Gyadari balamallu
-
‘రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తోంది’
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన రాష్ట్రమై నా అన్ని రంగాల్లో తెలంగాణ పురోగమిస్తోందని రాష్ట్ర పరిశ్రమల, మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టీఎస్ఐఐసీ) చైర్మన్ గ్యాదరి బాల మల్లు అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బుధవారం పరిశ్రమల భవన్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామిక రంగంలో రాష్ట్రం దేశంలోనే ముందుందన్నారు. భవిష్యత్‌లో పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పనలో మరిన్ని మైలు రాళ్లను చేరుకోవడానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ సీఈవో వి.మధుసూదన్‌రావు, సీఈ శ్యామ్ సుందర్, సీజీఎం గీతాంజలి, జీఎం కళావతి తదితరులు పాల్గొన్నారు. -
పారిశ్రామికాభివృద్ధికి కృషి: బాలమల్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం పారిశ్రామికాభివృద్ధి సాధించడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు అన్నారు. టీఎస్ఐఐసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి గురువారానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా బుధవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికాభివృద్ధి సాధించడానికి కృషి చేస్తానని చెప్పారు. ‘‘టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక.. గత విధానానికి భిన్నంగా జిల్లా స్థాయికి టీఎస్ఐఐసీ కార్యకలాపాలను విస్తరించేలా కార్యాచరణ రూపొందించాం" అని అన్నారు. అంతేకుండా " హైదరాబాద్ చుట్టుపక్కలే కాకుండా, తెలంగాణ అంతటా పరిశ్రమలను నెలకొల్పాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం. ఈమేరకు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశనంలో అనేక కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులను తీసుకొస్తున్నాం. ఏడాది కాలంలోనే కీలకమైన ఫార్మాసిటీ, కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కు, జహీరాబాద్ నిమ్జ్, మెడికల్ డివైజెస్ పార్కు, బుగ్గపాడు మెగా ఫుడ్ పార్కు, ఏరోస్పేస్ పార్కు, ఐటీ మ్యానుఫ్యాక్చరింగ్ పార్కు, సైన్స్ పార్కు, టీ–హబ్ వంటి ప్రాజెక్టులకు కార్యరూపం దాల్చడం సంతోషంగా ఉంది’’ అని బాలమల్లు పేర్కొన్నారు. -
ప్రెషిషన్ పార్కు భూసేకరణ చేయండి
సాక్షి, హైదరాబాద్: నగర శివార్లలో ఏర్పాటు చేస్తున్న ప్రెషిషన్(విడిభాగాల తయారీ) ఇంజనీరింగ్ పార్కు భూసేకరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులను టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు ఆదేశించారు. దీని కోసం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం మాదారంలో 300 ఎకరాల భూములను ఎంపిక చేసినట్లు తెలిపారు. బుధవారం పరిశ్రమభవన్‌లో ప్రెషిషన్ ఇంజనీరింగ్ పార్కు భూసేకరణపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కాప్రా చిన్నతరహా పరిశ్రమల యజమానుల కోసం ప్రత్యేకంగా ప్రెషిషన్ ఇంజనీరింగ్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు బాలమల్లు చెప్పారు. ఈ సమావేశంలో టీఎస్ఐఐసీ భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ శివకుమార్, కాప్రా చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమల యజమానుల సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు. -
రూ.100 కోట్లతో మోడల్ ప్లాస్టిక్ పార్కు
టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్లాస్టిక్ పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ.100 కోట్లతో మోడల్ ప్లాస్టిక్ పార్కు (క్లస్టర్) ఏర్పాటు చేస్తున్నట్లు టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు. హైదరాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలో యాదాద్రి–సిద్దిపేట జిల్లాల పరిధిలో 60 ఎకరాల్లో ఈ పార్కు ను ఏర్పాటు చేస్తామన్నారు. బుధవారం పరిశ్రమ భవన్లో ప్లాస్టిక్ పార్కు ఏర్పాటుపై సమీక్షించారు. కామన్ ఫెసిలిటీస్ సెంటర్‌తో పాటు అన్నిరకాల అత్యాధునిక మౌలిక వసతులతో ఈ ప్లాస్టిక్ పార్కును అభివృద్ధి చేస్తామన్నారు. ఈ నెలాఖరులోగా భూములను ఎంపిక చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో ఈ పార్కు ఏర్పాటుకు సబంధించిన ప్రతిపాదనలను కేంద్రానికి పంపిస్తామని ప్లాస్టిక్ పరిశ్రమల యజమానులకు వివరించారు. ప్లాస్టిక్ పార్కు ఏర్పాటుకు సంబంధించిన అధ్యయన నివేదికపై కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు మేనేజ్మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ పద్మానంద్, అధికారి గ్రాంట్ తోర్నాటన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏటా రూ.1000 కోట్ల టర్నోవర్: ఈ పార్కు ఏర్పాటుకు అయ్యే రూ.100 కోట్ల వ్యయంలో కేంద్రం 50 శాతం, రాష్ట్రం 25 శాతం, స్పెషల్ పర్పస్ వెహికిల్ కోటాలో యజమానులు 25 శాతం వాటా భరించాల్సి ఉంటుందన్నారు. ఏటా రూ.1000 కోట్ల టర్నోవర్ గల ప్లాస్టిక్ పార్కు ఏర్పాటుతో 200 మంది ప్రమోటర్స్కు, 5 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు.