
విజయవాడ స్పోర్ట్స్: జాతీయ జూనియర్ బాలుర హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌ను ఆంధ్రప్రదేశ్ కైవసం చేసుకుంది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సోమవారం సాయంత్రం హోరాహోరీగా జరిగిన ఫైనల్స్‌లో ఆంధ్రప్రదేశ్ 35–30 తేడాతో రాజస్తాన్‌పై విజయం సాధించింది. 40 నిమిషాల పోరులో తొలి అర్ధ భాగం ముగిసే సరికి రాజస్తాన్ 2 పాయింట్లు ముందంజలో ఉండగా... రెండో అర్ధ భాగంలో చెలరేగిన ఆంధ్రప్రదేశ్ చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. విజేతలకు ఆంధ్రప్రదేశ్ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ చైర్మన్ మల్లాది విష్ణు, ఏపీ ఫైబర్‌నెట్ చైర్మన్ పి.గౌతంరెడ్డి, రాష్ట్ర హ్యాండ్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పి.సత్యనారాయణరాజు ట్రోఫీలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment