సాక్షి, రంగారెడ్డి: ఆదిభట్ల పరిధిలోని మన్నెగూడ యువతి వైశాలి కిడ్నాప్ కేసులో నిందితుడు నవీన్‌రెడ్డి సోదరుడు నందీప్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నవీన్‌రెడ్డి, వైశాలి వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారనే నేపథ్యంలో నందీప్ రెడ్డిని అందుపులోకి తీసుకున్నారు. గోవాలో నవీన్‌రెడ్డి వీడియోలను రికార్డు చేసిన నందీప్ రెడ్డి.. వాటిని మీడియాకు పంపినట్లు పోలీసులు గుర్తించారు.
వైశాలి ఫిర్యాదుతో నందీప్‌రెడ్డి, వంశీభరత్‌రెడ్డిని ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. మీడియాలో వైశాలి వీడియోలు ప్రసారం చేయొద్దని పోలీసులు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడైన నవీన్ రెడ్డిని పోలీసులు కోర్టు ఎదుట హాజరుపర్చగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. మరోవైపు నవీన్ రెడ్డికి చెందిన రెండు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తాను ఒక గంట నిడివి ఉన్న వీడియో విడుదల చేస్తే.. తప్పు ఒప్పుకున్నట్లు ఒక్క నిమిషం మాత్రమే ఎడిట్ చేసి చూపించారని నవీన్ పేర్కొన్నాడు. వీడియోలో తాను వైశాలిని ఎంతగా ప్రేమించాను, తాము ఎక్కడెక్కడికి వెళ్లాం, తిరిగిన ప్రదేశాలు, షాపింగ్‌లకు సంబంధించిన విషయాలు, తమ ప్రేమకు ఎవరకు అడ్డంకులు సృష్టించారనే విషయాలు అందులో చెప్పుకొచ్చాడు నవీన్. తన వీడియోను చూసి పోలీసులు తనకు న్యాయం చేయాలని కోరాడు. ఈ వీడియో గోవాలో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది.
చదవండి: వివాహేతర సంబంధానికి భర్త అడ్డు..గ్రామంలో జాతర ఉందని చెప్పి!
Comments
Please login to add a commentAdd a comment