
టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాల మల్లు
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన రాష్ట్రమై నా అన్ని రంగాల్లో తెలంగాణ పురోగమిస్తోందని రాష్ట్ర పరిశ్రమల, మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టీఎస్‌ఐఐసీ) చైర్మన్ గ్యాదరి బాల మల్లు అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బుధవారం పరిశ్రమల భవన్‌లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామిక రంగంలో రాష్ట్రం దేశంలోనే ముందుందన్నారు. భవిష్యత్‌లో పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పనలో మరిన్ని మైలు రాళ్లను చేరుకోవడానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో టీఎస్‌ఐఐసీ సీఈవో వి.మధుసూదన్‌రావు, సీఈ శ్యామ్ సుందర్, సీజీఎం గీతాంజలి, జీఎం కళావతి తదితరులు పాల్గొన్నారు.