
సాక్షి, అమరావతి బ్యూరో/మాచర్ల: జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సన్మానించనున్నారు. 75వ స్వాతంత్య్ర దిన వేడుకల ప్రారంభంలో భాగంగా జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి కుటుంబసభ్యులను సన్మానించేందుకు శుక్రవారం మధ్యాహ్నం గుంటూరు జిల్లా మాచర్లకు సీఎం జగన్ వస్తున్నారని గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పింగళి వెంకయ్య కుమార్తె ఘంటశాల సీతామహాలక్ష్మి మాచర్ల వాసి. సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ గురువారం మాచర్ల వెళ్లి పర్యవేక్షించనున్నారు. ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏర్పాట్లలో పాలుపంచుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment