
వంశీ ఇంటర్నేషనల్`ఇండియా, శుభోదయం గ్రూప్-ఇండియా, సంయుక్త ఆధ్వర్యంలో ఆన్‌లైన్ వేదికగా మహాత్మాగాంధీ 152వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జయంతి వేడుకల్ని పురస్కరించుకొని జాతీయజెండా రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మికి ‘మహాత్మాగాంధీ వంశీ-శుభోదయం అవార్డు-2021’ని బహుకరించారు.
ఈ అవార్డు ప్రదానం మాచర్లలోని వారి స్వగృహంలో ఆమె కుమారులు జి.వి.ఎన్. నరసింహం ఆధ్వర్యంలో కన్నులపండుగగా నిర్వహించారు. వంశీ వ్యవస్థాపకులు శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు, లయన్ డాక్టర్ లక్ష్మీప్రసాద్, చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శుభోదయం గ్రూప్ నిర్వహణలో 5 ఖండాల నుంచి జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొని జాతిపితకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖనటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ జమున రమణారావు గాంధీ దేశానికి చేసిన సేవల్ని కొనియాడారు. మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ ‘నేటి యువతకు మహాత్ముని సేవల్ని గుర్తు చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ప్రసాద్ గొల్లనపల్లి ,సుద్దాల అశోక్‌తేజ, మాధవపెద్ది సురేష్, రేలంగి నరసింహారావు, భువనచంద్ర, ఉపేంద్ర చివుకుల ,చిట్టెన్‌రాజు వంగూరి ,ప్రసాద్ తోటకూర, శ్రీరామ్ శొంఠి, శ్రీనివాస్ గూడూరు, వెంకట్ ఎక్కా, శ్రీదేవి జాగర్లమూడి ,హరి ఇప్పనపల్లి,గుణసుందరి కొమ్మారెడ్డి, లలితారామ్,రత్నకుమార్ కవుటూరు,జయ పీసపాటి , జొన్నలగెడ్డ మూర్తి ,సత్యాదేవి మల్లుల,అనిల్‌కుమార్ కడించెర్ల, వెంకట సురేష్, తాతాజీ ఉసిరికల,వెంకటేశ్వరరావు తోటకూర,రాజేశ్ ఎక్కలి, జి. కృష్ణకిరణ్, జి. ప్రియాంక , టి. శైలూష, జి. కృష్ణ ప్రవీణ్, ఎమ్. ఛాయాదేవి, జి. వెంకటేశ్వరి, ఆర్. శైలజ, జి. గోపీకృష్ణ,ఎస్.ప్రత్యూష,వి.ఆర్.ఆర్.పద్మజ, బొమ్మన గౌరీదేవి, తెన్నేటి సుధ, శైలజ సుంకరపల్లి,విద్యార్థిని అనఘదత్త రామరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment