చేయించారా? నిందితుడు చెప్పినట్లు పోలీసులు వీడియోను కొంత భాగం మాత్రమే విడుదల చేశారా? అసలు ఏం జరిగింది, నవీన్ పూర్తి వీడియోలో ఏముంది? తాజాగా నవీన్ రెడ్డి సన్నిహితులు గంట నిడివి గల పూర్తి వీడియోను విడుదల చేశారు. అందులో తాను వైశాలిని ఎంతగా ప్రేమించాను, తాము ఎక్కడెక్కడికి వెళ్లాం, తిరిగిన ప్రదేశాలు, షాపింగ్‌లకు సంబంధించిన విషయాలు, తమ ప్రేమకు ఎవరకు అడ్డంకులు సృష్టించారనే విషయాలు అందులో చెప్పుకొచ్చాడు నవీన్. తల్లిదండ్రులకు భయపడే వైశాలి ఈ విధంగా చేసిందంటూ పేర్కొన్నాడు. చివరి సారిగా వైశాలిని ఒప్పిస్తానని మాత్రమే తీసుకెళ్లాను తప్పా మరో విధంగా కాదని, ఆమెకు ఎటువంటి హాని కలిగించే ప్రయత్నం తాను చేయలేదని వీడియోలో నవీన్ పేర్కొన్నాడు. అప్పటికీ ఒప్పుకోకపోవటంతో వారి స్నేహితులకు అప్పగించే అక్కడి నుంచి బళ్లారికి వెళ్లి ఆ తర్వాత గోవాకు వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు. తన వీడియోను చూసి పోలీసులు తనకు న్యాయం చేయాలని కోరాడు. ఈ వీడియో గోవాలో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, తన వీడియోలో నవీన్ రెడ్డి చెప్పిన విషయాలు నిజమేనా? ఆ దిశగా పోలీసులు ఏమైనా దర్యాప్తు చేసే అవకాశం ఉందా? అనేది వేచి చూడాల్సిన అంశం. మరోవైపు.. నవీన్ రెడ్డి తల్లి సైతం ఇరువురు ప్రేమించుకున్నారని చెబుతున్నారు. ఇదీ చదవండి: కిడ్నాప్ కేసులో ట్విస్ట్: డాడీ నేను క్షేమంగానే ఉన్నాను.. కానీ, తీవ్ర గాయాలతో.. -
యువతి కిడ్నాప్ కేసు.. నవీన్‌రెడ్డి రిమాండ్‌కు తరలింపు
సాక్షి, రంగారెడ్డి: ఆదిభట్ల పరిధిలోని మన్నెగూడలో యువతి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి మంగళవారం సాయంత్రం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. మొబైల్ లోకేషన్ ఆధారంగా గోవాలోని బీచ్‌లో అరెస్ట్ చేసిన ఆదిభట్ల పోలీసులు బుధవారం హైదరాబాద్‌కు తరలించారు. సరూర్ నగర్ ఓస్‌ఓటీ కార్యాలయంలో నవీన్ రెడ్డిని పోలీసులు ప్రశ్నించారు. కిడ్నాప్ జరిగిన డిసెంబర్9న వైశాలిని మన్నెగూడలో వదిలిన నవీన్ రెడ్డి గోవా పారిపోయాడు. నవీన్‌రెడ్డిపై వరంగల్, హైదరాబాద్, విశాఖలో కేసులు నమోదయినట్లు సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. వైశాలిని కిడ్నాప్ చేసినట్లు నవీన్‌రెడ్డి ఒప్పుకున్నాడని తెలిపారు. ఈ కేసులో నవీన్‌రెడ్డిన రిమాండ్‌కు తరలించాం. నవీన్‌రెడ్డితో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేశాం. పరారీలో ఉన్న రూమన్, పవన్‌ల కోసం గాలిస్తున్నామని సీపీ పేర్కొన్నారు. కాగా నవీన్ రెడ్డి వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత ఆరు నెలలుగా నిందితుడికి వైశాలి దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. దీంతో వైశాలికి దగ్గరయ్యేందుకు నవీన్ రెడ్డి తన స్నేహితుల సాయం తీసుకున్నట్లు వెల్లడైంది. వైశాలి కదలికలను సంధ్య అనే యువతి ద్వారా తెలుసుకుని ఆమెను వెంటబడ్డాడు. వీళ్లిద్దరిని కలిపేందుకు సంధ్య పలుమార్లు యత్నించింది. నవీన్‌తో గొడవ తర్వాత మాట్లాడేందుకు వైశాలి ఇష్టపడలేదు. యువతి మధ్యవర్తిత్వం పనిచేయకపోవడంతో వైశాలి ఇంటి వద్ద షెడ్ ఏర్పాటు చేసి ఆమెను ఇబ్బందులకు గురిచేశాడు. చదవండి: యువతి కిడ్నాప్ కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు -
రంగారెడ్డి యువతి కిడ్నాప్ కేసు.. ఎట్టకేలకు నవీన్ రెడ్డి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఆధిభట్ల యువతి వైశాలి కిడ్నాప్ కేసు ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. గోవాలో నిందితుడిని ఆదిభట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవా కాండోలిమ్ బీచ్ దగ్గర నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉబ్లీ, పనాజీ మీదుగా నవీన్ రెడ్డి గోవా వెళ్లిన్నట్లు గుర్తించారు. అతని దగ్గరున్న 5 ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నవన్ రెడ్డిని పోలీసులు హైదరాబాద్ తీసుకొస్తున్నారు. కాగా ఈ కేసులో మంగళవారం ఉదయమే పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలోని మన్నెగూడలో యువతి వైశాలి డిసెంబర్ 9న కిడ్నాప్‌కు గురైన విషయం తెలిసిందే. యువతితో పరిచయం ఉన్న నవీన్ రెడ్డి అతని అనుచరులతో కలిసి ఒక్కసారిగా ఆమె ఇంటిపై దాడికి తెగబ్బారు. అడ్డువచ్చినవారిపై దాడి చేయడమే కాకుండా ఇంట్లోని వస్తువులు, ఇంటి ముందున్న కారును ధ్వంసం చేశారు. వైశాలిని కిడ్నాప్ చేసి కారులో నల్గొండ వైపు తీసుకెళ్లారు. తమ కోసం పోలీసులు వెతుకుతున్నారనే విషయాన్ని తెలుసుకున్న నవీన్ రెడ్డి, అతని స్నేహితులు అదే రోజు సాయంత్రం మళ్లీ కారులో హైదరాబాద్ తీసుకొచ్చారు. రాత్రి సమయానికి యువతిని పోలీసులు రక్షించారు. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన ఆదిభట్ల పోలీసులు ఇప్పటి వరకు 32 మందిని అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న నవీన్ రెడ్డిని తాజాగా పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు. చదవండి: యువతి కిడ్నాప్ కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు -
క్రూరమృగంలా.. నా జీవితం నాశనం చేశాడు
రంగారెడ్డి : తనను కిడ్నాప్ చేసి క్రూరమృగంలా వ్యవహరించిన నవీన్‌రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని వైద్య విద్యార్థిని వైశాలి రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్‌ను కోరింది. సోమవారం తన తండ్రి, మేనమామతో కలిసి సీపీకి ఫిర్యాదు చేసింది. తనకు నవీన్‌రెడ్డితో పరిచయం మాత్రమే ఉందని పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా అపఖ్యాతి పాల్జేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తన భవిష్యత్‌ను నాశనం చేశాడని విలపించింది. నవీన్‌రెడ్డితో తనకు వివాహం కాకపోయినా అయినట్టుగా ఫొటోలు మార్ఫింగ్ చేసి ఇన్‌స్ట్రాగాంలో పెట్టాడని, తమ ఇంటి వద్ద పోస్టర్లు వేసి తీవ్ర మానసిక ఇబ్బందులకు గురిచేశాడని వాపోయింది. ఈ నెల9న తమ ఇంటిపైకి రౌడీలను తీసుకొచ్చి విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డాడని, తన తల్లిదండ్రులను కర్రలతో కొట్టాడని చెప్పింది. ఓ మహిళ అని కూడా చూడకుండా కాళ్లు, చేతులు పట్టుకొని తనను కార్లో పడేశారని, కనీసం ఊపిరి ఆడకుండా చేశారని సీపీకి వివరించింది. కారులో గోర్లతో రక్కారని, చేతులు, కాళ్లు విరిచి, మెడపై గాయపరిచి ఘోరంగా ట్రీట్ చేశారని వాపోయింది. తనను వదిలిపెట్టమని ప్రాధేయపడగా, అమ్మనాన్నలను చంపేస్తానని బెదిరించాడని పేర్కొంది. నాలుగు రోజులైనా పోలీసులు అతడిని ఎందుకు అరెస్టు చేయడంలేదని ప్రశ్నించింది. ఈ కేసు విషయమై ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డిని త్వరలో పట్టుకుంటామని, ఎంతటివారైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదని కమిషనర్ హామీ ఇచి్చనట్లు తెలిసింది. నవీన్‌రెడ్డి కారు లభ్యం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మన్నెగూడకు చెందిన వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఘటన జరిగి నాలుగు రోజులైనా ఆచూకీ ఇంకా దొరకలేదు. వైశాలిని కిడ్నాప్ చేసేందుకు వాడిన కారును మాత్రం పోలీసులు సోమవారం సాయంత్రం గుర్తించారు. శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి వద్ద ఆ కారును (టీఎస్ 07 హెచ్ఎక్స్ 2111) వదిలేశారు. పార్కింగ్ చేసి, లాక్ వేసుకొని నింది తులు పరారయ్యారు. కానీ కారు లైట్లు వెలుగు తూనే ఉన్నాయి. ఈ వాహనాన్ని ఆదిబట్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా, నవీన్‌రెడ్డిపై గతంలో రెండు కేసులు నమోదైనట్లు వెల్లడైంది. ఇందులో 2019లో వరంగల్ ఇంతియార్‌గంజ్ పీఎస్ పరిధిలో చీటింగ్, ఐటీ సెక్షన్ల కింద ఒక కేసు, కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో 2019లోనే యాక్సిడెంట్‌కు సంబంధించి మరో కేసు నమోదైంది. తాజాగా పీడీయాక్ట్ నమోదు చేసేందుకు పోలీసులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఆ ఫొటోలన్నీ మార్ఫింగ్ చేసినవే: వైశాలి
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన మన్నెగూడ కిడ్నాప్ కేసులో విచారణ కొనసాగుతోంది. మరోసారి వైశాలి స్టేట్మెంట్ను ఇవాళ(సోమవారం) పోలీసులు రికార్డు చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ కేసుకు సంబంధించి ఇప్పటిదాకా 32 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరోవైపు.. ఆదిభట్ల మెడికో వైశాలి కిడ్నాప్ వ్యవహారంలో ఇవాళ దర్యాప్తు కొనసాగనుంది. పోలీసులకు ఆమె ఇచ్చే వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారనుంది. అయితే.. వైశాలి మాత్రం నవీన్ రెడ్డి గతంలో ఇచ్చిన ప్రకటనలను తోసిపుచ్చుతోంది. ఏడాదిగా నవీన్‌రెడ్డి తనను వేధిస్తున్నాడంటూ వైశాలి చెబుతోందామె. పెళ్లి నిజం కాదని.. ఫొటోలు అన్నీ మార్ఫింగే అని వైశాలి అంటోంది. వైశాలి ఇంటి దగ్గర్లో ఉన్న ఖాళీ జాగాను లీజుకు తీసుకుని.. గానాభజానాతో రోజూ హంగామా చేసేవాడట నవీన్. అంతేకాదు.. వైశాలి పేరిట నకిలీ అకౌంట్లు హంగామా వీడియోలను పోస్ట్ చేశాడు. ఇందుకు సంబంధించి వేధింపులపైనా పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసినట్లు చెబుతోంది. అయితే.. పోలీసులు మాత్రం చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తోంది. సంబంధిత వార్త: వైశాలిని ఇప్పటికీ కూడా అంగీకరిస్తా! -
ఏపీలో నవీన్‌రెడ్డి?
ఇబ్రహీంపట్నం రూరల్: వైద్య విద్యార్థిని కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి సహా పరారీలో ఉన్న మరో ముగ్గురి నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. అతనితో పాటు మిగిలిన ముగ్గురు వాడిన కారు కదలికలను పోలీసులు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. నిందితులు సెల్ఫోన్లు వాడుతున్నట్లు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవీన్‌రెడ్డి, పంజాబ్ ప్రాంతాల్లో రుమెన్, చందు, సిద్ధు ఉన్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇప్పటికే తెలంగాణ పోలీసులు నిందితులున్న ప్రాంతాలకు చేరుకున్నట్లు సమాచారం. నవీన్‌రెడ్డి మొదటి నుంచీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో దిట్ట అని తెలుస్తోంది. ఎప్పుడు ఫోన్లు వాడినా వాట్సాప్ ద్వారానే మాట్లాడే నవీన్‌రెడ్డి ఒకటి రెండు రోజుల్లో చిక్కే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ►ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధి మన్నెగూడలో నివసించే దామోదర్‌రెడ్డి, నిర్మల దంపతుల కూతురుపై దాడికి పాల్పడి, ఎత్తుకెళ్లిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గంటల వ్యవధిలోనే పోలీసులు కేసును ఛేదించి, దాడికి పాల్పడిన 32 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కిడ్నాప్ కథ çసుఖాంతం అయినప్పటికీ ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి మాత్రం నేటికీ పోలీసులకు చిక్కలేదు. దీంతో రాచకొండ పోలీస్ కమిషనరేట్ అడిషనల్ సీపీ సుధీర్‌బాబు నేతృత్వంలో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎస్ఓటీ, టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానం ఉన్న చోట జల్లెడ పట్టారు. నవీన్‌రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. కాగా, నవీన్‌రెడ్డిపై అతని స్వగ్రామంలో చీటింగ్ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రాష్ట్ర సరిహద్దులు దాటిన నిందితులు వైద్య విద్యార్థిని కిడ్నాప్ చేసిన రోజు నవీన్ కుటుంబ సభ్యులను పోలీసులు గట్టిగా హెచ్చరించినట్టు తెలిసింది. కనిపిస్తే ఎన్కౌంటర్ చేసే ప్రమాదం ఉందని కుటుంబ సభ్యులు చెప్పడంతో నిందితుడు మాల్ నుంచి హాలియా మధ్యలో వైద్య విద్యార్థిని వదిలేసి వెళ్లాడు. నల్లగొండ జిల్లా సరిహద్దుల్లో 9న కారును స్నేహితులకు వదిలేసి ద్విచక్ర వాహనం లిఫ్ట్ అడిగి పారిపోయినట్లు సమాచారం. నవీన్‌తో ఉన్న చందు, సిద్ధు, రుమెన్ కారుతో ఉడాయించినట్టు పోలీసులు భావిస్తున్నారు. -
నవీన్ రెడ్డితో పెళ్లి కాలేదు : వైశాలి
-
వైశాలి ఎందుకిలా చేసిందో!.. నవీన్‌రెడ్డి తల్లి ఆవేదన
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి ఆదిభట్ల పరిధిలోని మన్నెగూడ కిడ్నాప్ ఘటనలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. వైశాలి-నవీన్‌రెడ్డికి చెందిన వాళ్లు.. ఎవరి వెర్షన్లో వాళ్లు ప్రకటనలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో శనివారం నవీన్‌రెడ్డి తల్లి మీడియాతో మాట్లాడింది. తన కొడుకు కోసం.. వైశాలి వస్తానంటే ఇప్పటికీ కోడలిగా అంగీకరిస్తానని చెబుతోంది. రెండేళ్లుగా వైశాలి-నవీన్ మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. ఎప్పుడు అడిగినా నా కొడుకు బయటే ఉన్నానని చెప్పేవాడు. ఇప్పుడా అమ్మాయి ఎందుకు మారిందో తెలియడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో అద్దె ఇంట్లో ఉన్నప్పుడు వైశాలి పలుమార్లు మా ఇంటికి వచ్చింది.. కొడుకు కోసం ఇప్పటికీ వైశాలి వస్తానంటే కోడలిగా అంగీకరిస్తా అంటూ నవీన్‌రెడ్డి తల్లి నారాయణమ్మ తెలిపింది. ‘‘నా కొడుకుని ఆర్థిక అవసరాల కోసం వాడుకున్నారు. ఆ ఇద్దరూ భార్యభర్తల్లా బయట తిరిగారు. పెళ్లి కూడా చేసుకున్నారు. నవీన్‌ను మోసం చేశారంటూ సొమ్మసిల్లి పడిపోయింది నారాయణమ్మ. ఇదిలా ఉంటే.. నారాయణమ్మకు ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. కొడుకు గురించి పోలీసులు వెతుకుతున్నారనే వార్త తెలియగానే.. బీపీ అప్ అండ్ డౌన్ అయ్యి సొమ్మసిల్లి పడిపోయింది. ఇంట్లో బంధువులెవరూ లేకపోవడంతో.. స్థానికులు ఆమెకు సపర్యలు చేశారు. ఆపై ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ప్రేమించి పెళ్లి చేసుకున్నామని నవీన్‌రెడ్డి చెప్పాడు. అయితే.. ఇద్దరి మధ్యా ప్రేమ వ్యవహారంలాంటిదేం నడవలేదని వైశాలి కుటుంబం చెబుతోంది. నవీన్‌రెడ్డి ప్రేమ పేరుతో వైశాలిని వేధించాడని చెబుతోంది. ఈ తరుణంలో అన్ని విషయాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఇదీ చదవండి: మన్నెగూడ కిడ్నాప్ ఘటన.. వైశాలి కుటుంబానికి భద్రత కల్పించండి -
థర్డ్‌వేవ్ ప్రమాదం: వచ్చే 2, 3 వారాలు అత్యంత కీలకం
అంతా బాగుందనే భావనతో తప్పటడుగులు వేయొద్దని హెచ్చరికలు దేశంలో కోవిడ్ కేసుల ట్రెండ్ క్రమంగా పెరుగుతోంది. మళ్లీ కరోనా తీవ్రస్థాయికి చేరుకుంటుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల నుంచి సీరియస్ కోవిడ్ కేసులు ఇంకా ఇక్కడికి వస్తూనే ఉన్నాయి. ఈ మహమ్మారికి సంబంధించి రాబోయే 2, 3 వారాలు కీలకంగా మారనున్నాయి. దేశంలో మూడోదశ కరోనా ఆగస్ట్‌లో మొదలై అక్టోబర్‌కల్లా ఉచ్ఛస్థాయికి వెళ్లొచ్చని ఐఐటీ–హైదరాబాద్, కాన్పూర్ పరిశోధకులు తాజాగా అంచనా వేశారు. ఈ నెలలో దేశంలో రోజుకు లక్షన్నర కేసుల వరకు నమోదు కావొచ్చని హెచ్చరికలు జారీచేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ట్రాల్లోని వైరస్ ఉద్ధృతి థర్డ్‌వేవ్‌కు ఆజ్యం పోయొచ్చని ఐఐటీ–హైదరాబాద్ ప్రొఫెసర్ మతుకుమల్లి విద్యాసాగర్ చెప్పారు. అయితే సెకండ్‌వేవ్‌లో మాదిరిగా రోజుకు నాలుగు లక్షల కేసులు, పెద్ద సంఖ్యలో మరణాలు వంటి అత్యంత తీవ్రస్థాయి ఉండక పోవచ్చన్నారు. – సాక్షి, హైదరాబాద్ పాత జీవన విధానం కోరుకుంటూ.. ఏడాదిన్నరగా రెండు లాక్డౌన్లు, వివిధ రకాల ఆంక్షలతో ప్రజలు విసిగి వేసారి ఉన్నారు. ఇలాంటి దశలో కోవిడ్ జాగ్రత్తలను పట్టించుకోకపోతే మళ్లీ కేసులు పెరిగి థర్డ్‌వేవ్‌కు దారితీసే ప్రమాదముందని వైద్య నిపుణులు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మళ్లీ పాత జీవన విధానాన్ని కోరుకుంటూ స్వేచ్ఛగా అన్నిచోట్లకు వెళ్లే ప్రయత్నంలో నిబంధనలకు భిన్నంగా వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవంటున్నారు. ప్రస్తుత దశను వారు పరీక్షా సమయంగా అభివర్ణిస్తున్నారు. చాలామంది అంతా మామూలై పోయినట్టుగా ప్రవర్తించడం, మాస్క్‌లు పెట్టుకోకపోవడం, గుంపులు గుంపులుగా కనిపించడం, రెస్టారెంట్లు, పబ్‌లు, పార్టీలు అంటూ తిరగుతుండటంపై వైద్యవర్గాల్లో ఆందోళన వ్యక్తమౌతోంది. వైరస్ వ్యాప్తికి సానుకూల వాతావరణం ఆయా రాష్ట్రాల్లో కేసుల తీవ్రత మళ్లీ పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. డెల్టా ప్లస్ వేరియెంట్‌తో ప్రమాదం ఎక్కువగా ఉంది. లక్షణాలు కనిపించకపోవడంతో కొందరి ఆరోగ్యం విషమిస్తోంది. కేసుల పెరుగుదల సంకేతాలు కనిపిస్తున్నా ప్రజలు పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితులు వైరస్లు, బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు సులభంగా వ్యాప్తి చెందడానికి అనువుగా ఉన్నాయి. ప్రజలు వీటిని గుర్తెరిగి మసలుకోవాల్సి ఉంది. –డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి, కన్సల్టెంట్ ఫిజీషియన్, వృందాశ్రీ జూబ్లీ క్లినిక్ కొత్త స్పైక్స్ రావొచ్చు వివిధ రాష్ట్రాల్లో డెల్టా వేరియెంట్ ఇంకా ప్రబలంగా ఉంది. ప్రస్తుతమున్న డెల్టాతోనే నిబంధనలు పాటించని చోట కొత్త స్పైక్స్ రావొచ్చు. కేసుల సంఖ్య పదిరెట్లు పెరిగితేనే వేవ్‌గా పరిగణించాల్సి ఉంటుంది. ఇవన్నీ కలిసి థర్డ్‌వేవ్‌గా మారడానికి నెలన్నర, రెండు నెలలు పట్టొచ్చు. అప్పుడు చిన్నపిల్లలతోపాటు అందరూ ప్రభావితమయ్యే అవకాశముంది. అయితే సెకండ్‌వేవ్‌లో ఉన్నంత ఉధృతి ఉండకపోవచ్చు. ఇప్పటికైతే థర్డ్‌వేవ్‌కు సంబంధించి ఎలాంటి వేరియెంట్లు ఇక్కడ పుట్టలేదు. తెలంగాణలో 40 శాతం మందిలో (6 ఏళ్లు పైబడిన వారిలో) ఇంకా యాంటీబాడీస్ ఏర్పడలేదు. అంటే మన రాష్ట్రంలో ఒక్క డోస్ టీకా కూడా వేసుకోకపోవడం లేదా ఇంకా వైరస్ బారిన పడని వారు 40 శాతం దాకా ఉన్నారు. ఆస్పత్రుల్లో అడ్మిషన్లు పెరుగుతున్నాయి ఆసుపత్రుల్లో మళ్లీ కోవిడ్ కేసుల అడ్మిషన్లు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం బోనాలు, సీజన్ మార్పు తదితర కారణాలతో వచ్చే 15, 20 రోజుల్లో కేసుల సంఖ్య బాగా పెరిగితే థర్డ్‌వేవ్‌కు దారితీయొచ్చు. థర్డ్‌వేవ్ వస్తే ఆ ప్రభావం అక్టోబర్ వరకు ఉండొచ్చు. కొత్త మ్యుటేషన్లు, స్ట్రెయిన్లు రాకుండా జాగ్రత్త పడడం ఎంతైనా మంచిది. బ్లాక్ ఫంగస్ కేసులు కొంత మేర తగ్గినట్టే కనిపిస్తోంది. అవసరానికి మించి జింక్, ఐరన్ తీసుకుంటున్న వారిలో ఈ సమస్యలు వస్తున్నట్టు తెలుస్తోంది. అయితే థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు అన్ని ఆస్పత్రులు సిద్ధమై ఉండటం సానుకూలాంశం. –డాక్టర్ ఎ. నవీన్‌రెడ్డి, జనరల్ మెడిసిన్, క్రిటికల్ కేర్ నిపుణులు, నవీన్‌రెడ్డి హాస్పిటల్ -
కలకలం రేపుతున్న శ్రీ హర్షిణి హత్య
సాక్షి, మహబూబ్‌నగర్: ఫేస్బుక్ పరిచయం మరో బాలికను బలిగొంది. సామాజిక మాధ్యమం ద్వారా పరిచయం పెంచుకుని, ఆ తర్వాత ఆమెను దారుణంగా హతమార్చాడో యువకుడు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే మహబూబ్‌నగర్ కేంద్రీయ విద్యాలయంలో పదో తరగతి చదువుతున్న శ్రీ హర్షిణి అనే బాలిక ఈ నెల 27న ఇంటి నుంచి అదృశ్యమైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీ హర్షిణి ఫేస్బుక్ చాటింగ్‌పై ఆరా తీశారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన నవీన్ రెడ్డితో ఎక్కువగా చాటింగ్ చేసినట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో జడ్చర్ల మండలం శంకరాయపల్లి సమీపంలో శ్రీ హర్షిణి హతమార్చినట్లు నవీన్‌రెడ్డి అంగీకరించాడు. బాలికకు మాయమాటలు చెప్పి కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి...ఆమెపై అత్యాచారానికి యత్నించగా, శ్రీ హర్షిణి తీవ్రంగా ప్రతిఘటించింది. అయితే ఈ విషయాన్ని ఆమె ఎక్కడ బయటపెడుతుందనే భయంతో శ్రీ హర్షిణిని బండరాయితో కొట్టి హతమార్చినట్లు వెల్లడించాడు. పోలీసులు గురువారం ఉదయం బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు తరలించారు. కాగా ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. నవీన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ విషయం తెలిసిన నిందితుడు కుటుంబసభ్యులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. -
బాలికను బలి తీసుకున్న ఫేస్బుక్ పరిచయం
-
రెండెకరాల్లో కాసుల వర్షం!
కొంత కాలంగా టమాట ధర సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది. ఎటు చూసిన పంట సాగు లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి టమాటను దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఫలితంగా ధర అమాంతం ఆకాశాన్ని తాకింది. అయితే ఇదే సమయంలో రెండు ఎకరాల్లో టమాట సాగు చేపట్టిన రైతు పంట కోతకు వచ్చి కాసుల వర్షం కురిపించింది. - అమడగూరు ఏకమొత్తంగా రైతులందరూ టమాట సాగు చేయడంతో దిగుబడులు భారీగా పెరిగి ధర అమాంతం తగ్గిపోయింది. దీంతో సాగుదారులు తీవ్ర నష్టాలను మూటగట్టుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన అమడగూరు మండలంలోని రెడ్డివారిపల్లికి చెందిన యువ రైతు పెద్దక నవీన్‌రెడ్డి ముందస్తుగానే జాగ్రత్త పడ్డాడు. తనకున్న రెండు ఎకరాల్లో కాస్త ఆలస్యంగా టమాట సాగు చేపట్టి, ప్రస్తుతం లాభాలు గడిస్తున్నాడు. శనివారం కోతకు వచ్చిన 260 బాక్స్‌ల టమాటను కత్తిరించి, కర్ణాటకలోని చింతామణి మార్కెట్‌కు తీసుకెళ్లాడు. 15 కిలోల బాక్స్ రూ. 860తో అమ్ముడు పోయింది. మార్కెట్ కమీషన్, వాహనం బాడుగ ఖర్చులు పోను రూ 2 లక్షలు మిగిలింది. బిందు సేద్యంతో.. ఇంటికి సమీపంలోనే ఉన్న రెండెకరాల్లో ఏప్రిల్‌లో బాయర్ 440 రకం టమాట మొక్కలను రైతు నవీన్‌రెడ్డి ఎంపిక చేసుకున్నాడు. అంతేకాక పంట సాగు చేపట్టేందుకు ముందుగానే పొలమంతా బంకమట్టిని తోలి, దుక్కి చేసి మందులు చల్లించాడు. తర్వాత సాలు తీయించి, డ్రిప్ పైపులు అమర్చి 7,000 టమాట నారను నాటించాడు. పంట మొలకదశలో ఉన్నప్పుడే క్రిమి సంహారక మందులు పిచికారీ చేయించాడు. పూత దశకు రాగానే పంట ఆశాజనకంగా కనపడడంతో కట్టెలను నాటించి మొక్కలు ఏపుగా పెరిగేందుకు అవకాశం కల్పించాడు. మొత్తం రెండు ఎకరాల్లో పంట సాగుకు రూ. 2 లక్షల వరకు ఖర్చు పెట్టాడు. తొలి కోతలో రూ. 60 వేలు ధర లేకపోతే పెట్టుబడి ఎలా రాబట్టుకోవాలనే భయంతో ఉన్న నవీన్‌రెడ్డి.. జూన్ 20న పంట తొలి కోత కోశాడు. ఆ సమయంలో రూ 60 వేలు వచ్చింది. తర్వాత వారానికి రెండు కోతలు చొప్పున ప్రతిసారీ 150 నుంచి 250 బాక్సుల వరకూ దిగుబడి రాగాసాగింది. దీంతో ఏకంగా రూ 12 లక్షలు ఆదాయాన్ని ఆర్జించినట్లైంది. ఇంకా తోటలో 1,000 బాక్సుల వరకూ దిగుబడి ఉంటుందన్న ఆశాభావాన్ని రైతు వ్యక్తం చేస్తున్నాడు. ధర ఇలాగే నిలకడగా ఉంటే మరో ఏడు, ఎనిమిది లక్షల వరకూ ఆదాయం వస్తుంది. జవాబుదారీతోనే లాభాలు పంట సాగులో జవాబుదారీతో వ్యవహరిస్తే లాభాలు ఆర్జించవచ్చు. అప్పుడప్పుడు టమాట సాగు చేస్తుంటాను. ఒక్కొసారి కేవలం పెట్టుబడులు మాత్రమే వస్తాయి. ఇలా టైం బాగుంటే దండిగా లాభాలు ఉంటాయి. పెద్దక నవీన్‌రెడ్డి, యువరైతు, రెడ్డివారిపల్లి -
నానమ్మకు మేమున్నాం..: జంపన్న అన్న కొడుకు నవీన్‌రెడ్డి
బూర్గంపాడు: ‘రారా నాయ నా దండం పెడతా..’ అంటూ మావోయిస్టు నేత జంపన్న తల్లి యశోదమ్మ చేసుకున్న వేడుకోలుకు ఆమె మనవడు స్పందించాడు. సోమవారం సాక్షి పత్రికలో వచ్చిన కథనాన్ని చూసి సారపాకకు చెం దిన జినుగ నవీన్‌రెడ్డి (జంపన్న అన్న వెంకటరెడ్డి కుమారుడు) స్పందించారు. సోమవారం రాత్రి తన తల్లి కళావతితో కలసి ‘సాక్షి’తో మాట్లాడాడు. ‘వృద్ధాప్యంలో ఉన్న మా నానమ్మను చూసుకునేందుకు నేనున్నా. సారపాకలోని ఐటీసీలో క్యాజువల్ లేబర్‌గా పనిచేస్తున్నాను. మానాన్న కొంతకాలం క్రితం చనిపోయారు.ఏడాది క్రితం మా నానమ్మ నా పెళ్లికి వచ్చింది. ఇక్కడ ఉండమని ఎంత బతిమాలినా వినలేదు. ఆ తర్వాత కనిపించలేదు. ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనాన్ని చూశాక మా నానమ్మ ఆచూకీ తెలిసింది. మా నానమ్మ మంచి చెడులు చూసుకునేందుకు నేను, మా అమ్మ ఉన్నాం.’ అని అన్నాడు. -
చెలరేగిన రవితేజ, నవీన్
జింఖానా, న్యూస్‌లైన్: ఆంధ్రా బ్యాంక్ బ్యాట్స్‌మెన్ రవితేజ (118 బంతుల్లో 172; 22 ఫోర్లు, 5 సిక్సర్లు), నవీన్ రెడ్డి (188 బంతుల్లో 150; 21 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో చెలరేగారు. అద్భుతమైన బ్యాటింగ్‌తో ఇద్దరూ పరుగుల వరద పారించారు. ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బుధవారం రెండో రోజు ఓవర్‌నైట్ స్కోరు 330/8తో బరిలోకి దిగిన ఈఎంసీసీ మరో పరుగు చేయకుండానే మిగతా రెండు వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. అనంతర ం లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన ఆంధ్రా బ్యాంక్ బ్యాట్స్‌మెన్ రవితేజ, నవీన్ రెడ్డిలు బ్యాట్లు ఝుళిపించడంతో జట్టు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 424 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో ఆంధ్రా బ్యాంక్ 94 పరుగుల ఆధిక్యంలో ఉంది. విహారి (45), అర్జున్ యాదవ్ (30 నాటౌట్) మెరుగ్గా ఆడారు. రాణించిన పవన్, కుషాల్ డెక్కన్ క్రానికల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పవన్ కుమార్ (86 బంతుల్లో 84; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు), కుషాల్ జిల్లా (119 బంతుల్లో 59 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ఎస్బీహెచ్ జట్టు భారీ స్కోరు చేసింది. రెండో రోజు ఓవర్‌నైట్ స్కోరు 159/6తో ఆట కొనసాగించిన ఎస్బీహెచ్ 321 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఎస్‌బీహెచ్‌కు 155 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. డెక్కన్ క్రానికల్ బౌలర్ సందీప్ 4 వికెట్లు పడగొట్టాడు. తర్వాత తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన డెక్కన్ క్రానికల్ ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. ఆకాశ్ భండారి (59), సందీప్ రాజన్ (53 నాటౌట్) అర్ధ సెంచరీలతో చెలరేగగా... షాదాబ్ తుంబి 42 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. -
రవితేజ, నవీన్ శతకాల హోరు
జింఖానా, న్యూస్‌లైన్: బ్యాట్స్‌మెన్ రవితేజ (115), నవీన్ రెడ్డి (101) సెంచరీలతో కదం తొక్కడంతో ఆంధ్రాబ్యాంక్ జట్టు 6 వికెట్ల తేడాతో డెక్కన్ క్రానికల్ జట్టుపై విజయం సాధించింది. హెచ్‌సీఏ మూడు రోజుల నాకౌట్ టోర్నీలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డెక్కన్ క్రానికల్ 9 వికెట్ల న ష్టానికి 302 పరుగులు చేసింది. రాహుల్ సింగ్ (147) సెంచరీతో విజృంభించగా... షాబాద్ (39), సుందర్ కుమార్ (34 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. ఆంధ్రాబ్యాంక్ బౌలర్ కనిష్క్ నాయుడు 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బరిలోకి దిగిన ఆంధ్రాబ్యాంక్ నాలుగే వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసి నెగ్గింది. మరో మ్యాచ్‌లో ఎస్బీహెచ్ జట్టు 17 పరుగుల తేడాతో ఎన్స్‌కాన్స్ జట్టుపై గెలుపొందింది. మొదట బరిలోకి దిగిన ఎస్బీహెచ్ 8 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. అహ్మద్ ఖాద్రీ (45), కుషాల్ (42), శ్రీహరి రావు (38 నాటౌట్) మెరుగ్గా ఆడారు. ఎన్స్‌కాన్స్ బౌలర్ రోహన్ 3 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఎన్స్‌కాన్స్ 211 పరుగుల వద్ద ఆలౌటైంది. ఇబ్రహీం ఖలీద్ (59) అర్ధ సెంచరీతో చెలరేగాడు. ఎస్బీహెచ్ బౌలర్ రవికిరణ్ 4 వికెట్లు చేజిక్కించుకున్నాడు.