pingali venkayya
-
పింగళి పేరుతో పోస్టల్ స్టాంప్ విడుదల
సాక్షి, ఢిల్లీ: జాతీయ జెండా రూపకర్త, తెలుగు తేజం పింగళి వెంకయ్య జయంతి ఉత్సవాల సందర్భగా.. ఢిల్లీలో ఘనంగా తిరంగా ఉత్సవ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా.. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యకు ఈ కార్యక్రమంలో నివాళి అర్పించింది కేంద్రం. ఢిల్లీ ఇందిరాగాంధీ స్టేడియంలో మంగళవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో పింగళి పేరుతో పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. అంతేకాదు.. హర్‌ఘర్ తిరంగా పాటను సైతం విడుదల చేశారు. -
పింగళి చిత్రపటానికి నివాళలు అర్పించిన గవర్నర్ బిశ్వభూషణ్
-
జాతీయ జెండా రూపకర్తకు భారతరత్న ఇవ్వాలని కుటుంబసభ్యుల డిమాండ్
-
విశాఖలో ఘనంగా పింగళి వెంకయ్య జయంతి వేడుకలు
-
గుంటూరు జిల్లాతో పింగళికి ప్రత్యేకానుబంధం
మనం ఈ రోజు అనుభవిస్తున్న స్వాతంత్య్రం ఎందరో మహానుభావుల త్యాగఫలం. జాతీయోద్యమంలో గళమెత్తిన మన ప్రాంతవాసులెందరో.. వీరిలో జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య ఒకరు. ఉమ్మడి గుంటూరు జిల్లాతో ఆ మహానుభావునికి ప్రత్యేక అనుబంధం ఉంది. నేడు ఆయన జయంత్యుత్సవం సందర్భంగా మహనీయుని మధుర స్మృతులను ఓసారి మననం చేసుకుందాం. సాక్షి, టూరు: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా జాతీయ జెండా రూపకర్త, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146వ జయంత్యుత్సవాన్ని వైభవంగా నిర్వహించింది. ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. జిల్లాలో స్థిరపడిన పింగళి కుటుంబం పింగళికి ఉమ్మడి గుంటూరు జిల్లాతో ప్రత్యేక అనుబంధముంది. 1913 బాపట్లలో సర్ బయ్యా నరసింహేశ్వర శర్మ అధ్యక్షతన జరిగిన ప్రథమ ఆంధ్ర మహాసభలో పింగళి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. ఆ తర్వాత పలుమార్లు జిల్లాను సందర్శించి ఇక్కడి నాయకులతో కీలక సమావేశాలు నిర్వహించారు. జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు ఉన్నవ లక్ష్మీనారాయణ, కొండా వెంకటప్పయ్య పంతులు, పావులూరి శివరామ కృష్ణయ్య తదితర ప్రముఖులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. పింగళి కుటుంబ సభ్యులు 50 ఏళ్ళ క్రితం ఉమ్మడి గుంటూరు జిల్లా మాచర్లలో స్థిరపడ్డారు. జెండా రూపకల్పనకు బీజం పడింది ఇలా.. అది 1906. కోల్‌కతా మహానగరంలో కాంగ్రెస్ జాతీయ మహాసభలు జరుగుతున్న సందర్భం. అప్పటి వరకు ఏ సభలు జరిగినా బ్రిటిషు జెండా ఆవిష్కరణ, వారి జాతీయ గీతం ఆలాపన ఆనవాయితీగా ఉండేది. ఆ సభలోనూ అదే తంతు జరగడం పింగళి వెంకయ్యకు నచ్చలేదు. ఇదే విషయాన్ని తన గురువు బాలగంగాధర్ తిలక్ వద్ద ప్రస్తావించారు. మనం స్వాతంత్య్రం సాధిస్తే మనకూ ఓ కొత్త జెండా వస్తోంది అని తిలక్ అన్న మాటలు పింగళి మనస్సులో బలంగా నాటుకున్నాయి. దీంతో ఆయన జాతీయ జెండా రూపకల్పనపై దృష్టిసారించారు. వివిధ దేశాల జెండాలను పరిశీలించి సుమారు 30 నమూనాలను తయారు చేశారు. ఈ క్రమంలోనే మరి కొందరు దేశ భక్తులూ జాతీయ జెండా నమూనాలు తయారు చేసే యత్నం చేశారు. పింగళి 1916లో ‘ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా’ (భారత దేశానికి ఒక జాతీయ పతాకం) పుస్తకాన్ని రచించారు. ఇందులోని ప్రధాన అంశాలు ఆంధ్ర పత్రిక, కృష్ణా పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమయ్యాయి. అప్పటి ప్రముఖ స్వాత్రంత్య్ర సమరయోధులు దాదాబాయ్ నౌరోజీ, బాలగంగాధర్ తిలక్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ తదితరులు ఈ పుస్తకాన్ని కొనియాడారు. ఫలితంగా ఈ పుస్తకం గాంధీ మహాత్ముడి దృష్టిలో పడింది. మహాత్ముని సూచనల మేరకు 1921లో విజయవాడలో జాతీయ కాంగ్రెస్ మహా సభ జరుగుతున్న సమయంలో పింగళి మహాత్మా గాంధీని కలిశారు. ఆయన అభీష్టం మేరకు తొలుత కేవలం పచ్చ, ఎరుపు రంగులతో జాతీయ జెండాను రూపొందించారు. ఆ తర్వాత మహాత్ముడి సూచనలు, సలహాల మేరకు త్రివర్ణ పతాకం రూపొందింది. మొదట్లో మధ్యలో రాట్నం గుర్తు ఉండేది. ఆ తర్వాత అనేక మార్పులు జరిగి 1947లో స్వాతంత్య్రం సిద్ధించే నాటికి మువ్వన్నెల జెండా మధ్యలో అశోక చక్రంతో దేశ ప్రజల ముందు ఆవిష్కృతమైంది. జాతీయ జెండా రూపకల్పనలో పింగళి కృషిని మహాత్మా గాంధీ ‘ది యంగ్ ఇండియా’ పత్రికలో రాసిన వ్యాసంలో ప్రత్యేకంగా కొనియాడడం విశేషం. పింగళి కుటుంబానికి సీఎం సముచిత గౌరవం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఏడాది మార్చి 12న మాచర్లలో పింగళి కుమార్తె సీతా మహాలక్ష్మిని సముచితంగా సత్కరించారు. రూ.75 లక్షల చెక్కు, మెమెంటో అందజేశారు. ఇటీవల సీతామహాలక్ష్మి మరణిస్తే ఆమె అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. ఈనెల 1 నుంచి 15 వరకు జరగనున్న ప్రత్యేక కార్యక్రమాల్లో పింగళి జయంత్యుత్సవం ఘనంగా నిర్వహించేలా చర్యలు చేపట్టారు. గుంటూరు కలెక్టరేట్లో పింగళి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పింగళి కుటుంబ సభ్యులు కూడా ముఖ్యమంత్రి ఔదార్యాన్ని ప్రశంసించడం, ఆయనకు ధన్యవాదాలు తెలపడం గమనార్హం. తాత జ్ఞాపకాలు అజరామరం జాతీయ జెండా రూపకల్పన చేసిన మా తాత పింగళి వెంకయ్యను ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా కీర్తించడం సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మా కుటుంబంపై చూపుతున్న ప్రత్యేకాదరణకు ధన్యవాదాలు. నాకు పదిహేడేళ్ల వయస్సులో తాత మరణించారు. ఆయనతో నాకున్న కొద్దిపాటి జ్ఞాపకాలు ఎప్పటికీ అజరామరమే. – జి.వి.ఎన్.నరసింహం, పింగళి వెంకయ్య మనవడు, పింగళి జీవిత చరిత్ర రచయిత పింగళికి భారతరత్న ఇవ్వాలి కేవలం జాతీయ జెండా రూపకల్పన మాత్రమే కాకుండా దేశ స్వాతంత్య్రోద్యమంలో కీలక భూమిక పోషించిన బహుముఖ ప్రజ్జాశాలి, బహు భాషా కోవిధుడు పింగళి వెంకయ్యకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని ప్రధాని మోదీకి పలుమార్లు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా పింగళికి తగిన గౌరవం ఇవ్వడంతో సర్కారు సహకారంతో ముందుకెళ్తాం. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా పింగళిని స్మరించుకోవడం సంతోషం. – స్వామి జ్ఞానప్రసన్న, అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు -
చైతన్య భారతి: పతాక యోధుడు.. పింగళి వెంకయ్య
రెండో బోయర్ యుద్ధంలో పింగళి వెంకయ్యకీ, గాంధీజీకీ స్నేహం కుదిరింది. ఐదు దశాబ్దాల పాటు కొనసాగింది. ఆ పరిచయంతో, స్వాతంత్యోద్య్రమకారుడిగా తన అనుభవంతో వెంకయ్య జెండాకు రూపకల్పన చేశారు. దక్షిణాఫ్రికాలోని విట్వాటర్సాండ్ బంగారు గనుల మీద ఆధిపత్యం గురించి ఆఫ్రికన్లు (బోయర్లు) చేసిన తిరుగుబాటుకే బోయర్ యుద్ధమని పేరు. దక్షిణాఫ్రికా రిపబ్లిక్, ఆరెంజ్ ఫ్రీ స్టేట్లు బ్రిటిష్ జాతితో చేసిన యుద్ధమిది. ఆ యుద్ధంలో క్షతగాత్రులకు సేవ చేయడానికి గాంధీజీ నెటాల్ ఇండియన్ అంబులెన్స్ దళాన్ని ఏర్పాటు చేశారు. 19 ఏళ్ల వయసులో పింగళి వెంకయ్య బ్రిటిష్ సైనికునిగా అదే యుద్ధంలో పాల్గొన్నారు. తరువాత ఇద్దరూ స్వదేశం చేరుకుని స్వరాజ్యం కోసం పోరాడారు. శాసనోల్లంఘన ఉద్యమ సమయంలో, అంటే 1921లో గాంధీజీ భారత జాతీయ కాంగ్రెస్ ఉద్యమానికి ఒక పతాకం అవసరమని భావించారు. ఆ పని పింగళి వెంకయ్యకు తనకు తానై స్వీకరించారు. 1921లో గాంధీజీ బెజవాడ వచ్చినప్పుడు వెంకయ్య కలుసుకున్నారు. జెండా గురించి ప్రస్తావన వచ్చింది. తన పరిశోధనను, ప్రచురణను వెంకయ్య గాంధీజీకి చూపించారు. గాంధీజీ కూడా సంతోషించారు. ఉద్యమానికి అవసరమైన పతాకం గురించి ఆయన వెంకయ్యగారికి సూచించారు. స్థలకాలాలతో సంబంధం లేకుండా అందరినీ ఉత్తేజితులను చేయగలిగిన జెండా కావాలని గాంధీ ఆకాంక్ష. మువ్వన్నెలలో గాంధీజీ తెల్లరంగును, వెంకయ్య కాషాయం ఆకుపచ్చ రంగులను సూచించారు. దీనికి ఆర్యసమాజ్ ఉద్యమకారుడు లాలా హన్స్‌రాజ్ ధర్మచక్రాన్ని సూచించారు. ‘‘ఒక జాతికి పతాకం అవసరం. పతాకాన్ని రక్షించుకునే పోరాటంలో లక్షలాది మంది కన్నుమూస్తారు. జెండా విగ్రహారాధన వంటిదే అయినా, చెడును విధ్వంసం చేసే శక్తి ఉన్నది. బ్రిటిష్ వాళ్లు వారి జెండా యూనియన్ జాక్‌ను ఎగురవేస్తే అది వారికి ఇచ్చే ప్రేరణ గురించి చెప్పడానికి మాటలు చాలవు.’’ అన్నారు గాంధీజీ. ఆఖరికి ధర్మచక్రంతో కూడిన త్రివర్ణ పతాకాన్ని 22 జూలై, 1948న జాతీయ పతాకంగా భారత జాతి స్వీకరించింది. వెంకయ్య 1876 ఆగస్టు 2న కృష్ణాతీరంలోని భట్లపెనుమర్రులో జన్మించారు. 1963 జూలై 4న బెజవాడలో పేదరికంతో ఒక తాటాకు ఇంట్లో కన్నుమూశారు. -
ఏపీలో పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలు
సాక్షి, అమరావతి: జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ప్రారంభించారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పింగళి జీవిత చరిత్రపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం ప్రారంభించి, తిలకించారు. సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రేగుళ్ల మల్లిఖార్జునరావు స్వయంగా చిత్రించిన పింగళి వెంకయ్య చిత్రపటాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్) జీవీడీ.కృష్ణమోహన్, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, మొండితోక అరుణ్‌కుమార్, చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, సమాచార శాఖ కమిషనర్ తమ్మా విజయ్‌కుమార్ రెడ్డి, సీఎంవో అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. పింగళి వెంకయ్య స్వస్థలం కృష్ణా జిల్లా భట్లపెనుమర్రు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, నగరిలో మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో జయంత్యుత్సవాలు నిర్వహిస్తున్నారు. అలాగే, పింగళి వెంకయ్యపై రూపొందించిన ప్రత్యేక కవర్‌ను పోస్టల్ శాఖ ఆవిష్కరించింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
AP: అధికారిక లాంఛనాలతో పింగళి కుమార్తె అంత్యక్రియలు
సాక్షి, అమరావతి: జాతీయ పతాకరూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఉదయం అధికారులను ఆదేశించారు. పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతా మహాలక్ష్మి (100) కన్నుమూసిన సంగతి తెలిసిందే. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని ప్రియదర్శిని కాలనీలో కుమారుడు జీవీ నరసింహారావు ఇంట్లో గురువారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు. విషయం తెలియగానే.. ఏపీ సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. చాలా రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. కిందటి ఏడాది స్వయంగా మాచర్లకు వెళ్లి ఆమెను సత్కరించి ఆప్యాయంగా పలకరించారు సీఎం జగన్. ఆపై సాయం కింద రూ.75 లక్షల చెక్కును అందజేశారు కూడా. -
పింగళి కుమార్తెకు మహాత్మాగాంధీ వంశీ- శుభోదయం అవార్డు ప్రదానం
వంశీ ఇంటర్నేషనల్`ఇండియా, శుభోదయం గ్రూప్-ఇండియా, సంయుక్త ఆధ్వర్యంలో ఆన్లైన్ వేదికగా మహాత్మాగాంధీ 152వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జయంతి వేడుకల్ని పురస్కరించుకొని జాతీయజెండా రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మికి ‘మహాత్మాగాంధీ వంశీ-శుభోదయం అవార్డు-2021’ని బహుకరించారు. ఈ అవార్డు ప్రదానం మాచర్లలోని వారి స్వగృహంలో ఆమె కుమారులు జి.వి.ఎన్. నరసింహం ఆధ్వర్యంలో కన్నులపండుగగా నిర్వహించారు. వంశీ వ్యవస్థాపకులు శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు, లయన్ డాక్టర్ లక్ష్మీప్రసాద్, చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శుభోదయం గ్రూప్ నిర్వహణలో 5 ఖండాల నుంచి జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొని జాతిపితకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖనటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ జమున రమణారావు గాంధీ దేశానికి చేసిన సేవల్ని కొనియాడారు. మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ ‘నేటి యువతకు మహాత్ముని సేవల్ని గుర్తు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ప్రసాద్ గొల్లనపల్లి ,సుద్దాల అశోక్‌తేజ, మాధవపెద్ది సురేష్, రేలంగి నరసింహారావు, భువనచంద్ర, ఉపేంద్ర చివుకుల ,చిట్టెన్రాజు వంగూరి ,ప్రసాద్ తోటకూర, శ్రీరామ్ శొంఠి, శ్రీనివాస్ గూడూరు, వెంకట్ ఎక్కా, శ్రీదేవి జాగర్లమూడి ,హరి ఇప్పనపల్లి,గుణసుందరి కొమ్మారెడ్డి, లలితారామ్,రత్నకుమార్ కవుటూరు,జయ పీసపాటి , జొన్నలగెడ్డ మూర్తి ,సత్యాదేవి మల్లుల,అనిల్‌కుమార్ కడించెర్ల, వెంకట సురేష్, తాతాజీ ఉసిరికల,వెంకటేశ్వరరావు తోటకూర,రాజేశ్ ఎక్కలి, జి. కృష్ణకిరణ్, జి. ప్రియాంక , టి. శైలూష, జి. కృష్ణ ప్రవీణ్, ఎమ్. ఛాయాదేవి, జి. వెంకటేశ్వరి, ఆర్. శైలజ, జి. గోపీకృష్ణ,ఎస్.ప్రత్యూష,వి.ఆర్.ఆర్.పద్మజ, బొమ్మన గౌరీదేవి, తెన్నేటి సుధ, శైలజ సుంకరపల్లి,విద్యార్థిని అనఘదత్త రామరాజు తదితరులు పాల్గొన్నారు. -
స్వాతంత్య్ర సాధనకు అండ.. జాతీయ జెండా
జాతీయోద్యమంలో తొలిసారిగా 1916లో లక్నో జాతీయ కాంగ్రెస్ సభలో జాతీయపతాకను ఎగరవేశారు. పింగళి వెంకయ్య గొప్ప స్వాతంత్య్ర సమర యోధులు. 1919లో జలంధర్‌కు చెందిన లాలాహన్స్‌రాజ్ మన జాతీయ పతాకంపై రాట్నం చిహ్నం ఉంటే బాగుంటుందని సూచించగా గాంధీజీ అంగీకరించారు. 1921 లో అఖిలభారత కాంగ్రెస్ మహాసభలు విజయవాడలో జరిగాయి. ఆ సభలో గాంధీజీ బందరు ఆంధ్రజాతీయ కళాశాల అ«ధ్యాపకులుగా పనిచేస్తున్న పింగళి వెంకయ్యను పిలిపించి కాషాయం, ఆకుపచ్చ, మధ్యలో రాట్నం ఉండేలా జాతీయ జెండాను రూపొందించాలని కోరారు. వెంకయ్య వెనువెంటనే జాతీయ పతాకాన్ని రూపొందించి కాంగ్రెస్ పార్టీకి అందించారు. ఆ తర్వాత సత్యం, అహింసలకు ప్రత్యేక నిదర్శమైన తెలుపు రంగు కూడా ఉండాలని గాంధీజీ చెప్పడంతో ఆ జెండాలో అదనంగా తెలుపురంగును చేర్చడంతో మూడు రంగులతో నేటి త్రివర్ణ పతాకాన్ని దేశానికి అందించారు. ఆ జెండా ఆంధ్రదేశంలోనే ఆవిర్భవించడం మనకు గర్వకారణం. తొలిరోజుల్లో జాతీయ పతాకంలోని రంగులు జాతిమతాలకు సంకేతాలకు భావించారు. క్రమేపీ అవి జాతి మతాతీత సంపదలుగా నిర్ధారించబడ్డాయి. కుంకుమపువ్వు (కాషాయం)శౌర్యానికి, త్యాగశీలానికి ప్రతీక. ఆకుపచ్చరంగు అకుంఠిత భక్తి విశ్వాసానికి, శూరత్వానికి సంకేతం. తెలుపు స్వాతంత్య్ర పోరాట ప్రాతిపదికైన సత్యం, అహింసలకు ప్రత్యేక నిదర్శనంగా నిలిచాయి. స్వాతంత్య్రం అనంతరం రాజ్యాంగ పరిషత్ నెహ్రూ గారి సూచన మేరకు రాట్నానికి బదులుగా అశోక ధర్మచక్రాన్ని నిర్ణయించింది. అందులోనూ రాట్న చిహ్నమైన చక్రం ఉండటం గమనార్హం. పింగళి వెంకయ్య కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపాన భట్లపెనుమర్రు గ్రామంలో 1876 ఆగస్టు రెండోతేదీన జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వెంకటరత్నమ్మ, హనుమంతరాయుడు దివితాలూకా యార్లగడ్డ గ్రామ కరణం. వెంకయ్య బాల్యం నుండి ప్రతిభావంతమైన విద్యార్థి. 19వ ఏటా బొంబాయి వెళ్లి సైన్యంలో చేరాడు. దక్షిణ ఆఫ్రికాలో ఉన్న మహాత్మగాంధీతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం దాదాపు అర్థ శతాబ్దంపాటు కొనసాగింది. స్వాతంత్య్ర సాధనకు దేశమంతటా జెండా సత్యగ్రహ ఉద్యమాలు ఆయా రాష్ట్రాల్లో విజయవంతంగా సాగాయి. 1923 మే ఒకటో తేదీన ‘జెండా సత్యగ్రహ ఉద్యమం’ తొలిసారిగా ప్రారంభమైంది. అందులో వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది స్త్రీ, పురుషులు జాతీయ అభినివేశంతో పాల్గొన్నారు. ఆంధ్రప్రాంతం నుండి తొలిసారిగా సుభద్రాదేవి అనే మహిళా వాలంటీర్ ఈ ఉద్యమంలో పాల్గొంది. ఉద్యమం విజయవం తం కావడంతో జెండాకు ఒక పవిత్రత, సార్వజనీనత, గౌరవ ప్రాముఖ్యాలు ఏర్పడ్డాయి. దీంతో సభలన్నింటిలో జాతీయ జెండా ప్రాధాన్యత సంతరించుకుంది. జెండా ప్రతిష్టకోసం ప్రాణాలొడ్డి లాఠీ బాధలు భరించి, జరిమానాలతో నష్టపోయిన వారెందరో ఉన్నారు. ఆ సందర్భంగా ఎందరో ప్రముఖ రచయిత లు జెండాను కీర్తిస్తూ ప్రశంసగీతాలు రాశారు. వాటిలో గురుజాడ రాఘవశర్మ రాసిన ‘జెండా ఎత్తరా జాతికి ముక్తిరా’ ప్రజల్లో గొప్ప ఉత్తేజాన్ని రేపింది. సుంకర సత్యనారాయణ రాసిన ‘ఎగురవే జెండా.. శాంతిదూతగా జాతీయజెండా –యుగయుగంబుల జగతినెగురవే జెండా సౌఖ్య ప్రదాతగా స్వాతంత్య్ర జెండా’ అనే గీతం ప్రజల్లో జెండా పట్ల మరింత గౌరవాన్ని పెంచింది. ఎందరో పోరాటవీరుల త్యాగఫలితంగా జాతీయ జెండా అండగా స్వాతంత్య్రాన్ని సాధించాం. ఇటీవల మాచర్లలో పింగళి వెంకయ్యగారి కుమార్తె సీతామహాలక్ష్మి ఆర్థిక ఇబ్బందులను గుర్తించి స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి రూ.75 లక్షల నగదు ఇచ్చి సహకరించడం ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మానవతా దృక్పధానికి నిదర్శనంగా నిలుస్తోంది. వెంటనే పింగళి వెంకయ్య గారికి భారతరత్న ఇవ్వాలంటూ భారత ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. భారత జాతికి స్ఫూర్తిగా నిలిచిన మన జాతీయ జెండా, ఆ జెండా రూపకర్త పింగళికి ‘భారతరత్న’ బిరుదు లభిస్తే ఆ మహనీయుడికి నిజమైన నివాళి లభించినట్లే. -డా. పీవీ సుబ్బారావు (పింగళి వెంకయ్య శతజయంతి సందర్భంగా) వ్యాసకర్త సాహీతి విమర్శకులు: 98491 77594 -
హృదయాన్ని తాకింది
సాక్షి నెట్వర్క్: మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్న వేళ.. ప్రజల్లో దేశ భక్తి పెంపొందించే విధంగా చేపట్టిన ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’ సందర్భంగా జాతీయ పతాకం రూపకర్త పింగళి వెంకయ్యను భారత రత్నతో సత్కరించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాయడం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఆ లేఖలో సీఎం ప్రస్తావించిన పలు అంశాలపై రెండు రోజులుగా చర్చ జరుగుతోంది. పింగళి వెంకయ్యకు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలన్నది ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అంటూ లేఖ ప్రారంభించి.. వెంకయ్య ప్రస్థానాన్ని కళ్లకు కట్టినట్టు సమగ్రంగా వివరించారని కొనియాడుతున్నారు. మరణానంతరం ఎంతో మందికి భారత రత్న ఇచ్చారని, దేశం కోసం పాటుపడిన పింగళి వెంకయ్యకు సరైన గుర్తింపు రానందున అదేరీతిలో ఇప్పుడైనా భారతరత్నతో గౌరవించాలని కోరడం సందర్భోచితమని మెచ్చుకుంటున్నారు. ఇదే సమయంలో వెంకయ్య కూతురు సీతామహాలక్ష్మి ఉంటున్న గుంటూరు జిల్లా మాచర్లకు స్వయంగా వెళ్లి ఆమెను సన్మానించడం, రూ.75 లక్షలు సాయంగా అందజేయడం గొప్ప విషయమని చెబుతున్నారు. ఆమె కుటుంబ సభ్యులతో సీఎం జగన్ ఆప్యాయంగా మాట్లాడి.. నాటి విశేషాలను తెలుసుకోవడం చూస్తుంటే ఆనందంతో తమ కళ్ల నుంచి ఆనంద భాష్పాలు రాలాయని పలువురు స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబీకులు ‘సాక్షి’కి తెలిపారు. అజాది కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న తరుణంలో సీతామహాలక్ష్మికి ఒక సీఎంగా వైఎస్ జగన్ తగిన గౌరవం ఇచ్చారని ప్రశంసించారు. ‘పింగళి వెంకయ్య కుటుంబాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించడం చూస్తుంటే దేశాన్ని గౌరవించినట్లనిపించింది’ అంటూ పలువురు భావోద్వేగంతో చెప్పారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్య్ర సమరయోధులు, వారి కటుంబ సభ్యుల స్పందనలు ఇలా ఉన్నాయి. గతంలో ఎవ్వరూ ఇలా గుర్తించలేదు సీఎం వైఎస్ జగన్.. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబం వద్దకు స్వయంగా వెళ్లి పలకరించారని నా కుమారుడు రవీంద్రకుమార్‌రెడ్డి చెప్పారు. ఆ మాట వినగానే నాకు చాలా సంతోషం కలిగింది. సీఎం స్వయంగా వెళ్లి వెంకయ్య కుటుంబ సభ్యులను పలకరించడం హర్షణీయం. దేశం కోసం పోరాడిన స్వతంత్య్ర సమరయోధులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తద్వారా ఈ తరం వారికి నాటి యోధుల గురించి తెలుస్తుంది. పింగళికి భారతరత్న ఇవ్వాలని సీఎం జగన్ ప్రధాన మంత్రికి లేఖ రాయడం అభినందనీయం. నా భర్త మాజీ చిత్తూరు ఎంపీ పొలకల నరసింహారెడ్డి తమ్ముడు. వారిద్దరూ 1923లో మద్రాసులోని లయోలా కాలేజీలో చదివేవారు. అప్పట్లో స్వాతంత్య్రం కోసం జరిగిన అనేక ఉద్యమాల్లో వారు పాల్గొన్నారు. నా భర్త ను బళ్లారిలోని అలిపోర్ జైలులో నాలుగు నెలలు బంధించారు. గతంలో ఏ ప్రభుత్వమూ స్వాతంత్య్ర సమర యోధులను పట్టించుకోలేదు.. గుర్తించలేదు. – పొలకల సరోజమ్మ (94), స్వాతంత్య్ర సమరయోధుడు పొలకల కృష్ణమూర్తి సతీమణి, రెడ్డివారిపల్లి, ఐరాల మండలం, చిత్తూరు జిల్లా సీఎం పరామర్శిస్తుంటే కన్నీళ్లు ఆపుకోలేకపోయాను జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య కుటుంబాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి పరామర్శించి సత్కరించడం దేశ భక్తికి నిదర్శనం. గత ప్రభుత్వాలు స్వాతంత్ర సమరయోధులను పట్టించుకున్న దాఖలాలు లేవు. గతంలో సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకోవాలంటే యుద్ధమే చేయాల్సి వచ్చేది. రాజన్న బిడ్డ స్వయంగా సమర యోధుని ఇంటికి వచ్చి పరామర్శించడం టీవీల్లో చూస్తుంటే కన్నీళ్లు ఆగలేదు. మా నాన్న డి.రంగారావు దేశం కోసం పడిన నరకం వర్ణించలేనిది. పలుమార్లు ఆయన్ను జైల్లో పెట్టారు. జనాన్ని సేకరించి, ఉద్యమ పాఠాలు చెబుతున్నారని శారీరకంగా కూడా హింసించారు. అవన్నీ ఈరోజు మళ్లీ నా కళ్ల ముందు మెదిలాయి. మా నాన్నకు 11 మంది సంతానం. నేను ఆయనకు 3వ కూతుర్ని. ప్రస్తుతం నా వయస్సు 76 ఏళ్లు. పెళ్లి చేసుకోకుండా ఆయనకు సేవ చేశాను. 16 ఏళ్ల క్రితం నాన్న చనిపోయారు. – డి.భానుమతి, మారుతి నగర్, కొర్లగుంట, తిరుపతి ఆనందదాయకం జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యతో స్వాతంత్య్ర సమరయోధులది విడదీయరాని సంబంధం. భారతదేశం కోసం ఓ పతాకం కావాలని జాతిపిత మహాత్మాగాంధీ పిలుపు నిచ్చినప్పుడు కృష్ణా జిల్లా కంకిపాడు నుంచి పింగళి వెంకయ్య జండాను తయారు చేసి చూపారు. దాని అర్థాన్ని వివరించి చెప్పడంతో గాంధీజీ సంతోషంగా అంగీకరించారు. అప్పట్లో కృష్ణా జిల్లా నుంచి ఉద్యమం నడిపిన వాళ్లలో నేను పిన్న వయస్కుడిని. గాంధీ గారు వన్‌టౌన్‌కు వచ్చినప్పుడు నేనూ వెళ్లాను. అప్పటి నుంచి ఉద్యమాల్లో పాల్గొన్నాను. అంతగొప్ప చరిత్ర ఉన్న పింగళి వెంకయ్య కుటుంబాన్ని గుర్తించి సీఎం వైఎస్ జగన్ అభినందించడం ఆనందదాయకం. – యెర్నేని నాగేశ్వరరావు (92), స్వాతంత్య్ర సమరయోధుడు, గుణదల, విజయవాడ గౌరవం దక్కింది స్వాతంత్య్ర సమరయోధులకు గుర్తింపు కరువైన ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్ బాబు పింగళి కుటుంబాన్ని పరామర్శించి, అండగా నిలవడం అభినందనీయం. ఇది స్వాతంత్య్ర సమరయోధులందరికీ ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నాం. మా త్యాగాలను గుర్తించి గౌరవించిన మొదటి ముఖ్యమంత్రి జగనే. ఆయన పాలనలో సమరయోధులకు గౌరవం దక్కింది. పైగా పింగళికి భారత రత్న ఇవ్వాలని ప్రధానికి లేఖ రాయడం సరైన సమయంలో సరైన చర్య. – రామ్పిళ్ల నరసాయమ్మ (93), స్వాతంత్య్ర సమర యోధురాలు, వన్‌టౌన్, విజయవాడ ఎంతో ఆనందంగా ఉంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను సత్కరించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. పింగళి కుటుంబాన్ని సత్కరిస్తుంటే రాష్ట్ర ప్రజలంతా గర్వంతో ఉప్పొంగిపోయుంటారు. మా ఆయన దేవినేని నారాయణస్వామి. 1920 అక్టోబర్ 31న రాకెట్లలో జన్మించారు. అనంతపురం మాజీ ఎమ్మెల్యే, ఎంపీగా అనంతపురం జిల్లా వాసులకు ఎంతో సుపరిచితులు. స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొని 1942 నుంచి నాలుగు సార్లు బళ్లారి లోని ఆల్లీ పూర జైలుకు వెళ్లొచ్చాడు. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ ఇప్పుడు స్వాతంత్య్ర సమర యోధులకు మళ్లీ గౌరవం పెంచారు. – దేవినేని కమలమ్మ, రాకెట్ల, ఉరవకొండ మండలం, అనంతపురం జిల్లా స్వాతంత్య్ర సమరయోధులకు గౌరవం పింగళి వెంకయ్య కుమార్తెను సీఎం వైఎస్ జగన్ సన్మానించడం అంటే స్వాతంత్య్ర యోధులందరికీ సన్మానం లాంటిది. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ధర్నాలు, సత్యాగ్రహాలు చేసి జైలు జీవితాలు గడిపి దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన వాళ్లలో నేనూ భాగస్వామి అయినందుకు గర్వంగా ఉంది. ఇవాళ మన ముఖ్యమంత్రి పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని ప్రధానికి లేఖ రాయడం హర్షించదగ్గ పరిణామం. సీఎం చర్యలను అభినందిస్తున్నాను. –అనుమల అశ్వత్త నారాయణ (96), స్వాతంత్య్ర సమర యోధుడు, నందనవనం, జరుగుమల్లి మండలం, ప్రకాశం జిల్లా గర్వంగా ఉంది.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పింగళి వెంకయ్య ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించటం ఎంతో ఆనందాన్ని కలిగించింది. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత సమరయోధుల చరిత్రను అందరికీ తెలిసేలా ఇటువంటి కార్యక్రమం చేపట్టడం ఆనందించదగ్గ విషయం. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించేందుకు చేసిన పోరాటాలకు గుర్తింపుగా అప్పుడప్పుడు సన్మానిస్తున్నారు. ప్రభుత్వమే ఇలాంటి వేడుకలను నిర్వహించటం వల్ల నేటి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. – తోట వెంకటభారతమ్మ, స్వాతంత్య్ర సమరయోధురాలు, మచిలీపట్నం సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా దేశభక్తిని ప్రజల్లో మరింతగా పెంపొందించాలి. ‘అజాది కా అమృత్ మహోత్సవ్ ’ నిర్వహించేందుకు కేంద్రం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు స్ఫూర్తిని కలిగించే విధంగా ఉండాలి. మువ్వెన్నల జెండా రూపకర్త పింగలి వెంకయ్యను భారతరత్నతో సత్కరించాల్సిన అవసరం ఉంది. ఈ విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాన మంత్రికి లేఖ రాయడాన్ని స్వాగతిస్తున్నాం. సమరయోధుల కుటుంబాలను ఆదరించాలి. ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలి. – గొద్దు దమయంతి, స్వాతంత్య్ర సమరయోధుడు జీఎల్నాయుడు భార్య, తామరాపల్లి, నరసన్నపేట మండలం, శ్రీకాకుళం జిల్లా ఆనందాన్నిచ్చింది.. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఇంటికి ముఖ్యమంత్రి వెళ్లి ఆమెను సన్మానించి గౌరవించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. స్వాత్రంత్య్ర పోరాట సమయంలో ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేసి బానిస బతుకుల నుంచి కాపాడిన వారిని అజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో గౌరవించడం గొప్ప విషయం. జాతిపిత గాంధీ సారవకోట వచ్చినప్పుడు మా కుటుంబ సభ్యులు ఆతిథ్య మివ్వడం ఎంతో ఆనందం కలిగించింది. – బోయిన రమణమ్మ, స్వాతంత్య్ర సమరయోధుడు బోయిన కామరాజు భార్య, సారవకోట, శ్రీకాకుళం జిల్లా పింగళి కుమార్తెకు సన్మానం అభినందనీయం ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రధాని మోదీ నిర్ణయించడం సంతోషకరం. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్మోహన్రెడ్డి జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మిని సన్మానించటం అభినందనీయం. పింగళి వెంకయ్యకు భారతరత్న బిరుదు ఇవ్వాలని సీఎం జగన్ లేఖ రాయడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ఇది నాలాంటి స్వాతంత్య్ర పోరాట యోధులకు ఎంతో సంతృప్తినిస్తుంది. – పావులూరి శివరామకృష్ణయ్య, స్వాతంత్య్ర సమరయోధుడు, గోవాడ, గుంటూరు జిల్లా సీఎం నిర్ణయం అభినందనీయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వయస్సులో చిన్నవాడైనప్పటికీ ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా బాగున్నాయి. అన్ని వర్గాలు, వయస్సుల వారికి విలువ, గౌరవాన్ని ఇస్తూ ఆయన పాలన సాగిస్తున్నారు. త్రివర్ణ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుటుంబాన్ని సీఎం స్వయంగా కలసి ఆయనకు ఉన్న దేశభక్తిని చాటుకున్నారు. అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులతో మమేకమై పలకరించిన తీరు అభినందనీయం. ఇటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టంగా చెప్పవచ్చు. – వరికూటి చెన్నయ్య, కొత్తపేట, కంచికచర్ల మండలం, కృష్ణా జిల్లా శభాష్ జగన్ స్వతంత్ర భారత దేశంలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రీ ఇంత మంచి పని చేయలేదు. మన రాష్ట్ర సీఎం జగన్ పింగళి వారసులను సన్మానించి స్వాతంత్య్ర సమరయోధులను తలెత్తుకొనేలా చేశారు. కేవలం ఆగస్టు 15, జనవరి 26న మొక్కుబడిగా మమ్మల్ని గుర్తు చేసుకునే వారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న కొద్ది మంది కోసం, వారి వారసుల కోసమైనా ఒక ప్రత్యేక భరోసా ఇస్తే బావుంటుంది. సీఎం జగన్ కృషికి ధన్యవాదాలు. నేను నా భర్తతో కలిసి గాంధీజీ పిలుపు నిచ్చిన పలు ఉద్యమాల్లో పాల్గొన్నాం. బళ్లారి, రాజ మండ్రి జైళ్లలో శిక్ష అనుభవించాం. – గరగ వెంకటరమణమ్మ, స్వాతంత్య్ర సమర యోధురాలు, విప్పర్రు, పశ్చిమగోదావరి జిల్లా -
పింగళి కుమార్తెకు సీఎం సన్మానం
సాక్షి, గుంటూరు: జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మిని శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సన్మానించారు. గుంటూరు జిల్లా మాచర్లలోని పీడబ్ల్యూడీ కాలనీలో ఆమె నివాసం ఉంటున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పింగళి వెంకయ్య కుమార్తెను, ఆమె కుటుంబ సభ్యులను కలిసి.. ఆమెను సన్మానించడం ద్వారా సీఎం రాష్ట్రంలో ఆ వేడుకలను ప్రారంభించారు. ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలు దేరి మాచర్ల చేరుకున్న సీఎం జగన్.. పింగళి కుమార్తె నివాసానికి చేరుకుని, జాతిపిత మహాత్మాగాంధీ, పింగళి వెంకయ్య చిత్రపటాలకు నివాళులు అర్పించారు. అనంతరం పింగళి కుటుంబ సభ్యులందరినీ పేరుపేరునా పలకరించి, వారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. ఉద్వేగానికి లోనైన క్షణాలు సీఎం వైఎస్ జగన్ తమ నివాసానికి స్వయంగా వచ్చి పేరు పేరునా పలకరించడంతో పింగళి కుటుంబ సభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. త్రివర్ణ పతాకంతో దేశానికి వన్నె తెచ్చిన కుటుంబాన్ని ప్రభుత్వం వందేళ్లకు గుర్తించిందని, స్వయంగా ఇంటికి వచ్చినందుకు సంతోషంగా ఉందని సీతామహాలక్ష్మి సీఎం జగన్ చేతిపై తలవాల్చి ఆనంద బాష్పాలు రాల్చారు. పింగళి జీవిత విశేషాలతో కూడిన చిత్రాలను సీఎంకు చూపారు. ఆసాంతం చిత్రాలను సీఎం తిలకించారు. సీతామహాలక్ష్మి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జాతీయ జెండాను గాంధీకి స్వయంగా తన తండ్రి పింగళి వెంకయ్య అందించారని, అలాగే తననూ గాంధీకి పరిచయం చేశారని సీతామహాలక్ష్మి ఆనాటి జ్ఞాపకాలను సీఎంతో పంచుకున్నారు. ఈ సందర్భంగా సీతామహాలక్ష్మికి శాలువా కప్పి, జాతీయ జెండా, మెమెంటోను సీఎం అందించారు. తన కుమారుడు నరసింహం రాసిన పింగళి జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆమె సీఎం జగన్‌కు అందజేశారు. అనంతరం పింగళి కుటుంబ సభ్యులందరూ సీఎంతో గ్రూప్ ఫొటో దిగారు. సీతామహాలక్ష్మి చెబుతున్న మాటలను సావధానంగా వింటున్న సీఎం వైఎస్ జగన్ రూ.75 లక్షల ఆర్థిక సాయం.. పింగళి వెంకయ్య కుమార్తెకు రూ.75 లక్షల ఆర్థిక సాయాన్ని సీఎం ప్రకటించారు. ఈ మేరకు జారీ చేసిన ఉత్తర్వుల తాలూకు ప్రతిని సీతామహాలక్ష్మికి సీఎం అందజేశారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా చేపట్టే కార్యక్రమాల్లో పింగళి కుటుంబ సభ్యులు భాగస్వాములు కావాలని, ఈ నెల 31న విజయవాడలో నిర్వహించే కార్యక్రమానికి తప్పక హాజరవ్వాలని సీఎం కోరారు. ఉదయం వరకూ తెలియదు సీఎం తనను పరామర్శించేందుకు వస్తున్నట్లు సీతామహాలక్ష్మికి కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం వరకు చెప్పలేదు. సీఎం ఇంటికి వస్తున్న విషయం ముందే చెబితే 99 ఏళ్ల వయసున్న ఆమె ఉద్వేగానికి లోనయ్యే అవకాశం ఉంటుందని చివరి వరకు విషయాన్ని దాచి ఉంచారు. కలెక్టర్లు, ఇతర అధికారులు వస్తున్నారని.. అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారని చెబుతూ వచ్చారు. సీఎం రాకకు కొద్దిసేపటి ముందు విషయాన్ని ఆమెకు చెప్పడంతో ఆమె తీవ్ర ఉద్వేగానికి లోనైనట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, అవంతి శ్రీనివాసరావు, శాసన మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీలు మోపిదేవి వెంకటరమణారావు, లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది.. పింగళి వెంకయ్య ఘనతను ఇన్నేళ్లకు ప్రభుత్వం గుర్తించడం సంతోషంగా ఉంది. పింగళిని నేటి తరం మరిచిపోతున్న పరిస్థితిలో ఆయన గొప్పదనాన్ని నేటి తరానికి తెలియజేసే విధంగా ప్రభుత్వం అడుగులు వేయడం హర్షణీయం. భారతరత్న అవార్డుకు అన్ని విధాలుగా అర్హత కలిగిన పింగళికి నేటికీ ఆ గౌరవం దక్కలేదు. భారతరత్న ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాయడం అభినందనీయం. సీఎం జగన్ మమ్మల్ని ఆత్మీయంగా పేరుపేరునా పలకరించారు. ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉంటున్నారు? అంటూ యోగ క్షేమాలు అడిగారు. పింగళి వెంకయ్య వారసులుగా మమ్మల్ని ఇన్ని రోజులకు సర్కార్ గుర్తించడం సంతోషకరం. ప్రభుత్వం చేపట్టే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాల్లో పాల్గొనాలని సీఎం చెప్పారు. మా కుటుంబం ఆ కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొంటుంది. – గంటసాల నరసింహం, గోపీ కృష్ణ, సీతామహాలక్ష్మి కుమారులు -
రూపకర్తకు నీరాజనం.. జెండాకు వందనం
సాక్షి, అమరావతి: జాతీయ జెండా రూపశిల్పి స్వర్గీయ పింగళి వెంకయ్యకు దేశీయ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ప్రజల్లో దేశ భక్తి పెంపొందించే విధంగా చేపట్టిన ‘అజాది కా అమృత్ మహోత్సవ్’ సందర్భంగా పింగళి వెంకయ్యను భారత రత్నతో సత్కరించాలన్నది ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అన్నారు. ఈ మేరకు శుక్రవారం సీఎం జగన్ ప్రధాన మంత్రికి నాలుగు పేజీల లేఖ రాశారు. లేఖలోని అంశాలు ఇలా ఉన్నాయి. సంబరాలు చేసుకునే సమయమిది.. అమితంగా ఇష్టపడే దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘అజాది కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాన్ని నిర్వహించాలన్న నిర్ణయంపై ముందుగా ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ నిర్ణయంతో 5 కోట్ల ఆంధ్రుల మనస్ఫూర్తిగా దేశ భక్తి, సంతోషాలతో నిండిపోయింది. మీ నాయకత్వంలో భారత ప్రభుత్వం చేపట్టిన ఈ స్మారక కార్యక్రమం దేశ చరిత్రలో సుదీర్ఘ కాలం నిలిచిపోతుంది. మన మాతృ దేశం ఇండియాకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆర్థికంగా, వాణిజ్యంగా, సరిహద్దు దేశాల నుంచి అకారణ ఒత్తిడులు వంటి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ అనేక చిరస్మరణీయమైన మైలు రాళ్లను నమోదు చేసుకుంది. ఏడు దశాబ్దాల ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ భారీ ఎత్తున సంబంరాలు చేసుకునే సమయమిది. ప్రతి ఇంటిపై జెండా ఎగరేయాలి.. ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాటు చేసిన జాతీయ కమిటీ తొలిసారి మార్చి8న సమావేశమైనప్పుడు ఈ సంబరాల్లో ప్రధానంగా 5 అంశాలను చేపట్టనున్నట్లు చెప్పారు. అందులో ఒకటి ‘హర్ ఘర్ జెండా’ పేరుతో ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ జాతీయ జెండా రూపకల్పనలో ఆపారమైన కృషి చేసిన పింగళి వెంకయ్య.. ఆ తర్వాత జెండా వెంకయ్యగా పిలుచుకునే వ్యక్తి గురించి మీ దృష్టికి తీసుకువస్తున్నాను. పింగళి వెంకయ్య 1876 ఆగస్టు 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నం వద్ద ఉన్న భట్ల పెనమర్రు అనే గ్రామంలో జన్మించారు. ఈయన మహాత్మా గాంధీ ఆశయాలకు, సిద్ధాంతాలకు ఆకర్షితులై ఆయన జీవితాన్ని స్వాతంత్య్ర సంగ్రామానికి అంకితం చేశారు. ప్రజల మనస్సును ప్రతిబింబించే విధంగా దేశానికి ఒకే జెండా ఉండాలన్న ఆలోచన రాగానే ప్రపంచంలోని వివిధ దేశాల జెండాలకు సంబంధించి శాస్త్రీయ పరిశోధన చేశారు. ఈ పరిశోధన జాతీయ జెండా రూపకల్పనకు ఎంతో దోహదం చేసింది. పింగళి వెంకయ్య 1916లో ‘ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా’ పేరుతో ఒక పుస్తకాన్ని ముద్రించారు. ఇందులో వివిధ దేశాల జెండాల గురించి, మన దేశ జాతీయ జెండా గురించిన అభిప్రాయాలు వివరించారు. 30కి పైగా జెండా ఆకృతులను తయారు చేసి, దాని రూపకల్పనకు గల కారణాలను పేర్కొన్నారు. దేశానికి ఒక జెండా ఉంటే స్వాతంత్య్ర పోరాటంలో ప్రజలు పాల్గొనడానికి శక్తిని ఇస్తుందంటూ బలంగా వాదించే వారు. 1921 మార్చి 31న మహాత్మా గాంధీ విజయవాడకు వచ్చినప్పుడు పింగళి వెంకయ్య ఆ జెండా ఆకృతులను బహూకరించారు. ఈ సందర్భంగా జెండా రూపకల్పనలో వెంకయ్య చూపిస్తున్న చొరవను గాంధీ ప్రత్యేకంగా మెచ్చుకోవడంతో పాటు ఇదే విషయాన్ని యంగ్ ఇండియా జర్నల్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. మచిలీపట్నం నేషనల్ కాలేజీలో పనిచేసే పింగలి వెంకయ్య వివిధ దేశాల జెండా ఆకృతులు, మన దేశా జెండాకు సంబంధించి వివిధ డిజైన్లను పేర్కొంటూ ఒక పుస్తకాన్ని రాశారని, జాతీయ జెండా రూపకల్పన చేసి దాన్ని ఆమోదింప చేసుకోవడానికి ఆయన చేస్తున్న కృషిని అభినందిస్తున్నా అంటూ ఆ జర్నల్‌లో గాంధీ పేర్కొన్నారు. 1947 జూలై 22న జాతీయ జెండాకు ఆమోదం తెలిపారు. ఈ విధంగా జాతీయ జెండా రూపశిల్పిగా ఆయన గుర్తింపు పొందారు. కానీ ఆయన జీవితం అంతగా గుర్తింపు లేకుండానే సాగిపోయింది. 1963 జూలై 4న ఆయన తుది శ్వాస విడిచారు. ఇప్పుడైనా ఇవ్వండి.. భారతదేశానికి గుర్తింపు తీసుకొచ్చిన జాతీయ పతాకం సృష్టికర్తను, ఆయన నిరుపమానమైన సేవలను ఈ దేశం కొన్ని దశాబ్ధాలుగా గుర్తించడం లేదు. బానిస బతుకుల నుంచి విముక్తి తీసుకువస్తూ లక్షలాది మంది భారతీయుల్లో స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని ఈ జెండా రగిల్చింది. ఈ సందర్భంగా పింగళి వెంకయ్యకు మరణానంతరం భారతరత్న ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇది ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చడంతో పాటు ఆంధ్రుల ఆకాంక్షను నెరవేర్చిన వారవుతారు. గతంలో కేంద్ర ప్రభుత్వం చాలా మంది ప్రముఖులకు మరణానంతరం భారతరత్న ఇచ్చి వారి సేవలను గుర్తించింది. భూపెన్ హాజారికా (1926–2011), నానాజీ దేశ్‌ముఖ్ (1916–2010)లకు 2019లో భారతరత్న ఇచ్చారు. అంతకు ముందు అరుణా ఆసిఫ్ ఆలీ, జయప్రకాష్ నారాయణ వంటి అనేక మంది ప్రముఖులకు కూడా ఇచ్చారు. మరణానంతరం పింగళి వెంకయ్యకు భారత రత్న ఇవ్వడం ద్వారా ఆయన జీవితానికి గుర్తింపు ఇవ్వడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షను గౌరవించాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. -
పింగళి కుటుంబసభ్యులకు సీఎం సన్మానం
సాక్షి, అమరావతి బ్యూరో/మాచర్ల: జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సన్మానించనున్నారు. 75వ స్వాతంత్య్ర దిన వేడుకల ప్రారంభంలో భాగంగా జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి కుటుంబసభ్యులను సన్మానించేందుకు శుక్రవారం మధ్యాహ్నం గుంటూరు జిల్లా మాచర్లకు సీఎం జగన్ వస్తున్నారని గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పింగళి వెంకయ్య కుమార్తె ఘంటశాల సీతామహాలక్ష్మి మాచర్ల వాసి. సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ గురువారం మాచర్ల వెళ్లి పర్యవేక్షించనున్నారు. ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏర్పాట్లలో పాలుపంచుకుంటున్నారు. -
సీఎంకు పింగళి వెంకయ్య చరిత్ర పుస్తకం
మాచర్ల: త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆయన మనవడు గోపీకృష్ణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి శుక్రవారం అందజేశారు. తమ తాతయ్య 100 సంవత్సరాల క్రితం త్రివర్ణ పతాకం రూపకల్పన చేశారని, ఆయన ప్రయత్నాన్ని అన్ని వర్గాలకూ తెలిపేందుకు తమ సోదరుడు జీవీఎన్ నరసింహం పుస్తకాన్ని రచించారని గోపీకృష్ణ తెలిపారు. -
పింగళిని స్మరించుకున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి : భారత జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళి అర్పించారు. ‘మన రాష్ట్రంలో జన్మించిన గొప్ప వ్యక్తి. స్వాతంత్ర్య సమరయోధుడు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చేసిన కృషి మరువలేనిది. అదే ఆయనను అజరామరుడిని చేసింది’ అని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు సీఎం ట్వీట్ చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ సమకాలికుల్లో ఒకరైన పింగళి వెంకయ్య 1876, ఆగస్టు 2న కృష్ణా జిల్లా, భట్ల పెనుమర్రులో జన్మించారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో ఎన్నో పతాకాలు వినియోగించినప్పటికీ.. పింగళి రూపొందించిన పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తిస్తూ మహాత్మాగాంధీ అధ్యక్షతన విజయవాడలో జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆ తర్వాత ఈ పతాకానికి కొద్దిగా మార్పులు చేశారు. గాంధీ సూచన మేరకు దానిపై 'రాట్నం' గుర్తు చేర్చారు. స్వాతంత్య్రానంతరం నాటి ప్రధాని నెహ్రూ సూచనమేరకు రాట్నం స్థానంలో అశోకచక్రం చేర్చారు. -
మువ్వన్నెల జెండాకు ముప్పాతికేళ్లు
మన భారతదేశపు జెండా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి రేపటికి 75 ఏళ్లు. 1943లో పోర్ట్‌బ్లెయిర్‌లోని సెల్యులార్ జైలులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ తొలిసారిగా ఈ జెండాను ఎగురవేశారు. తెలంగాణలోని ప్రస్తుత సూర్యాపేట జిల్లాలోని నడిగూడు గ్రామంలో పింగళి వెంకయ్య జెండా రూపనిర్మాణానికి బీజం వేశారు. కృష్ణాజిల్లా భట్ల పెనుమర్రులో హనుమంత రాయుడు, వెంకటరత్నమ్మలకు 2 ఆగస్టు 1878న జన్మించిన వెంకయ్య విద్యాభ్యాసం మచిలీ పట్నంలో జరిగింది. 1906లో కోల్‌కతాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సభలకు హాజరు కావడం, వందేమాతరం ఉద్యమాన్ని ప్రత్యక్షంగా చూడటం వెంకయ్య జీవితాన్ని మలుపుతిప్పింది. పింగళి వెంకయ్య ఓ అసాధారణ పత్తిరైతు. అమెరికా నుండి కంబోడియా రకం విత్తనాలు తెప్పించి, వాటిని దేశవాళీ వాటితో కలిపి సంకరజాతి పత్తిని సృష్టించారు. సూర్యాపేటలోని చల్లపల్లిలో జరిగిన ఈ ప్రయోగాలను గుర్తించిన లండన్‌లోని రాయల్ అగ్రికల్చరల్ సొసైటీ వెంకయ్యను ఫెలోషిప్తో గౌరవించింది. పరిశోధనలపై ఆసక్తితో కొలొంబో వెళ్లి సీనియర్ కేంబ్రిడ్జ్ పూర్తి చేశారు. భూగర్భ శాస్త్రంలో పీహెచ్డీ చేయ డంతోపాటు నవరత్నాలపై అధ్య యనం చేశారు. 1916లో ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా పేరిట పుస్త కాన్ని వెలువరిం చిన వెంకయ్య 1921 వరకు వివిధ దేశాల పతాకాలపై పరిశోధనలు చేశారు. వెంకయ్య తొలి సారి రూపొందించిన జెండాను కోల్‌కతాలోని బగాన్ పార్సీ దగ్గర ఎగురవేశారు. 22 జూలై 1948న ఆ జెండాను జాతీయపతాకంగా స్వీకరించారు. త్రివర్ణ పతాకంలో అశోక చక్రం ఉంచాలనే ఆలోచన కాంగ్రెస్ కమిటీ సభ్యురాలైన సురయా త్యాబ్జిది. త్రివర్ణంలోని కాషా యం సంపదను, తెలుపు జ్ఞానాన్ని, ఆకుపచ్చ రక్షణ శక్తిని సూచిస్తుండగా, 24 గీతలతో ఉన్న అశోక చక్రం నైతిక విలువల ధర్మానికి ప్రతీకగా నిలుస్తుంది. (జాతీయ జెండా ఎగురవేసి 30 డిసెంబర్ 2018నాటికి 75 ఏళ్లు) వ్యాసకర్త: గుమ్మడి లక్ష్మీనారాయణ మొబైల్ : 94913 18409 -
పింగళి జయంతిని పురస్కరించుకొని భారీ ర్యాలీ
విశాఖపట్నం : భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 138వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం విశాఖపట్నంలో 138 అడుగుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విశాఖపట్నంలోని జగదాంబ సెంటర్లో స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 138 అడుగుల జాతీయ పతాకంతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులతో పాటు పాఠశాల విద్యార్థులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. -
'ప్రసారాలలో హింసాత్మక అంశాలు తగ్గించాలి'
విజయవాడ: టెలివిజన్ ప్రజా జీవితంలో పెనవేసుకుపోయిందని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం విజయవాడలో ఆయన విజయవాడ దూరదర్శన్ సప్తగిరి ఛానెల్‌ను వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం వెంకయ్యనాయుడు ప్రసంగిస్తూ... పోటీ ప్రపంచంలో ఆలస్యానికి అర్థం లేదని అన్నారు. వార్తను వార్తగానే వ్యాఖ్యానాన్ని వ్యాఖ్యానంగానే చెప్పాలని ఆయన మీడియాకు హితవు పలికారు. సత్యానికి దగ్గరగా, సంచలనాలకు దూరంగా మీడియా పని తీరు ఉండాలని ఆకాంక్షించారు. టీవీ ఛానెళ్ల మధ్య పోటీతత్వం పెరిగిందన్నారు. విశ్వసనీయత తగ్గితే వెనకపడి పోవడం ఖాయమన్ని వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. టీవీలు, సినిమాలలో హింసాత్మక సంఘటనలు తగ్గించాలని సూచించారు. ఓ ఘటనను పదేపదే ప్రసారం చేస్తే మనుషుల మానసిక ప్రవర్తనపై ప్రభావం చూపుతుందని వెంకయ్యనాయుడు అన్నారు. దూరదర్శనకు 1417 ట్రాన్స్మీటర్లు, 32 ఛానెళ్లు ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు. దూరదర్శన్ కేంద్రానికి జాతీయ పతాక రూపశిల్పి, స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి వెంకయ్య పేరు పెట్టడం పట్ల వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. -
స్వాతంత్ర్య పోరాటంలో తెలుగుయోధులెందరో!
ఆంగ్లేయుల పాలన నుంచి భారత దేశ విముక్తి కోసం ఎంతో మంది పోరాడారు. ఆ పోరాటంలో తెలుగువారు భోగరాజు పట్టాభి సీతారామయ్య, పింగళి వెంకయ్య, దుర్గాబాయి దేశ్‌ముఖ్, కొండ వెంకటప్పయ్య, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య..... మేము సైతం అంటూ పాల్గొన్నారు. భోగరాజు పట్టాభిసీతారామయ్య : భారత జాతీయోద్యమ సమయంలో గాంధీజీచే ప్రభావితుడై స్వాతంత్ర్య ఉద్యమంలో చేరారు. అనతి కాలంలోనే గాంధీ మహత్ముడికి సన్నిహితుడై కాంగ్రెస్‌లో ప్రముఖ స్థానం పొందారు. 1948లో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత పార్లమెంటు సభ్యుడిగా, మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారు. కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నంలో ఆయన ఆంధ్రాబ్యాంక్‌ను స్థాపించారు. నాటి కృష్ణా జిల్లాలోని గుండుగొలను గ్రామం (ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా)లో భోగరాజు పట్టాభి సీతారామయ్య జన్మించారు. పింగళి వెంకయ్య : దేశానికి పతాకాన్ని అందించిన యోధుడు పింగళి వెంకయ్య. ఈయన కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలోని మొవ్వ మండలం భట్లపెనుమర్రులో వెంకయ్య జన్మించారు. చిన్నతనం నుంచి చురుగ్గా ఉండే ఆయన.. దక్షిణాఫ్రికాలో బోయర్ యుద్ధంలో పాల్గొన్నాడు. అక్కడే మహాత్మాగాంధీని కలిశాడు. భారత్ వచ్చిన వెంకయ్య... ఆ తర్వాత జెండా రూపొందించాలనే తలంపుతో 1916 లో "భారతదేశానికొక జాతీయ జెండా " అనే పుస్తకాన్ని ఇంగ్లీషులో రాసి ప్రచురించారు. ఆయన రూపొందించిన నాటి పతాకమే నేటి త్రివర్ణ జాతీయ జెండాగా రూపొందింది. దుర్గాబాయి దేశ్‌ముఖ్ : భారతీయ స్వాతంత్ర సమరయోధురాలు, న్యాయవాది, సామాజిక కార్యకర్త.. ఇలా భిన్న పార్శ్వాలున్న వ్యక్తి దుర్గాబాయి దేశ్‌ముఖ్. 1909, జులై 15న ఆమె తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. పదేళ్ల వయసులోనే హిందీ పాఠశాలను నెలకొల్పి అన్ని వయసులవారికీ బోధించేవారు. చిన్ననాటి నుంచే స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకుంది. తెలుగుగడ్డ పై మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకుని 12 ఏళ్ళ వయసులోనే ఈమె విరాళాలను సేకరించి ఆయనకు అందజేసింది. మహాత్ముని సూచన మేరకు మారు ఆలోచించకుండా తన చేతులకు ఉన్న బంగారు గాజులను కూడా విరాళంగా అందించింది. మహాత్ముడు ఆంధ్రదేశంలో పర్యటించినప్పుడు ఆయన ప్రసంగాలను దుర్గాబాయి తెలుగులోకి అనువదించేవారు. 1953లో ఆర్థికమంత్రి చింతామణి దేశ్ ముఖ్ తో వివాహం జరిగింది. కొండా వెంకటప్పయ్య : కొండా వెంకటప్పయ్య ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, దేశభక్త బిరుదాంకితుడు. ఇంకా చెప్పాలంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు. 1866 ఫిబ్రవరి 22వ తేదీన పాత గుంటూరులో కొండా వెంకటప్పయ్య జన్మించాడు. సహాయ నిరాకరణోద్యమం రోజులలో బీహార్‌కు డాక్టర్ రాజేంద్రప్రసాద్, తమిళనాడుకు రాజాజీ ఎలాంటివారో ఆంధ్రదేశానికి కొండా వెంకటప్పయ్య అలాంటివాడు. దుగ్గిరాల గోపాల కృష్ణయ్య : రామదండు అనే దళాన్ని స్థాపించి.. చీరాల - పేరాల ఉద్యమంతో ఒక్కసారిగా జాతీయస్థాయిలో పేరుప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తి ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాల కృష్ణయ్య. ఈయన1889 జూన్ 2 న కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలులో జన్మించారు. 1921 లో సహాయనిరాకరణోద్యమ సందర్భంగా గాంధీగారి ఉపన్యాసాలను అనువదించినందుకు ప్రభుత్వం ఈయనకు ఇచ్చిన భూమిని రద్దుచేసింది. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని ఏడాది పాలు తిరుచిరాపల్లి జైల్లో ఉన్నారు. 1923 లో అఖిలభారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. చీరాలపేరాలలో సమాంతర ప్రభుత్వాన్ని నిర్వహించిన ఘనత ఆయనదే. టంగుటూరి ప్రకాశం పంతులు : సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు. నిరుపేద కుటుంబంలో పుట్టి, ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి, మళ్లీ మరణించే సమయానికి కట్టుబట్టలతో మిగిలిన నిజాయితీపరుడు. 1940, 50లలోని ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందారు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించాడు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండె నుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందారు.