సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం పారిశ్రామికాభివృద్ధి సాధించడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు అన్నారు. టీఎస్‌ఐఐసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి గురువారానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా బుధవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికాభివృద్ధి సాధించడానికి కృషి చేస్తానని చెప్పారు. ‘‘టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక.. గత విధానానికి భిన్నంగా జిల్లా స్థాయికి టీఎస్‌ఐఐసీ కార్యకలాపాలను విస్తరించేలా కార్యాచరణ రూపొందించాం" అని అన్నారు.
అంతేకుండా " హైదరాబాద్ చుట్టుపక్కలే కాకుండా, తెలంగాణ అంతటా పరిశ్రమలను నెలకొల్పాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం. ఈమేరకు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశనంలో అనేక కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులను తీసుకొస్తున్నాం. ఏడాది కాలంలోనే కీలకమైన ఫార్మాసిటీ, కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్కు, జహీరాబాద్ నిమ్జ్, మెడికల్ డివైజెస్ పార్కు, బుగ్గపాడు మెగా ఫుడ్ పార్కు, ఏరోస్పేస్ పార్కు, ఐటీ మ్యానుఫ్యాక్చరింగ్ పార్కు, సైన్స్ పార్కు, టీ–హబ్ వంటి ప్రాజెక్టులకు కార్యరూపం దాల్చడం సంతోషంగా ఉంది’’ అని బాలమల్లు పేర్కొన్నారు.
పారిశ్రామికాభివృద్ధికి కృషి: బాలమల్లు
Published Thu, Oct 26 2017 1:10 AM | Last Updated on Thu, Oct 26 2017 1:10 AM
Advertisement